ఏపీలో బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ కోర్సు రెండో సంవత్సరంలో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీఈసెట్-2023 పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఏపీ ఉన్నత విద్యామండలి జూన్ 12న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది ఈసెట్ పరీక్ష నిర్వహణ బాధ్యతను జేఎన్‌టీయూ కాకినాడ చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 20న ఏపీఈసెట్-2023 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 


ఈసెట్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


పరీక్ష విధానం: 


మొత్తం 200 మార్కులకుగాను ఈసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 200 ఆబ్జె్క్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నల తీరు ఇంజినీరింగ్, ఫార్మసీ, బీఎస్సీ (మ్యాథ్స్) విభాగాలకు వేర్వేరుగా ఉంటాయి. 


ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజినీరింగ్ కళాశాలల్లో రెండో సంవత్సరం లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈసెట్-2023 నోటిఫికేషన్‌ మార్చి 8న విడుదలైన సంగతి తెలిసిందే. ఈసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ మార్చి 10 నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అయితే రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 11 నుంచి 15 వరకు. రూ.2000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 16 నుంచి 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే రూ.5000 ఆలస్య రుసుముతో మే 1 వరకు దరఖాస్తులు స్వీకరించారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను జూన్ 12న విడుదల చేశారు.


ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 20న ఈసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.  పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని జూన్ 23న విడుదల చేయనున్నారు. అనంతరం జూన్ 25 వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఆ తర్వాతే ఈసెట్ ఫలితాలను వెల్లడిస్తారు. ఫలితాల వెల్లడి తేదీని ఇప్పటివరకు ప్రకటించిలేదు.


Also Read:


జూన్ 14న ఏపీ ఎడ్‌సెట్‌ పరీక్ష, వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో!
ఏపీలోని బీఈడీ, స్పెషల్‌ బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు 'ఏపీ ఎడ్‌సెట్‌-2023 పరీక్షను జూన్ 14న నిర్వహించనున్నట్లు ఏపీ ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ ఆచార్య కె.రాజేంద్రప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 14న ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఎడ్‌సెట్ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
హాల్‌టికెట్లు, పరీక్ష విధానం కోసం క్లిక్ చేయండి..


పేద విద్యార్థులకు సహకారం - ‘విద్యాధన్’ ఉపకారం! ఎంపిక, స్కాలర్‌షిప్ వివరాలు ఇలా!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 2023 విద్యా సంవత్సరం ఇంటర్ చదువుతున్న 120 మంది పేద విద్యార్థులకు ‘విద్యాధన్’ స్కాలర్‌షిప్‌లు విద్యాధన్ పేరిట సరోజిని దామోదరన్‌ ఫౌండేషన్‌ స్కాలర్‌షిప్‌లు అందజేస్తోంది. 90 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్థుల కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.2 లక్షలలోపు ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు జూన్‌ 15, తెలంగాణ విద్యార్థులు జూన్‌ 20 వరకు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. స్కాలర్‌షిప్‌‌కు ఎంపికైన విద్యార్థులకు ఇంటర్‌లో ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.10 వేల చొప్పున, వారు డిగ్రీలో చేరితే రూ.10 వేల నుంచి రూ.60 వేల వరకు స్కాలర్‌షిప్‌‌లు అందచేస్తారు. 
స్కాలర్‌షిప్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..