ప్రతిభ ఉన్నా ఆర్థిక పరిస్థితుల వల్ల ఉన్నత విద్య అభ్యసించలేకపోతున్న విద్యార్థులను ప్రోత్సహించడానికి రిలయన్స్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. డిగ్రీ, పీజీ విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్స్ అందిస్తోంది. రిలయన్స్ ఫౌండేషన్ అండర్‌గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ కింద 5,000 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్ ప్రకటించింది. అలాగే పీజీ విద్యార్థులకు 100 స్కాలర్‌షిప్ ఇవ్వనుంది. ప్రతిభగల విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా విద్యాభ్యాసాన్ని కొనసాగించేందుకు ఈ స్కాలర్‌షిప్ ఉపయోగపడుతుంది. 


వచ్చే పదేళ్లలో 50,000 మంది విద్యార్థులకు స్కాలర్ షిప్పులను అందించాలని రిలయన్స్ ఫౌండేషన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో స్కాలర్‌షిప్ 5100  అందించబోతున్నారు. ఎంపికైనవారికి కోర్సు వ్యవధి అంతా ఆర్థిక ప్రోత్సాహం కొనసాగుతుంది. పరీక్షలో చూపిన ప్రతిభ, అకడమిక్ నేపథ్యం, ఇంటర్వ్యూలతో ఎంపిక చేస్తారు. ఈ స్కాలర్‌షిప్స్‌ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. విద్యార్థులు ఫిబ్రవరి 14 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  


ఎవరు అర్హులు?


🔰 డిగ్రీ స్థాయిలో..


అర్హతలు:


➥ మెరిట్ కం మీన్స్ ప్రాతిపదికన ఈ స్కాలర్‌షిప్ అందిస్తున్నారు. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థినులు, దివ్యాంగులకు ప్రాధాన్యమిస్తారు. 


➥ తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.15 లక్షల లోపు ఉండాలి. రూ.2.5 లక్షల లోపు ఉన్నవారికి ప్రాధాన్యం.  . 


➥ ఇంటర్/ప్లస్-2లో 60 శాతం మార్కులు ఉండాలి. 


➥ ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, అడ్రస్ ప్రూఫ్‌, 10, 12 తరగతుల బోర్డు ఎగ్జామ్ మార్క్స్ షీట్‌తో పాటు ప్రస్తుత బోనఫైడ్‌ సర్టిఫికెట్ ఉండాలి. వీటితో పాటు ఇన్‌కమ్‌ ప్రూఫ్‌ ఉండాలి. 


ఎంపిక విధానం: అర్హులైన విద్యార్థులకు ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ టెస్టు నిర్వహిస్తారు. 

స్కాలర్‌షిప్: ఎంపికైనవారు తమ డిగ్రీ వ్యవధిలో సుమారు రూ.2 లక్షల వరకు ప్రోత్సాహం పొందవచ్చు. వీరికి రిలయన్స్ ఫౌండేషన్ నుంచి కెరియర్ పరమైన సహకారమూ లభిస్తుంది. నగదు ప్రోత్సాహంతోపాటు సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్, వర్క్ షాపులు, పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్‌తో అనుసంధానం మొదలైనవి ఉంటాయి.


🔰 పీజీ స్థాయిలో..


అర్హతలు:


➥ పీజీ తొలి సంవత్సరం కోర్సు చదువుతుండాలి. గేట్‌లో 550-1000 మధ్య స్కోర్, లేదా యూజీలో 7.5 సీజీపీఏ ఉండాలి.


➥ దేశంలో ఏదైనా సంస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కెమికల్, రెన్యూవబుల్ అండ్ న్యూ ఎనర్జీ, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, లైఫ్ సైన్సెస్ కోర్సులు చదువుతున్నవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. 


➥ కోర్సు వ్యవధికి మొత్తం రూ.6 లక్షల వరకు అందిస్తారు. ఇందులో 80 శాతం విద్యా సంవత్సరం ప్రారంభంలో, మిగతా 20 శాతం ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్, కాన్ఫరెన్సులు, పర్సనల్ డెవలప్‌మెంట్... తదితర ఖర్చుల కోసం చెల్లిస్తారు. నిపుణులతో సమావేశం, సంబంధిత రంగంపై అవగాహన పెంచడం ఈ స్కాలర్‌షిప్పులో భాగం


ఎంపిక విధానం: రిలయన్స్ ఫౌండేషన్ వెబ్‌సైట్‌లో ఎలిజిబిలిటీ క్వశ్చనీర్‌ను పూర్తిచేయాలి. పర్సనల్, అకడమిక్, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వివరాలు నమోదు చేసుకోవాలి. రెండు రిఫరెన్స్ లెటర్లు జతచేయాలి. వీటిలో ఒకటి అకడమిక్ నైపుణ్యాలు, రెండోది వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలు తెలిపేది కావాలి. రెండు ఎస్సేలు ఒకటి పర్సనల్ స్టేట్‌మెంట్, రెండోది స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్ రాసివ్వాలి. ఇండస్ట్రీ నిపుణులు, అకడమిషియన్లు, సంబంధిత విభాగంలో నాయకత్వ స్థాయిలో ఉన్నవారు బృందంగా ఏర్పడి దరఖాస్తులు పరిశీలిస్తారు. ఇలా పరిశీలనలో నిలిచినవారికి ఇంటర్వ్యూ ప్రిపరేషన్, వెబినార్లు ఉంటాయి. నిపుణుల బృందం వర్చువల్ విధానంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. ఇందులో మేటి వంద మందికి స్కాలర్ షిప్పులు మంజూరు చేస్తారు.


స్కాలర్‌షిప్: పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులు రూ. 6 లక్షల వరకు గ్రాంట్‌ను అందుకుంటారు.


దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 14.


Website 


Also Read: 


ఎఫ్‌డీడీఐలో బ్యాచిలర్స్‌, మాస్టర్‌ డిగ్రీ కోర్సులు - ప్రవేశ వివరాలు ఇలా!
ఫుట్‌వేర్ డిజైన్ & డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌డీడీఐ) 2023-24 విద్యాసంవత్సరానికి గాను వివిధ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఉన్న 12 కేంద్రాల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ విద్యాసంస్థల్లో ఫుట్‌వేర్, ఫ్యాషన్, రిటైల్, లెదర్ యాక్సెసరీలు, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులకు సంబంధించిన శిక్షణ ఇస్తారు. ఆల్ ఇండియా సెలక్షన్ టెస్ట్(ఏఐఎస్‌టీ) 2023 పరీక్షలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
కోర్సుల వివరాలు, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..


యూజీసీనెట్ 2022 దరఖాస్తు ప్రారంభం, ఇలా దరఖాస్తు చేసుకోండి! చివరితేది ఇదే!
దేశంలోని యూనివర్సిటీలలో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ (డిసెంబరు)-2022 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. పీజీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబరు 29న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలు కలిగిన అభ్యర్థులు జనవరి 17 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...