బ్రిటన్‌లో చదవాలనుకునే భారతీయ విద్యార్థులకు యూకే ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి వీసా కష్టాలు గట్టెక్కనున్నాయి. కేవలం ఒక్కరోజులోనే వీసా మంజూరు చేస్తామని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. వీసాల జారీ ప్రక్రియను మరింత వేగవంతం, సులభతరం చేస్తునట్లు.. వీసాలు తొందరగా జారీ చేసేందుకు ప్రియారిటీ, సూపర్ ప్రియారిటీ విధానాలను తీసుకొచ్చినట్లు భారత్‌లోని బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎలిస్ ప్రకటించారు. 



ప్రియారిటీ వీసాను అప్లై చేసుకున్న ఐదు రోజుల్లో, సూపర్ ప్రియారిటీ వీసాను దరఖాస్తు చేసుకున్న ఒక్కరోజులోనే పొందవచ్చని వెల్లడించారు. దీని కోసం వీసా ఫీజుతోపాటు అదనఫు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ, చివరి పనిదినం రోజున లేదా సెలవురోజు కంటే ఒక రోజు ముందు సూపర్ ప్రయారిటీ వీసాకు దరఖాస్తు చేసుకుంటే గనుక.. ఆ మరుసటి పనిదినం రోజే వీసాల జారీ ఉంటుంది. 



కోవిడ్ తర్వాత బ్రిటన్ వీసాకు డిమాండ్ పెరిగిందన్నారు. వీసా కోటా ముగిసేలోపు భారతీయ విద్యార్థులు అప్లై చేసుకుంటే మంచిదని సూచించారు. బ్రిటన్ ప్రభుత్వం ప్రస్తుతం వీసాల పరిశీలనకు 15 రోజుల గడువు తీసుకుంటోంది. 2022 జూన్ నాటికి బ్రిటిష్ ప్రభుత్వం 1.18 లక్షల మంది భారత విద్యార్థులకు వీసాలు మంజూరు చేసింది. అంతకుముందు ఏడాది పోలిస్తే ఇది దాదాపు 90 శాతం ఎక్కువ.



బ్రిటన్ వీసాల జారీలో ఆలస్యం జరుగుతుండటంపై ఇటీవల అలెక్స్ ఎల్లిస్ క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. కొవిడ్ తర్వాత యూకే వీసాలకు డిమాండ్    పెరిగిందని, దీంతో పాటు కొన్ని ప్రపంచ పరిణామాల నేపథ్యంలో వీసాల జారీలో జాప్యం జరుగుతోందని ఆయన వివరించారు. మరోవైపు, అమెరికా, కెనడా వీసాల మంజూరుకు ఏడాదికి పైగా జాప్యం జరుగుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.







Also Read:


BRAOU: ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ - మార్కెట్‌లోకి అంబేద్కర్‌ వ‌ర్సిటీ స్టడీ మెటీరియల్‌! ధర ఎంతంటే?
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ యువత కోసం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం (బీఆర్‌ఏవోయూ) నాలుగు పుస్తకాలతో కూడిన స్టడీ మెటీరియల్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పుస్తకాలకు అభ్యర్థుల నుంచి మంచి స్పందన వస్తోంది. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం తీసుకొచ్చిన ఈ మెటీరియల్‌ను ఆవిష్కరించిన రెండురోజుల్లోనే బుకింగ్స్​‍ మొదలయ్యాయి. వర్సిటీ అధికారులు నాలుగు పుస్తకాల ధరను రూ. 1,150గా నిర్ణయించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


 


Also Read:


TS Govt Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్, మరో 2910 పోస్టులకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
TS Govt Jobs : తెలంగాణ ప్రభుత్వం మరో 2910 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చింది.  663 గ్రూప్‌-2 ఉద్యోగాలు, 1373 గ్రూప్‌-3 ఉద్యోగాల భర్తీకి తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ తో ఉద్యోగాల నియామక ప్రక్రియలో 50 వేల మైలురాయిని దాటేశామని ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.  సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఇచ్చిన హామీ  మేరకు గడిచిన మూడు నెలలుగా ఇప్పటి వరకు 52,460 ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ చేశామని మంత్రి తెలిపారు. మిగతా ఉద్యోగాల భర్తీకి కూడా త్వరలోనే అనుమతులు ఇస్తామని తెలిపారు. 
పూర్తి వివరాలు జీవోల కోసం క్లిక్  చేయండి..


 


 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..