Ys Sharmila Letter To Cm Jagan: సీఎం జగన్ (CM Jagan)కు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (Ys Sharmila) బుధవారం బహిరంగ లేఖ రాశారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై తాము అడుగుతున్న 'నవ సందేహాలు'కు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. 


లేఖలో నవ సందేహాలివే


1) ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించిన విషయం వాస్తవం కాదా?


2) సాగు భూమినిచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపేశారు?


3) 28 పథకాలను అర్ధంతరంగా ఎందుకు ఆపివేశారు ?


4) ఎస్సీ, ఎస్టీ పునరావాస కార్యక్రమం రాష్ట్రంలో ఎందుకు నిలిచిపోయింది?


5) ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం పెట్టిన విదేశీ విద్య పథకానికి అంబేద్కర్ పేరు ఎందుకు తీసేశారు?


6) దళిత, గిరిజన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి ఎందుకు సీట్లు నిరాకరించారు?


7) SC, STలపై రాష్ట్రంలో దాడులు పెరిగాయి. ఇది మీ వివక్ష కాదా?


8) దళిత డ్రైవర్ ను చంపి సూట్ కేసులో డోర్ డెలివరి చేసిన MLCని ఎందుకు సమర్థిస్తున్నారు?


9) స్టడీ సర్కిల్స్ కి నిధులు ఇవ్వకుండా వాటిని ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు?. అంటూ బహిరంగ లేఖలో ప్రశ్నలు సంధించారు. వీటికి సమాధానం చెప్పాలంటూ లేఖలో డిమాండ్ చేశారు.


మరోవైపు, వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న ఆమె గెలుపు వ్యూహాలకు పదును పెడుతున్నారు. అటు, వైసీపీ తరఫున ఎంపీ అవినాష్ రెడ్డి బరిలో నిలిచారు. 


Also Read: Andhra Pradesh News: రాజకీయ రక్తం మరుగుతోంది- ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో వింత పరిస్థితి