Amaravati News |  ప్రధాన మోదీ అమరావతికి వచ్చేస్తున్నారు. రాజధాని పనులకు మే 2 న మళ్లీ ప్రారంభోత్సవం చేయనున్నారు. దీనికోసం కనీవిని ఎరుగని ఏర్పాట్లు చేస్తోంది కూటమి ప్రభుత్వం. 5లక్షల మంది హాజరయ్యేలా భారీ సభను  నిర్వహించడానికి బాబు రెడీ అవుతున్నారు.

Continues below advertisement


250 ఎకరాల్లో.. భారీ సభ 


 ఆరు సంవత్సరాల తర్వాత రాజధాని అమరావతి లో మళ్ళీ అధికారికంగా పనులు ప్రారంభం కాబోతున్నాయి. 2019లో ఆగిపోయిన పనులు  మళ్లీ ఇన్నాళ్లకు ఊపందుకోబోతున్నాయి. నిజానికి కూటమి అధికారంలోకి వచ్చినప్పుడే అమరావతి పనులు ప్రారంభం కాబోతున్నాయని చాలాసార్లు ప్రచారం జరిగినా ప్రధాన మోడీ అపాయింట్మెంట్ కో్వం అది లేట్ అవుతూ వచ్చింది. చివరకు మే 2న ఆయన రాబోతున్నారు. ఆరోజు సాయంత్రం నాలుగు గంటలకు  సభ ప్రారంభం కాబోతుంది. కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి  5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ప్రధాన వేదిక వద్ద 50,000 మంది కూర్చునేలా సీటింగ్ ఏర్పాట్లు.. చేస్తూనే మరో లక్ష మంది రోడ్లపై నిలబడి ప్రధాని మోదీకి స్వాగతం పలికేలా సన్నహాలు చేస్తున్నారు. మిగిలిన వారు ఇతర ప్రాదేశాల నుండి కార్యక్రమాన్ని వీక్షించాలా ఏర్పాటు జరుగుతోంది. ప్రజలకు విఐపిలకు కలిపి మీద 9 ప్రధాన రహదారుల్లో రూట్ రెడీ చేస్తున్నారు.


భద్రత కోసం SPG పర్యవేక్షణ ఉండబోతుంది. 250 ఎకరాల్లో ఏర్పాట్లు జరుగుతుండగా.. కేవలం వేదికల కోసమే 28 ఎకరాలు రెడీ చేశారు. ప్రజల కోసం 40 ఎకరాల్లో టెంట్లు వేస్తున్నారు . ఈ టెంట్ల సామర్థ్యం 2.4 లక్షల సీటింగ్. ఇవన్నీ వాటర్ ప్ర్రూఫ్ టెంట్లు. VIP పార్కింగ్ కు 10 ఎకరాలు.. హెలిప్యాడ్ 4 రెడీ అవుతున్నాయి. ప్రధానికి రైతులు మహిళలు  పూల వర్షంతో స్వాగతం పలకబోతున్నారు. ఏర్పాట్లు అన్ని ఏప్రిల్ 28 నాటికి  పూర్తయ్యేలా డెడ్ లైన్ పెట్టుకున్నారు.