IISER IAT Admission Notification: దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్‌ (IISER) విద్యాసంస్థల్లో 2024-25 విద్యాసంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు 'IAT-2024' (ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్ట్) నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా బెర్హంపూర్, భోపాల్, కోల్‌కతా, మొహాలీ, పుణే, తిరువనంతపురం, తిరుపతిలో ఐఐఎస్‌ఈఆర్ క్యాంపస్‌లలో ఐదేళ్ల బీఎస్-ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ, నాలుగేళ్ల బీఎస్ డిగ్రీలో సీట్లను భర్తీచేస్తారు. ప్రవేశ పరీక్ష (ఆప్టిట్యూడ్ టెస్ట్) ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. ఇతర దేశాలకు చెందినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.2000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, కశ్మీర్ శరణార్థులు, దివ్యాంగులు రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 1న ప్రారంభంకాగా.. మే 13 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తు చేసుకున్నవారికి జూన్ 9న దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు.


వివరాలు..


* ఐఐఎస్‌ఈఆర్ క్యాంపస్‌లలో డిగ్రీ ప్రవేశాలు


ఐఐఎస్‌ఈఆర్ క్యాంపస్‌లు: బెర్హంపూర్, భోపాల్, కోల్‌కతా, మొహాలీ, పుణే, తిరువనంతపురం, తిరుపతి.


మొత్తం సీట్ల సంఖ్య: 1933


సీట్ల కేటాయింపు: 15 శాతం సీట్లు ఎస్సీలకు, 7.5 శాతం సీట్లు ఎస్టీలకు, బీసీలకు 27 శాతం సీట్లు, దివ్యాంగులకు 5 శాతం సీట్లు, కశ్మీర్ శరణార్థులకు ఒక్కో క్యాంపస్‌లో 3 చొప్పున సీట్లు కేటాయిస్తారు. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 10 శాతం కోటా అమలు ఉంటుంది. 


➥ బీఎస్-ఎంఎస్ (డ్యూయల్ డిగ్రీ)


సీట్ల సంఖ్య: 1818 సీట్లు


కోర్సువ్యవధి: 5 సంవత్సరాలు.


➥ బీఎస్ డిగ్రీ 


సీట్ల సంఖ్య: 115 సీట్లు


కోర్సువ్యవధి: 4 సంవత్సరాలు.


అర్హత: 60 శాతం మార్కులతో ఇంటర్ (సైన్స్) లేదా తత్సమాన విద్యార్హత (2022, 2023, 2024 పాస్) ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ఆప్టిట్యూడ్ టెస్ట్ ఆధారంగా.


దరఖాస్తు ఫీజు: రూ.2000. ఎస్సీ, ఎస్టీ, కశ్మీర్ శరణార్థులు, దివ్యాంగులకు రూ.1000 చెల్లించాలి.


పరీక్ష విధానం: మొత్తం 240 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 60 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో బయాలజీ-15 ప్రశ్నలు-60 మార్కులు, కెమిస్ట్రీ-15 ప్రశ్నలు-60 మార్కులు, మ్యాథమెటిక్స్-15 ప్రశ్నలు-60 మార్కులు, ఫిజిక్స్-15 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి. అంటే ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు కేటాయించారు. ప్రతి తప్పుసమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం 180 నిమిషాలు.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.04.2024.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 13.05.2024.


➥ దరఖాస్తుల సవరణ: 16.05.2024 - 17.05.2024.


➥ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 01.06.2024 నుంచి.


➥ ఆప్టిట్యూడ్ టెస్ట్ (IAT): 09.06.2024. (9.00 AM)


➥ ఆన్సర్ కీ, అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు, అభ్యంతరాల స్వీకరణ: 12.06.2024. 


➥అభ్యంతరాల స్వీకరణకు చివరితేది: 14.06.2024. 


➥ తుది ఆన్సర్ కీ విడుదల: 21.06.2024.


➥ప్రవేశ పరీక్ష ఫలితాల వెల్లడి: 25.06.2024. 


➥ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం: 26.06.2024 - 01.07.2024.


➥ డాక్యుమెంట్ వెరిఫికేషన్: 02.07.2024 - 05.07.2024  


➥ మొదటివిడత సీట్ల కేటాయింపు: 07.07.2024.  


Information Brochure


Online Application


Website


ALSO READ:


జాతీయ విద్యాసంస్థల్లో ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సులు - నోటిఫికేషన్, పరీక్ష వివరాలు ఇలా
దేశంలోని ఐఐటీలు, ఎన్‌ఐటీలు, సెంట్రల్‌ వర్సిటీల్లో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సులో ప్రవేశాలకు 2024-25 విద్యా సంవత్సరానికిగాను 'నేషనల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(NCET)-2024' నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇటీవల విడుదల  చేసింది. ఇంటర్‌ లేదా తత్సమాన విద్యార్హత కలిగిన విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 13న ప్రారంభంకాగా.. ఏప్రిల్ 30 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
ప్రవేశ వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..