Budget 2025 : విదేశాల్లో పిల్లల్ని చదివించే వారికి బిగ్ రిలీఫ్ - టీసీఎస్ లిమిట్ రూ.10 లక్షలకు పెంపు

Budget 2025 : విద్యార్ధులు, ప్రయాణికులు, పెట్టుబడిదారులకు ప్రయోజనం చేకూర్చేలా బడ్జెట్ లో కీలక ప్రకటన చేశారు. టీసీఎస్ పరిమితిని రూ.10 లక్షలకు పెంచారు.

Continues below advertisement

Union Budget 2025 : విద్యా ప్రయోజనాల కోసం చేసే చెల్లింపులపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2025 (Union Budget)లో కీలక మార్పును ప్రకటించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (LRS) లావాదేవీలపై బేసిక్ వద్ద వసూలు చేస్తోన్న పన్ను (టీసీఎస్) పరిమితిని పెంచుతున్నామన్నారు. ఇంతకుమునుపు ఈ పరిమితి రూ.7 లక్షలుగా ఉండేది. ఇప్పుడు ఈ పరిమితిని మరో రూ.3 లక్షలు పెంచుతూ బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కీలక ప్రతిపాదన చేశారు. విదేశాలకు పంపే లావాదేవీలకు పన్ను భారాన్ని తగ్గించేందుకు ఈ లిమిట్ ను రూ.10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇది విదేశాల్లో పిల్లల్ని చదివిస్తోన్న వారికి పెద్ద ఊరట కలిగించనుంది.

Continues below advertisement

విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు భారీ ఉపశమనం

విదేశాల్లో చదివే తమ పిల్లల కోసం కష్టపడి సంపాదించిన మొత్తాన్ని వారి కుటుంబసభ్యులు ఏటా డబ్బులు పంపిస్తూంటారు. దాంతో పాటు ప్రయాణాలు, వైద్య ఖర్చులు, పెట్టుబడుల నిమిత్తం భారత్ నుంచి విదేశాలకు డబ్బు పంపుతుంటారు. ఇలాంటి వాటిపై కేంద్రం మూలం వద్ద పన్ను విధిస్తుంది. ఈ క్రమంలో వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ (TCS Limit Hike) పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇంతకుమునుపు రూ.7 లక్షలు దాటిన వారంతా టీసీఎస్ ((Tax Deducted at Source) కట్టాల్సి వచ్చేది. కానీ తాజా నిర్ణయంతో ఇకపై రూ.10 లక్షల వరకు పంపించినా ఎలాంటి ట్యాక్స్ (Tax) కట్టాల్సిన అవసరం లేదన్నమాట. 

Also Read : Donald Trump : ట్రంప్ టారిఫ్‌ల మోత,- ఆ 3 దేశాలకు షాకిచ్చిన అమెరికా - సుంకాలపై కీలక నిర్ణయం

బడ్జెట్ లో ప్రతిపాదనల ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలకు మించి విదేశాలకు డబ్బులు పంపిస్తే టీసీఎస్ రేట్లు వర్తిస్తాయి. అయితే విద్యా అవసరాల కోసం పంపించే నిధులకు మాత్రం టీసీఎస్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఎందుకంటే వారు ఏదైనా ఆర్థిక సంస్థ నుంచి రుణంగా తీసుకుని ఆ డబ్బు పంపిస్తారు కాబట్టి. ఇక వైద్య అవసరాల కోసం 5 శాతం టీసీఎస్, విదేశీ పెట్టుబడులు, ప్రయాణాల కోసమైతే 20 శాతం టీసీఎస్ రేట్లు వర్తించనున్నాయి.

టీసీఎస్ మినహాయింపు పరిమితి పెంపుతో కలిగే ప్రయోజనాలు

నాన్-ఎడ్యుకేషనల్ రెమిటెన్స్‌ (Non-Educational Remittance)ల కోసం టీసీఎస్ మినహాయింపు పరిమితిని రూ. 7 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచడం వల్ల ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. ఈ మార్పు ప్రయాణికులకు మరింత సౌలభ్యాన్ని అందిస్తుంది. ముందస్తు ఖర్చులను తగ్గిస్తుంది. అంతర్జాతీయ ప్రయాణాన్ని మరింత సరసమైనదిగా చేస్తుంది. గ్లోబల్ మార్కెట్‌ (Global Market)లలో తమ పోర్ట్‌ఫోలియోలను వైవిధ్యపరచాలని చూస్తోన్న పెట్టుబడిదారులకు, ప్రత్యేకించి యూఎస్ స్టాక్‌ల (US Stocks) లో పెట్టుబడి పెట్టేవారికి మరింత సౌలభ్యాన్ని అందిస్తుంది. 

Also Read : Union Budget 2025: బడ్జెట్ ఎఫెక్ట్, నిర్మలమ్మ ప్రకటనతో నేటి నుంచి దిగిరానున్న బంగారం, ఆభరణాల ధరలు!

Continues below advertisement
Sponsored Links by Taboola