JEE Main Final Key: దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్ తుది విడత పరీక్షల ఫైనల్ ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏప్రిరల్ 17న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు, ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు నమోదుచేసిన అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా ఆన్సర్ కీ చూసుకోవచ్చు. ఈ ఏడాది ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో, బీఆర్క్, బీప్లాన్ కోర్సుల్లో అడ్మిషన్స్ కోసం ఏప్రిల్ 9న పరీక్షలు నిర్వహించారు. ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో బీటెక్ సీట్లను జేఈఈ మెయిన్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తారు. ఐఐటీల్లో చేరాలంటే జేఈఈ అడ్వాన్స్‌డ్ రాయాలి. మెయిన్‌లో కనీస మార్కులు సాధించి అర్హత పొందిన 2.50 లక్షల మందికి మాత్రమే అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అవకాశముంటుంది.
జేఈఈ మెయిన్ ఫైనల్ ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి..
దేశంలోని 31 ఎన్‌ఐటీల్లో గతేడాది సుమారు 24 వేల సీట్లు;23 ఐఐటీల్లో 17,600 సీట్లు; ట్రిపుల్‌ఐటీల్లో దాదాపు 8,500 సీట్లు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో 57 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. జేఈఈ మెయిన్ పరీక్ష రాసిన ప్రతి 100 మందిలో సరాసరిన నలుగురికి మాత్రమే సీట్లు దక్కుతున్నాయి. జేఈఈ మెయిన్ చివరి విడత ముగిసిన తర్వాత రెండిటిలో ఉత్తమ స్కోర్ (రెండూ రాస్తే)ను పరిగణనలోకి తీసుకొని ఏప్రిల్ 17న రాత్రికి ప్రకటించే అవకాశం ఉంది.
జేఈఈ మెయిన్ సెషన్-1 ఫలితాలు ఫిబ్రవరిలో విడుదలైన సంగతి తెలిసిందే. ఇక సెషన్-2 ఫలితాలు ఏప్రిల్ 17న విడుదల కానున్నాయి. రెండు సెషన్లలో విద్యార్థులు కనబరచిని ప్రతిభ ఆధారంగా ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులను ఎన్టీఏ కేటాయించనుంది. కేటగిరీల వారీగా కటాఫ్ స్కోర్‌ను నిర్ణయించి సెషన్ 1, 2లో అర్హత సాధించిన మొత్తం 2.50 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించినట్లు ప్రకటించనుంది. వారు మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 18న ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు పేపర్-2 నిర్వహించనున్నారు.
మే 2 వరకు దరఖాస్తులకు అవకాశం..
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 23 నుంచి ప్రారంభంకానుంది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన 2.5 లక్షల మంది అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
జేఈఈ అడ్వాన్స్‌డ్ ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.04.2025.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 02.05.2025.
➥ ఫీజు చెల్లించడానికి చివరితేది: 05.05.2025.
➥ అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్: 11.05.2025 నుంచి 18.05.2025 వరకు
➥ జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షతేది: 18.05.2025.
➥ విద్యార్థుల రెస్పాన్స్ షీట్లు: 22.05.2025.
➥ ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల: 26.05.2025.
➥ ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ: 26.05.2025 - 27.05.2025.
➥ జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల వెల్లడి: 02.06..2025.
➥ ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (AAT) దరఖాస్తు ప్రారంభం: 02.06..2025.
➥ ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (AAT) దరఖాస్తుకు చివరితేదీ: 03.06..2025.
➥ జాయింట్ సీట్ అలోకేషన్ (JoSAA) కౌన్సెలింగ్ ప్రారంభం: 03.06..2025.
➥ ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (AAT) పరీక్ష తేదీ: 05.06..2025.
➥ ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (AAT) ఫలితాల వెల్లడి: 08.06..2025.