దేశంలోని ప్రముఖ బిజినెస్‌ స్కూళ్లలో మేనేజ్‌మెంట్‌ కోర్సుల ప్రవేశాలకు నిర్దేశించిన NMAT-2022 (Narsee Monjee Management Aptitude Test) పరీక్ష దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పరీక్షలో మంచి మార్కులు సాధిస్తే.. మెరుగైన భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చు. NMAT-2022  పరీక్షను గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ కౌన్సెల్ (GMCA) నిర్వహిస్తోంది. ఈ పరీక్షలో వచ్చే మార్కుల ఆధారంగా దేశంలోని 68 విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అంతేకాకుండా దక్షిణాఫ్రికా, ఫిలిప్పీన్స్, నైజీరియా, మొరాకో వంటి దేశాల్లో చదవాలనుకునే విద్యార్థులకు కూడా ఈ స్కోరు ఉపయోగపడుతుంది. భారత్‌లో NMIMS  (నర్సీ మోంజీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్  స్టడీస్)తోపాటు ముంబయిలోని కె.జె.సోమయ్య ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్, మణిపాల్‌లోని టి.ఏ.పాయ్ మేనేజ్ మెంట్  స్టడీస్ (TAPMI), గీతం తదితర పేరొందిన సంస్థల్లో ఈ స్కోరు ద్వారా ప్రవేశం పొందవచ్చు.


 


వివరాలు..

* NMAT-2022  (నర్సిమోంజీ మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్)


అర్హత:
ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.



పరీక్ష ఫీజు: అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ.2,800 చెల్లించాల్సి ఉంటుంది.


Also Read: Foreign Education: భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఒక్కరోజులోనే వీసా!


పరీక్ష స్వభావం..

NMAT అనేది కంప్యూటర్ ఆధారిత పరీక్ష కాదు, కంప్యూటర్ అడాప్టివ్ పరీక్ష. ఈ రెండింటికీ మధ్య స్పష్టమైన తేడా ఉంది. విద్యార్థిని పరీక్షించే ఈ సాఫ్ట్‌వేర్ కాస్త భిన్నంగా పనిచేస్తుంది. ఇందులో ప్రశ్నల సంఖ్య, కఠినత్వం స్థాయి, ఒక్కో సెక్షన్‌కు కేటాయించిన సమయం ముందుగానే నిర్ణయించి ఉంటుంది. కానీ ప్రశ్నలు వరుసక్రమంలో మాత్రం ఉండవు. అలాగే ఒకసారి ఒక ప్రశ్న మాత్రమే కనిపిస్తుంది. దానికి జవాబు రాశాకే వేరే ప్రశ్నకు వెళ్లే అవకాశం ఉంటుంది. స్కిప్  చేయడానికి కుదరదు. ఒక ప్రశ్నకు విద్యార్థి జవాబు ఇచ్చినదాన్ని బట్టి వచ్చే ప్రశ్న ఆధారపడి ఉంటుంది. ఎలాంగంటే.. ప్రశ్నలకు జవాబులు ఇవ్వడంలో విద్యార్థికి అంతగా ప్రావీణ్యం లేదని సాఫ్ట్‌వేర్  గమనిస్తే... అప్పుడది ఆ విభాగంలో సులువైన ప్రశ్నలు ఇవ్వడం మొదలుపెడుతుంది. ప్రశ్న స్థాయిని బట్టి ఇచ్చే మార్కులు ఆధారపడి ఉంటాయి. అంటే అధికస్కోరు సాధించిన వ్యక్తి ఎక్కువ కఠినత్వం ఉన్న ప్రశ్నలు రాసి ఉంటారు. తక్కువ స్కోరు ఉన్నవారు సులువైన ప్రశ్నలు రాసి ఉంటారు. ఈ విధానంలో తొలుత అడిగే ప్రశ్నలకు ఎక్కువ వెయిటేజీ ఉంటుంది. దీని ఉద్దేశం విద్యార్థి సరైన జవాబులు రాయడమే. కానీ సులువైన ప్రశ్నలకు తక్కువ మార్కులు వస్తాయన్నమాట. అలాగే అటెంప్ట్  చేయని ప్రశ్నలకు పెనాల్టీ మార్కులు ఉంటాయి.




Also Read:  పేద విద్యార్థుల కోసం ‘నారాయణ’ స్కాలర్‌షిప్‌ టెస్ట్, దరఖాస్తు చేసుకోండి!



ప్రశ్నపత్రం ఇలా..

పరీక్షలో 3 సెక్షన్లు ఉంటాయి. లాంగ్వేజ్  స్కిల్స్, లాజికల్  రీజనింగ్, క్వాంటిటేటివ్  స్కిల్స్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్షలో ఈ సెక్షన్లు ఏ వరుసలో రావాలో విద్యార్థి ఎంచుకునే అవకాశం ఉంటుంది. తప్పు జవాబులకు నెగిటివ్  మార్కింగ్  లేదు. ఒక ఏడాదిలో ఎన్‌మాట్  పరీక్షను మూడుసార్లు రాసేందుకు అవకాశం ఉంది. పరీక్ష రాసే రోజు, సమయం, ప్రాంతం ఇలా అన్నింటినీ విద్యార్థి ఎంచుకునే సౌలభ్యం ఇచ్చారు. పరీక్ష రాసిన తర్వాత ఆ మార్కులతో కాలేజీలకు విడివిడిగా దరఖాస్తు చేసుకోవాలి. ఫలితాలు చూసుకున్నాకే ఈ ప్రక్రియ మొదలుకావడం వల్ల ఏ కళాశాలలకు దరఖాస్తు చేస్తే సీటు వస్తుందో విద్యార్థికి ముందే అవగాహన ఉంటుంది. చాలామంది విద్యార్థులు మూడుసార్లు రాయవచ్చు కదా అనే ఉద్దేశంతో మొదటిసారి అంతగా ఫోకస్  లేకుండా రాసేస్తుంటారు. కానీ ఇది అంత మంచి పద్ధతి కాదు. ఒకటే అవకాశం ఉంది, ఎలా అయినా పాసై తీరాలి అనుకుంటేనే తొలి ప్రయత్నంలోనే మంచి స్కోరు సాధించగలుగుతారు. ప్రతి ప్రయత్నానికి విడివిడిగా ఫీజు కట్టాల్సి ఉంటుందనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి.


 


Also Read: BRAOU: ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ - మార్కెట్‌లోకి అంబేద్కర్‌ వ‌ర్సిటీ స్టడీ మెటీరియల్‌! 




పరీక్ష కేంద్రంలో రాయడమే మేలు..

NMAT పరీక్ష ఇంట్లో నుంచి రాసే అవకాశం కూడా ఉంది. కాని ఇంట్లో కంటే కూడా పరీక్షా కేంద్రంలో రాయడమే మేలు. ఎందుకంటే ఇంట్లో, మన గదిలో ఉండి రాసేదానికీ, కేంద్రంలో అందరి మధ్యా రాయటానికి మనం చూపించే శ్రద్ధలో చాలా తేడా ఉంటుంది. పైగా ఇంట్లో ఇంటర్‌నెట్ కనెక్షన్ లోకానీ, సిస్టంలోకానీ ఏదైనా సమస్య వస్తే మొత్తం పరీక్షకి ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది. అదే సెంటర్ లో అయితే ఆ బాధ్యతలన్నీ అధికారులు చూసుకుంటారు.


ముఖ్యమైన తేదీలు..


దరఖాస్తుకు చివరితేదీ: 10.10.2022.


పరీక్ష తేదీలు: 10.10.2022 - 19.12.2022.


 


WEBSITE


 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...