TG LAWCET Application 2025: టీజీ లాసెట్‌ దరఖాస్తుల గడువు పొడిగిస్తున్నట్లు లాసెట్‌ కన్వీనర్‌ ఆచార్య బి.విజయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 30లోపు అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇదే చివరి అవకాశమని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో లాసెట్, పీజీఎల్ సెట్ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ ఫిబ్రవరి 25న విడుదలైన సంగతి తెలిసిందే. మార్చి 1న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. ఎలాంటి ఆలస్యరుసుము లేకుండా ఏప్రిల్ 15న ముగిసింది.. అయితే ఆ గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రూ.1000 ఆలస్య రుసుముతో మే 5 వరకు, రూ.2000 ఆలస్య రుసుముతో మే 15 వరకు, రూ.4000 ఆలస్య రుసుముతో మే 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎడిట్‌ చేసుకునేందుకు మే 20 నుంచి 25 వరకు అవకాశం కల్పించారు. మే 30 నుంచి పరీక్ష హాల్‌టికెట్లు జారీ చేయనున్నారు. జూన్ 6న టీజీ లాసెట్‌, టీజీ పీజీఎల్‌సెట్‌ ప్రవేశ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు.

వివరాలు..

* టీజీ లాసెట్‌ 2025

కోర్సులు: మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు.

అర్హత: 03 సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ కోర్సులకు ఏదైనా గ్రాడ్యుయేట్ డిగ్రీ.. 5 సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు ఇంటర్మీడియట్, ఎల్‌ఎల్‌ఎం కోర్సుకు ఎల్‌ఎల్‌బీ లేదా బీఎల్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ అభ్యర్థులు రూ.600, ఓపెన్‌ కేటగిరి అభ్యర్థులకు రూ.900గా నిర్ధారించించారు. పీజీఎల్‌సెట్‌కు రూ.1100 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.900) చెల్లించాల్సి ఉంటుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పరీక్ష మాధ్యమం: లాసెట్ ఇంగ్లిష్/ తెలుగు, ఉర్దూ, పీజీఎల్‌సెట్‌ ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుంది.

పరీక్ష కేంద్రాలు: హైద్రాబాద్, నల్లగొండ, కోదాడ, ఖమ్మం, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, నర్సంపేట, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, విశాఖపట్నం, కర్నూలు, తిరుపతి, విజయవాడ.

ముఖ్యమైన తేదీలు..

➥  నోటిఫికేషన్ వెల్లడి: 25.02.2025.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.03.2025.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 30.04.2025.

➥ రూ.1,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 05.05.2025.

➥ రూ.2,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 15.05.2025.

➥ రూ.4,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 25.05.2025.

➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 20.05.2025 నుంచి 25.05.2025 వరకు.

➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 30.05.2025.

➥ లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్ష తేది: 06.06.2025.

➥ ప్రాథమిక కీ విడుదల: 10.06.2025.

➥ ప్రాథమిక ఆన్సర్ కీ అభ్యంతరాల గడువు: 14.06.2025(5 PM)

➥ తుది కీ, ఫలితాల వెల్లడి: 25.06.2025.