Teachers Day 2024 Wishes : ప్రతి ఒక్కరి జీవితంలో గురువు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. ఉపాధ్యాయులు.. విద్యార్థుల తప్పులను సరిదిద్ది వారి జీవితాలను సన్మార్గంలో నడిపిస్తారు. అందుకే ఉపాధ్యాయులకు ఒక రోజు కేటాయించారు. ఆ రోజే ఉపాధ్యాయ దినోత్సవం. ఇది ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో వేర్వేరు తేదీలలో జరుపుకుంటారు. మన భారత దేశంలో ప్రతేడాది సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు ప్రతి ఒక్కరి జీవితంలో ఉపాధ్యాయుల పని, ప్రాముఖ్యతకు అంకితం చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం ఎప్పుడు ప్రారంభమైంది..  ఈ రోజు ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం.


ఉపాధ్యాయ దినోత్సవ చరిత్ర
మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్  పుట్టినరోజును స్మరించుకుంటూ భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రముఖ పండితుడు, ఉపాధ్యాయుడు. ప్రతిష్టాత్మక భారతరత్న అవార్డు గ్రహీత కూడా. రాధాకృష్ణన్ జన్మదిన వేడుకలను ప్రతి పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి జరుపుకుంటారు.  గతంలో డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ మాట్లాడుతూ  సెప్టెంబర్ 5నాడు  నా పుట్టినరోజును కాకుండా  ఉపాధ్యాయుల గౌరవార్థం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని సూచించారు. అప్పటి నుంచే సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. దీని ప్రకారం, భారతదేశంలో మొదటి ఉపాధ్యాయ దినోత్సవాన్ని సెప్టెంబర్ 5, 1962 న జరుపుకున్నారు. 1965లో సర్వేపల్లి విద్యార్థులు, స్నేహితులు తన పుట్టినరోజును నిర్వహించడానికి ఆయనను సంప్రదించారు.  ఆ సమయంలో తన జన్మదిన వేడుకలు కాకుండా ఉపాధ్యాయులందరినీ గౌరవించేలా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవాలని సూచించారు.


 విద్యారంగానికి విశేష కృషి చేసిన సర్వేపల్లి 
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా రంగానికి విశేష కృషి చేశారు. ఆయనను సన్మానించేందుకు ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 5ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. ఆయనో ఉపాధ్యాయుడు, పండితుడు, ప్రఖ్యాత తత్వవేత్త  భారతదేశ అత్యున్నత పౌర గౌరవం  అంటే 'భారతరత్న' కూడా పొందారు. భారతదేశంలో 1962 నుండి సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ రోజున దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు నివాళులర్పించి ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటాయి. 


Also Read : టీచర్స్​ డేకి మీ ఫేవరెట్​ ఉపాధ్యాయులకు ఇలా విష్ చేసేయండి.. సోషల్ మీడియాలో ఈ కోట్స్ పోస్ట్ చేసేయండి


ఉపాధ్యాయ దినోత్సవం ప్రాముఖ్యత
ఉపాధ్యాయుడు మన చేతులు పట్టుకుని, మన తప్పులను సరిదిద్ది, మనల్ని మంచి పౌరులుగా మార్చే తత్వవేత్త, మార్గదర్శకుడు. జీవితంలో ఉపాధ్యాయుని సహకారం ఎన్ని కోట్లు పెట్టిన కొనలేనిది. ప్రపంచంలోని అనేక దేశాలలో ఉపాధ్యాయుల దినోత్సవం రోజు పాఠశాలలు, కళాశాలలు,  విశ్వవిద్యాలయాల ఉపాధ్యాయులను గౌరవించుకుంటారు.  భారతదేశంలోని పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల్లో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రియమైన ఉపాధ్యాయునికి ప్రత్యేక అనుభూతిని కలిగించడానికి ప్రత్యేక ప్రదర్శనలు, నాటకాలు, పలు కార్యక్రమాలను నిర్వహిస్తారు. విద్యార్థులు ఉపాధ్యాయులకు పువ్వులు, స్వీట్లు, చాక్లెట్లు, ఇతర బహుమతులు కూడా ఇస్తారు. ఈ రోజు సంప్రదాయ ఉపాధ్యాయులకు మాత్రమే పరిమితం కాదు.. ప్రతి ఒక్కరి జీవితంలో ఏ సమయంలోనైనా మార్గదర్శక పాత్రను పోషించిన వారికి పట్ల గౌరవం చూపించే రోజు కూడా. 



ఉపాధ్యాయ దినోత్సవం రోజు మనం ఏం చేయాలంటే..
ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రతి విద్యార్థి ఆనందోత్సవాలతో జరుపుకోవాలి. ఎందుకంటే వారి సేవకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇది ఏకైక మార్గం. సెప్టెంబరు 5న మీ ఉపాధ్యాయులకు  కృతజ్ఞతలు  తెలిపేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. గురువుకు కృతజ్ఞతలు తెలిపేందుకు గ్రీటింగ్ కార్డ్‌ రూపంలో అందించటం ఉత్తమమైన, సులభమైన మార్గం. విద్యార్థులు ఉపాధ్యాయునిపై ప్రేరణాత్మక లేదా స్ఫూర్తిదాయకమైన ప్రసంగాన్ని అందించవచ్చు. ఉపాధ్యాయులపై ఇష్టమైన పద్యాలు రాయవచ్చు. ఉపాధ్యాయులను సత్కరించి బహుమతులు అందజేసి వారికి తగిన గౌరవం ఇవ్వాలి. ఉపాధ్యాయులను స్మరించుకోవడం విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుంది. 


Also Read: టీచర్స్​ డే స్పెషల్.. పని ఒత్తిడి తగ్గించుకోవడానికి టీచర్స్ ఫాలో అవ్వాల్సిన సింపుల్ టిప్స్