TS ICET 2024 Application: తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో  2024–2025 విద్యాసంవత్సర ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఐసెట్(TS ICET)-2024 దరఖాస్తు గడువును మే 7 వరకు పొడిగించారు. వాస్తవానికి ఏప్రిల్ 30తోనే గడువు ముగియగా.. మరో వారంపాటు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు ఎలాంటి ఆలస్యరుసుము లేకుండా మే 7 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు ఫీజుగా ఎస్సీ ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.550, ఇతరులు రూ.750 చెల్లించాలి. ఇక రూ.250 అపరాధ రుసుంతో మే 17 వరకు, రూ.500 అపరాధ రుసుంతో మే 27 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తుల్లో ఏమైనా తప్పులుంటే మే 17 నుంచి 20 మధ్య సవరించుకోవచ్చు. పరీక్ష హాల్‌టికెట్లను మే 28 నుంచి అందుబాటులో ఉంచనున్నారు. 


ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. టీఎస్‌ ఐసెట్‌ను జూన్‌ 5, 6 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్షలు కంప్యూటర్‌ ఆధారిత విధానంలో నిర్వహించనున్నారు. జూన్‌ 5న రెండు సెషన్లలో (ఉ.10 గం. - మ.12.30 వరకు; మధ్యాహ్నం 2.30 గం. - సా.5 గం. వరకు), జూన్ 6న ఒకే సెషన్‌లో (ఉ.10 గం. - మ.12.30 వరకు) ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. కాగా, జూన్‌ 15న ఐసెట్ ప్రాథమిక కీ విడుదల చేసి, జూన్‌ 16 నుంచి 19 మధ్య ప్రాథమిక కీలో వచ్చిన అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం జూన్‌ 28న ఐసెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు.


కోర్సులు - అర్హతలు..


1) ఎంసీఏ


అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ (బీసీఏ, బీఎస్సీ-కంప్యూటర్స్, బీకామ్, బీఏ). ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. అయితే ఇంటర్ స్థాయిలో కచ్చితంగా మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.


2) ఎంబీఏ


అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ (బీఏ/ బీఎస్సీ/ బీకామ్/ బీబీఏ/ బీబీఎం/ బీసీఏ/ బీఈ/ బీటెక్/ బీఫార్మసీ). ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. అయితే ఇంటర్ స్థాయిలో కచ్చితంగా మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.


వయోపరిమితి: ఐసెట్-2024 నోటిఫికేషన్ సమయానికి (05.03.2024) 19 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎలాంటి గరిష్ఠ వయసు లేదు.


పరీక్ష విధానం:
మొత్తం 200 మార్కులకు ఐసెట్ ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు. పరీక్షలో మూడు సెక్షన్లు (సెక్షన్-ఎ, బి, సి) ఉంటాయి. వీటిలో సెక్షన్-ఎ: అనలిటికల్ ఎబిలిటీ-75 ప్రశ్నలు-75 మార్కులు, సెక్షన్-బి: మ్యాథమెటికల్ ఎబిలిటీ-75 ప్రశ్నలు-75 మార్కులు, సెక్షన్-సి: కమ్యూనికేషన్  ఎబిలిటీ-50 ప్రశ్నలు-50 మార్కులు ఉంటాయి.


పరీక్ష సిలబస్ వివరాల కోసం క్లిక్ చేయండి..


పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, నల్లగొండ, కోదాడ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట, కర్నూలు, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం. 


టీఎస్ ఐసెట్‌-2024 ముఖ్యమైన తేదీలు..


➥ టీఎస్ ఐసెట్‌-2024 నోటిఫికేష‌న్‌: 05.03.2024. 


➥ ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.03.2024.   


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 07.04.2024. 


➥ రూ.250 ఆల‌స్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 17.05.2024.


➥ రూ.500 ఆల‌స్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 27.05.2024.


➥ దరఖాస్తుల సవరణ: 17.05.2024 - 20.05.2024. 


➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 28.05.2024 నుంచి. 


➥ ఐసెట్ పరీక్ష తేది: 05.06.2024, 06.06.2024 (కంప్యూట‌ర్ బేస్డ్ విధానంలో).


➥ ఐసెట్ ప్రాథమిక కీ: 15.06.2024.


➥ ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ: 16.06.2024 - 19.06.2024 మధ్య


➥ ఐసెట్ ఫలితాల వెల్లడి: 28.06.2024. 


Notification


 Application Fee Payment


 Payment Status


Fill Application Form


Print Your Filled in Application Form


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..