తెలంగాణలోని సింగ‌రేణి ఉద్యోగుల పిల్లల‌కు రాష్ట్ర ప్రభుత్వం శుభ‌వార్త వినిపించింది. రామగుండం మెడికల్ కాలేజీలో సింగరేణి ఉద్యోగుల పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లలో రిజర్వేషన్‌ కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం(జులై 6న) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రామగుండం మెడికల్ కాలేజీలో మొత్తం 150 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, 23 సీట్లు ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి. మిగతా 127 సీట్లలో 5 శాతం రిజర్వేషన్ ప్రకారం, అంటే 7 సీట్లు సింగరేణి ఉద్యోగుల పిల్ల‌ల‌కు కేటాయించడం జరిగింది.


నీట్ మెరిట్ ప్రకారం భర్తీ చేసే ఈ సీట్ల విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పరిగణలోకి తీసుకుంటారు. సింగరేణి ఉద్యోగుల నుండి వచ్చిన విజ్ఞప్తులను పరిగణన‌లోకి తీసుకున్న సీఎం కేసీఆర్, ఈ మేరకు వారి పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లలో రిజర్వేషన్ కల్పించారు. ఎంబీబీఎస్ సీట్ల‌లో రిజ‌ర్వేష‌న్ క‌ల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సింగ‌రేణి ఉద్యోగులు కృత‌జ్ఞత‌లు తెలిపారు.


ALSO READ:


ఇంటర్‌లో బైపీసీనా, ఎంబీబీఎస్ సీటు రాకపోయినా సరే - మరెన్నో కోర్సులున్నాయి!
ఇంటర్ లో బైపీసీ తీసుకొని.. ఆ తర్వాత ఏం చేయాలో తెలియక చాలా మంది విపరీతంగా భయపడిపోతుంటారు. ముఖ్యంగా ఎంబీబీఎస్ లో సీటు రాకపోతే ఆ తర్వాత ఏం చేయాలో తెలియక అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. బీఏఎంస్, బీహెచ్ఎంఎస్, బీడీఎఎస్, బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్సుల్లో చేరుతుంటారు. మరికొంత మంది విదేశాల్లోనూ వైద్య విద్య అభ్యసించడానికి వెళ్తుంటారు. కానీ ఇంటర్ లో బైపీసీ చదివి ఎంబీబీఎస్ యే కాకుండా ఆ తర్వాత చదివేందుకు అనేక కోర్సులు ఉన్నాయి. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


తెలంగాణలో మ‌రో 14,565 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమ‌తి
తెలంగాణలో మ‌రో 14,565 ఇంజినీరింగ్ సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తెలిపింది. కోర్ గ్రూపుల్లో సీట్లు వెన‌క్కి ఇస్తామ‌ని పేర్కొంటూ ఇంజినీరింగ్ కాలేజీలు కంప్యూట‌ర్ కోర్సుల్లో సీట్లకు అనుమ‌తి కోరాయి. దీంతో 6,930 సీట్లకు ప్రభుత్వం అనుమ‌తి ఇచ్చింది. అలాగే కొత్తగా 7,635 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమ‌తి ఖరారు చేసింది. ఫ‌లితంగా అద‌న‌పు సీట్లతో ఏటా స‌ర్కారుపై రూ. 27.39 కోట్ల భారం ప‌డ‌నుంది. ఇటీవ‌ల 86,106 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమ‌తి ఇవ్వగా, తాజాగా అనుమ‌తిచ్చిన వాటితో క‌లిపి రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్ల సంఖ్య 1,00,671కి చేరింది.
పూర్తి వివరాలకోసం క్లిక్ చేయండి.. 


పాలిసెట్‌లో తొలిసారి స్లైడింగ్‌ విధానం! నచ్చిన బ్రాంచ్‌కు మారవచ్చు!
తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇక నుంచి ఒక బ్రాంచిలో చేరిన విద్యార్థులు మరో బ్రాంచికి మారే స్లైడింగ్ ప్రక్రియను ప్రవేశపెట్టనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. పాలిసెట్ కన్వీనర్ ఆధ్వర్యంలోనే ఈ నూతన ప్రక్రియను నిర్వహించనున్నారు. ఇప్పటివరకు పాలిసెట్లో రెండు విడతల కౌన్సెలింగ్ నిర్వహించి, ఆ తర్వాత మిగిలిపోయిన సీట్లకు స్పాట్ కౌన్సెలింగ్ జరుపుతున్నారు. ఈసారి రెండు విడతల కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత అప్పటికే కళాశాలల్లో వివిధ కోర్సుల్లో చేరిన వారికి స్లైడింగ్ నిర్వహిస్తారు. ఈ విధానం ద్వారా ఓ కళాశాలలో ఖాళీగా ఉన్న బ్రాంచీల్లో ఆ కళాశాలకే చెందిన మరో బ్రాంచి విద్యార్థులు చేరవచ్చు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial