ఫుట్‌వేర్ డిజైన్ & డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌డీడీఐ) 2023-24 విద్యాసంవత్సరానికి గాను వివిధ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఉన్న 12 కేంద్రాల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ విద్యాసంస్థల్లో ఫుట్‌వేర్, ఫ్యాషన్, రిటైల్, లెదర్ యాక్సెసరీలు, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులకు సంబంధించిన శిక్షణ ఇస్తారు.
వివరాలు..
* ఎఫ్‌డీడీఐ ప్రవేశాలు 2023-24
దేశవ్యాప్తంగా 12 కేంద్రాలు: హైదరాబాద్, నోయిడా, రోహ్‌తక్, కోల్‌కతా, ఫుర్సత్‌గంజ్, చెన్నై, జోధ్పూర్, చిండ్వారా, పట్నా, చండీగఢ్, గుణ, అంక్లేశ్వర్.
➥ మొత్తం సీట్ల సంఖ్య: 2300
➥ ఎన్ఆర్ఐ, ఇండస్ట్రీ స్పాన్సర్డ్ సీట్లు: 230
కోర్సులు:
1) బ్యాచిలర్ ఆఫ్ డిజైన్
విభాగాలు: ఫుట్‌వేర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్, లెదర్, లైఫ్‌స్టైల్ అండ్ ప్రొడక్ట్ డిజైన్, ఫ్యాషన్ డిజైన్
అర్హత: 10+2/ డిప్లొమా ఉత్తీర్ణత.
వయసు: బ్యాచిలర్ డిగ్రీ దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 25 ఏళ్లు మించకూడదు.
2) పీజీ మాస్టర్ ఆఫ్ డిజైన్
విభాగాలు: ఫుట్‌వేర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్
అర్హత: ఫుట్‌వేర్/ లెదర్ గూడ్స్ అండ్ యాక్సెసరీస్ డిజైన్/ డిజైన్/ ఇంజినీరింగ్/ ప్రొడక్షన్/ టెక్నాలజీల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
కోర్సు వ్యవధి: రెండేళ్ల వ్యవధితో దీన్ని అందిస్తున్నారు.
3) ఎంబీఏ (రిటైల్ అండ్ ఫ్యాషన్ మర్చెండైజ్)
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
కోర్సు వ్యవధి: ఈ కోర్సు వ్యవధి రెండేళ్లు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ఆల్ ఇండియా సెలక్షన్ టెస్ట్(ఏఐఎస్‌టీ) 2023 పరీక్షలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.600.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.
ముఖ్యమైన తేదీలు..
➥ దరఖాస్తు చివరి తేది: 30.04.2023
➥ అడ్మిట్ కార్డులు: 05.06.2023
➥ ఏఐఎస్‌టీ 2023 పరీక్ష: 18.06.2023
Also Read:
గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి నోటిఫికేషన్..
తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన, సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 2023-2024 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీయూజీసెట్-23 ప్రకటన విడుదలైంది. ఈ ప్రకటనను తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలు సంయుక్తంగా విడుదల చేశాయి. అర్హులైన విద్యార్థులు జనవరి 5 నుంచి ఫిబ్రవరి 5 తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నవారు, 2022 మార్చిలో ఇంటర్ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
నీట్ పీజీ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, అప్లికేషన్ లింక్ ఇదే!
నీట్ పీజీ 2023 దరఖాస్తు ప్రక్రియను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ జనవరి 7న ప్రారంభించింది. అధికారిక వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. జనవరి 27 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 5న నీట్ పీజీ-2023 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 3 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. అదేవిధంగా ఫిబ్రవరి 14 నుంచి 17 వరకు దరఖాస్తుల సవరణకు చివరి అవకాశం (ఫొటో, సంతకం, వేలిముద్ర మార్పు) ఇవ్వనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఫిబ్రవరి 27న విడుదల చేయనున్నారు. మార్చి 5న పరీక్ష నిర్వహించి, 31న ఫలితాలు వెల్లడించనున్నారు. నీట్ పీజీ 2023 ప్రవేశపరీక్ష ద్వారా ఎండీ/ఎంఎస్/పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. పోస్ట్ ఎంబీబీఎస్ డీఎన్‌బీ కోర్సులు, ఆరేళ్ల డీఆర్‌ఎన్‌బీ కోర్సులు, పోస్ట్ ఎంబీబీఎస్ ఎన్‌బీఈఎంఎస్ డిప్లొమా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
దరఖాస్తు, ఫీజు వివరాల కోసం క్లిక్ చేయండి..