AISSEE - 2024 Exam Halltickets: దేశంలోని సైనిక పాఠశాలల్లో 2024-2025 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాలకు సంబంధించి 'అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష (AISSEE-2024)' హాల్‌టికెట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు పొందవచ్చు. ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 33 సైనిక పాఠశాలల్లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎన్‌జీవోలు/ ప్రైవేట్ పాఠశాలలు/ రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పనిచేసే 19 కొత్త సైనిక పాఠశాలల్లోనూ 6 తరగతి ప్రవేశాలు జరుగుతాయి.


ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 28న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. జనవరి 28న ఆరోతరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు, 9వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.  అభ్యర్థులు ప్రవేశపరీక్షలో ఒక్కో సజ్జెక్టులో కనిష్ఠంగా 25% మార్కులు, అన్ని సజ్జెక్టుల్లో కలిపి 40% మార్కులు సాధించాలి. దీనిలో అర్హత సాధించిన వారికి శారీరక దార్ఢ్య, వైద్య పరీక్షలు నిర్వహించి ప్రవేశం కల్పిస్తారు.


AISSEE - 2024 అడ్మిట్‌కార్డుల కోసం క్లిక్ చేయండి..


వివరాలు...


☀ అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష (AISSEE -2024)


సీట్ల సంఖ్య: 5,822.


సీట్ల కేటాయింపు: మొత్తం సీట్లలో 6వ తరగతికి 2970 సీట్లు, 9వ తరగతికి 697 సీట్లు కేటాయించారు. ఇక కొత్తగా మంజూరైన సైనిక స్కూళ్లలో 2155 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏ రాష్ట్రంలోనైతే సైనిక స్కూల్ ఉంటుందో అక్కడ అందుబాటులో ఉన్న మొత్తం సీట్లలో ఆ రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన విద్యార్థులకు 67 శాతం, ఇతర రాష్ట్రాల వారికి 33 శాతం సీట్లు కేటాయిస్తారు. అందులో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం ఇతర కులాలకు చెందిన విద్యార్థులకు 27 శాతం రిజర్వేషన్ ఉంటుంది. మిగిలిన 50.50 శాతం సీట్లలో 25 శాతం ఎక్స్-సర్వీస్‌మెన్ ఉద్యోగుల పిల్లలకు, మిగతా 25 శాతం ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు కేటాయిస్తారు. ఈ కోటాలో ఒకే రాష్ట్రానికి మూడు కంటే ఎక్కువ సీట్లు కేటాయించడానికి వీల్లేదు.


పరీక్ష విధానం..


పెన్ పేపర్ (ఓఎంఆర్ షీట్) విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో సాధించే మార్కుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. ఆబ్జె్క్టివ్ విధానంలోనే ప్రశ్నలు ఉంటాయి. 


6వ తరగతి ప్రవేశాలు కోరే విద్యార్థులకు మొత్తం 300 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 125 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో మ్యాథమెటిక్స్ నుంచి 50 ప్రశ్నలు- ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు; ఇక ఇంటెలిజెన్స్, లాంగ్వేజ్, జనరల్ నాలెడ్జ్ సబ్జెక్టుల నుంచి 25 ప్రశ్నల చొప్పున అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు. పరీక్ష సమయం 2.30 గంటలు (150 నిమిషాలు).


9వ తరగతిలో ప్రవేశాలు కోరే విద్యార్థులకు 400 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో మ్యాథమెటిక్స్ నుంచి 50 ప్రశ్నలు-ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు; ఇంటెలిజెన్స్, ఇంగ్లిష్, జనరల్ సైన్స్, సోషల్ సైన్స్ సజ్జెక్టుల నుంచి 25 ప్రశ్నలు-ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం మూడు గంటలు (180 నిమిషాలు).


9వ తరగతి విద్యార్థులు ఇంగ్లిష్ మాధ్యమంలో; 6వ తరగతి విద్యార్థులు ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష రాసే వెసులుబాటు ఉంది. 


అర్హత మార్కులు: పరీక్షలో ఒక్కో సెక్షన్‌కు కనీస అర్హత మార్కులను 25 శాతంగా నిర్ణయించారు. మొత్తంగా 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.


తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా ఉన్న అన్ని  సైనిక స్కూళ్లతోపాటు 186 నగరాలు, పట్టణాల్లో పరీక్ష నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, కరీంనగర్, అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.


నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...