TS Inter Colleges Affiliation: తెలంగాణలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి జూనియర్‌ కాలేజీల అనుబంధ గుర్తింపు కోసం ఇంటర్మీడియట్‌ బోర్డు ఫిబ్రవరి 24న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలోని కాలేజీలు షెడ్యూల్‌ గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని బోర్డు కార్యదర్శి శృతి ఓఝా ఫిబ్రవరి 24న ఒక ప్రకటనలో తెలిపారు. కాలేజీలు ఇంటర్‌బోర్డు అనుబంధ గుర్తింపు పొందాకే నడపాల్సి ఉంటుంది.


ప్రస్తుతం కొత్త కాలేజీల ఏర్పాటుకు అవకాశం లేకపోగా, ఇప్పటికే నడుస్తున్న కాలేజీలకు గుర్తింపును ఇవ్వడంతోపాటు, వీటిల్లో అదనపు సెక్షన్లకు ఏటా అనుబంధ గుర్తింపును పునరుద్ధరిస్తుంటారు. జూన్‌ కంటే ముందు అనుబంధ గుర్తింపు జారీ ప్రక్రియ ముగియాల్సి ఉండగా.. వివిధ కారణాలతో ఆలస్యమవుతున్నది. ఈ నేపథ్యంలో మందుగానే అనుమతులు మంజూరు చేస్తే గందరగోళానికి తావుండదన్న ఆలోచనతో ఇంటర్‌బోర్డు అనుమతుల జారీ షెడ్యూల్‌ను ప్రకటించింది.


ఆలస్య రుసుము లేకుండా కాలేజీ యాజమాన్యాలు మార్చి 31 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇక ఆలస్య రుసుముతో మే 5 వరకు అవకాశం కల్పించారు. కళాశాల భవన రిజిస్ట్రేషన్‌ డీడ్‌ లేదా లీజు డీడ్‌, అప్రూవ్డ్‌ బిల్డింగ్‌ ప్లాన్‌, ఫైర్‌ సేఫ్టీ ఎన్‌వోసీ, కార్పస్‌ ఫండ్‌, స్ట్రక్చరల్‌ సౌండ్‌నెస్‌ సర్టిఫికెట్‌, శానిటరీ సర్టిఫికెట్‌, బోధనా సిబ్బంది డాక్యుమెంట్లు, ఆటస్థలం డాక్యుమెంట్లను దరఖాస్తుతోపాటు సమర్పించాల్సి ఉంటుంది.


అవసరమయ్యే సర్టిఫికేట్లు..


➥ వ్యాలీడ్ బిల్డింగ్ ఓనర్‌షిప్/రిజిస్టర్డ్ లీజ్ డీడ్ ఆఫ్ కాలేజ్ బిల్డింగ్


➥ బిల్డింగ్ ప్లానింగ్ అప్రూవల్ సర్టిఫికేట్


➥ ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్/ ఫైర్ NOC


➥ వ్యాలీడ్ ఎఫ్‌డీఆర్ (కార్పస్ ఫండ్)


➥ స్ట్రక్చరల్ సౌండ్‌నెస్ సర్టిఫికేట్


➥ శానిటరీ సర్టిఫికేట్


➥ టీచింగ్ స్టాఫ్ డాక్యుమెంట్లు


➥ ప్లే గ్రౌండ్ సంబంధిత డాక్యుమెంట్లు


ముఖ్యమైన తేదీలు..


➥ ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుకు అవకాశం: 31.03.2024.


➥ రూ.1,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 07.04.2024.


➥ రూ.5,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 14.04.2024.


➥ రూ.10,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 21.04.2024.


➥ రూ.15,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 28.04.2024.


➥ రూ.20,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 05.05.2024.


Notification


ఇంటర్‌ పరీక్షల హాల్‌టికెట్లు అందుబాటులో..
తెలంగాణలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచారు. మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఎస్సెస్సీ లేదా మొదటి ఏడాది హాల్‌టికెట్ నంబరుతో థియరీ పరీక్షల హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రెండో ఏడాది వారు మొదటి సంవత్సరం లేదా రెండో ఏడాది హాల్‌టికెట్ నంబరుతో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్‌టికెట్లలో ఫొటోలు, సంతకాలు, ఇతర సవరణలు అవసరమైతే కళాశాల ప్రిన్సిపల్ దృష్టికి తీసుకువెళ్లి, సరిచేయించుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ ఏడాది 9.8 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారు.  
ఇంటర్ హాల్‌టికెట్లు, పరీక్షల షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...