Alluri Sitaramaraju District : అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపెల్లి పంచాయితీ బూరిగ గ్రామంలో 40 కుటుంబాలు వారు కొండ శిఖర్ గ్రామంలో జీవనం సాగిస్తున్నారు. కరెంటు సౌకర్యం లేని గ్రామం. ఏదైనా అనారోగ్యం వస్తే బూరుగ గ్రామం నుండి వాణిజ గ్రామం మెంటాడ మండలం ఎనిమిది కిలోమీటర్లు డోలు కట్టుకొని వాణిజ గ్రామం వరకు తీసుకెళ్లే పరిస్థితి ఉంది. అక్కడి నుంచి ఆటోలో మెంటాడ ప్రభుత్వాసుపత్రికి డోలి ప్రయాణం వారిని ఇబ్బందులకు గురిచేస్తోంది. సోమిల చిన్నమ్మి (25) 8 నెలల గర్భిణికి వైద్య సేవల కోసం 8 కిలోమీటర్లు కారు దట్టమైన అడివిలో డోలి ప్రయాణం చేయాల్సి వచ్చిందని కుటుంబసభ్యులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇకనైనా తమ సమస్యలు పట్టించుకుని, పరిష్కారం చూపించాలని కోరుతున్నారు.
స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాల అవుతున్న కనీసం తాగటానికి నీరు, కరెంటు, రోడ్డు సౌకర్యం లేనటువంటి గిరిజన గ్రామంలో పశువులు, మనుషులు ఒకే చోట మంచినీరు తాగి బతుకుతున్నా. తరచూ అనారోగ్యం వస్తుంది డోలు మూసుకుని వెళ్లే పరిస్థితి ఇప్పటికీ ఉంది అభివృద్ధికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టావని ఐటిడిఏ అధికారులు రాజకీయ నాయకులు ప్రకటనలు ప్రకటిస్తున్నారు. వాస్తవానికి రియల్ ఎస్టేట్ వ్యాపారం, మైనింగ్ కొనులు కోసం. టూరిజం ప్రాంతాల్లో రోడ్లు వేస్తున్నారు తప్ప.. కనీసం మా కొండ శిఖర గ్రామాలకి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఉదయం 6 గంటలకు బయలుదేరితే మూడు గంటలు డోలు ప్రయాణంలో వాణిజ గ్రామానికి వెళ్లే పరిస్థితి నెలకొంది. ఇటువంటి పరిస్థితుల్లో మా ఓట్ల కోసం అయితే అనేక హామీలు ఇస్తుంటారు.
మమ్మల్ని మోసం చేసి మా భూములు కూడా స్థానిక రెవెన్యూ అధికారి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కుమ్మక్కవి మా భూమి రికార్డులన్నీ మార్పు చేశారు. మాకు బతకడానికి ఏ ఆధారం లేదు. కొల్లూరు ప్రాంతంలో వలసలు పోతున్నాం. మా ప్రాణాలు కాపాడుకోవాలంటే డోలి కట్టుకొని ఎనిమిది కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. ఇవి మా బతుకులు. ఇప్పటికైనా మా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తారని ఆశిస్తున్నాము. గ్రామ పెద్ద సోముల కొత్తయ్య. సోమల జోగయ్య హాస్పిటల్ కి వెళ్లి చెకప్ చేయించారు. తక్షణమే మారుమూల గ్రామాలకు కరెంటు రోడ్డు మంచినీరు సౌకర్యం కల్పించాలి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం 5వ షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా అధ్యక్షులు కే గోవిందరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.