NCET-2024 Notification: దేశంలోని ఐఐటీలు, ఎన్‌ఐటీలు, సెంట్రల్ వర్సిటీల్లో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సులో ప్రవేశాలకు 2024-25 విద్యా సంవత్సరానికిగాను 'నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(NCET)-2024' నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇటీవల విడుదల చేసింది. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత కలిగిన విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 13న ప్రారంభంకాగా.. ఏప్రిల్ 30 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్నవారికి జూన్ 12న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్షలో ర్యాంకు ఆధారంగా ఆయా సంస్థలు ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించి నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ITEP) బీఈడీ సీట్లను భర్తీ చేస్తాయి.
ఈ పరీక్షలో ర్యాంకు ఆధారంగా ఆయా సంస్థలు ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లను భర్తీ చేస్తారు. కేవలం ఇంటిగ్రేటెడ్ కోర్సులకు మాత్రమే ఎన్‌సీఈటీ వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా మొత్తం 64 విద్యాసంస్థలు ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సును అందిస్తున్నాయి. వాటిల్లో మొత్తం 6,100 సీట్లు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణలో ఉర్దూ వర్సిటీ (150 సీట్లు), వరంగల్ ఎన్‌ఐటీ (50), లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (50)లో సీట్లు ఉన్నాయి. ఇక ఏపీలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం(తిరుపతి)-50 సీట్లు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ (ఎచ్చెర్ల-శ్రీకాకుళం)-50 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
వివరాలు...
* నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(NCET)-2024
కోర్సులు..
➥ బీఏ-బీఈడీ
➥ బీఎస్‌ఈ-బీఈడీ
➥ బీకాం-బీఈడీ
సీట్ల సంఖ్య: 6100. (తెలంగాణ-200, ఏపీ-100)
అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులు రూ.1200; ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1000; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్ అభ్యర్థులు రూ.650 చెల్లించాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్షలో ర్యాంకు ఆధారంగా.
రాతపరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 181 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో తప్పనిసరిగా 160 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. పరీక్ష సమయం 180 నిమిషాలు. పరీక్షలో మొత్తం 4 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్-1(లాంగ్వేజ్)లో 23 ప్రశ్నల్లో-20 ప్రశ్నలకు, సెక్షన్-2(స్పెసిఫిక్ సబ్జెక్ట్)లో 28 ప్రశ్నల్లో-25 ప్రశ్నలకు, సెక్షన్-3(జనరల్ టెస్ట్)లో 28 ప్రశ్నల్లో-25 ప్రశ్నలకు, సెక్షన్-4(టీచింగ్ ఆప్టిట్యూడ్)లో 23 ప్రశ్నల్లో-20 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అంటే ఒక్కో సెక్షన్‌లో మూడు ప్రశ్నలు ఛాయిస్ ఇస్తారు.
పరీక్ష సిలబస్..
⫸ లాంగ్వేజ్ విభాగంలో రీడింగ్ కాంప్రహెన్షన్, లిటరరీ ఆప్టిట్యూడ్, వొకాబులరీ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
⫸ డొమైన్ ఇంటర్ సబ్జెక్టుల స్థాయిలో ప్రశ్నలు అడగుతారు.
⫸ జనరల్ టెస్ట్ విభాగంలో జనరల్ నాలెడ్జ్, కరెంట్ ఆఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ రీజనింగ్, లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
⫸ టీచింగ్ ఆప్టిట్యూడ్ విభాగంలో సైన్స్, ఆర్ట్స్, మ్యాథమెటిక్స్, పర్‌ఫార్మింగ్ ఆర్ట్స్, లాంగ్వేజెస్ తదితర అంవాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 13.04.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 30.04.2024.(up to 11:30 P.M.)
➥ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేది: 30.04.2024 (up to 11:50 P.M.)
➥ దరఖాస్తుల సవరణ: 02.05.2024 - 04.05.2024.
➥ సిటీ ఇంటిమేషన్ ప్రకటన: 2024, మే చివరివారంలో.
➥ అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్: ప్రవేశ పరీక్షకు 3 రోజుల ముందుగా.
➥ ప్రవేశ పరీక్ష తేది: 12.06.2024.