Ap SSC board exam results 2025| అమరావతి: విద్యార్థులకు కెరీర్‌లో ఎంతో ముఖ్యమైన టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలపై అప్‌డేట్ వచ్చింది. ఏపీలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ఈ నెల 23న విడుదల చేసేందుకు పాఠశాల విద్యా శాఖ కసరత్తు చేపట్టింది. ఈ ఏడాది టెన్త్ క్లాస్ పబ్లిక్‌ పరీక్షలకు 6,19,275 మంది రెగ్యులర్‌ విద్యార్థులు హాజరయ్యారు.  వీరిలో ఇంగ్లీష్ మీడియంలో 5,64,064 మంది పరీక్షలు రాశారు. తెలుగు మాధ్యమంలో 51,069 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాశారని అధికారులు తెలిపారు. ఏపీలో టెన్త్ బోర్డ్ ఎగ్జామ్ ఫలితాలను ఇంటర్ ఫలితాల తరహాలోనే మనమిత్ర వాట్సప్‌ నంబర్‌లోనూ విద్యార్థులు పొందేలా ఏర్పాట్లు చేస్తున్నారు.