తెలంగాణలో పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు సెప్టెంబర్ 2న విడుదల చేశారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఉదయం 11.30 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చూసుకోవచ్చు. 10వ తరగతి సప్లిమెంటరీ రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ http://www.results.manabadi.co.in/2022/TS/SSC-Sup/Telangana-TS-10th-class-SSC-Supply-Results-02092022.htm

ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి 10 వరకు పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆయా తేదీల్లో ఉద‌యం 9:30 నుంచి మ‌ధ్యాహ్నం 12:45 గంట‌ల వ‌ర‌కు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు దాదాపు 55,662 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరికోసం రాష్ట్ర వ్యాప్తంగా 204 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

ఫలితాల కోసం వెబ్‌సైట్: https://www.bse.telangana.gov.in 

వార్షిక పరీక్ష ఫలితాలు ఇలా...
తెలంగాణ పదో త‌ర‌గ‌తి పరీక్షలను  మే 23 నుంచి జూన్ 1 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. కొవిడ్‌-19 కారణంగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను 11 పేపర్ల పరీక్షకు బదులు 6 పేపర్లకు కుదించారు. సిలబస్‌ను సైతం 30 శాతం తగ్గించి ప్రశ్నపత్రాల్లో ఛాయిస్‌ పెంచారు. ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,09,275 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా వీరిలో 99 శాతం మంది హాజరయ్యారు.  జూన్ 30న పదోతగరతి ఫలితాలు వెల్లడించారు. ఫ‌లితాల్లో బాలిక‌లు 92.45 శాతం ఉత్తీర్ణత సాధించి విజ‌య‌భేరి మోగించారు. బాలురు 87.61 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రయివేటు విద్యార్థుల్లోనూ బాలిక‌ల‌దే పైచేయి. బాలిక‌లు 58.76 శాతం ఉత్తీర్ణత సాధించ‌గా, బాలురు 46.21 శాతం పాస‌య్యారు. 3,007 పాఠ‌శాల‌లు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. 15 పాఠ‌శాలల్లో జీరో శాతం ఉత్తీర్ణత న‌మోదైంది.  రెగ్యులర్ విద్యార్థులు 5,03,579 మంది ప‌రీక్షల‌కు హాజ‌రు కాగా, 4,53,201 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా టెన్త్ ఫ‌లితాల్లో 90 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక ప్రయివేటు విద్యార్థుల విష‌యానికి వ‌స్తే 819 మంది హాజ‌రు కాగా, 425 మంది పాస‌య్యారు. 51.89 శాతం ఉత్తీర్ణత సాధించారు.  ఫలితాల్లో 97 శాతం ఉత్తీర్ణతతో సిద్ధిపేట జిల్లా టాప్‌గా నిలువగా.. 79 శాతం ఉత్తీర్ణతతో హైదరాబాద్‌ చివరిస్థానంలో నిలిచింది.


Also Read:

NSAT 2022: పేద విద్యార్థుల కోసం ‘నారాయణ’ స్కాలర్‌షిప్‌ టెస్ట్, దరఖాస్తు చేసుకోండి!
ప్రతిభావంతులైన పేద విద్యార్థుల కోసం నారాయణ స్కాలస్టిక్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్ (NSAT) నిర్వహణకు నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ దరఖాస్తులు కోరుతోంది. 7వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతూ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌ టెస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా  పరీక్ష నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు తమ పేర్లను వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. పరీక్షలో మెరిట్ ఆధారంగా విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందజేస్తారు.
అప్లి చేసుకోవడం సహా పూర్తి వివరాలు


Also Read:

దేశంలోనే తొలి వర్చువల్ స్కూల్ ప్రారంభం, ప్రత్యేకతలివే!
విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరో ముందడుగు వేశారు. దేశంలోనే తొలి వర్చువల్ పాఠశాలను కేజ్రీవాల్ ఆగస్టు 31న ప్రారంభించారు. ‘ఢిల్లీ మోడల్ వర్చువల్ స్కూల్’గా దీనికి పేరు పెట్టారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. దేశంలోని ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాల‌నే ల‌క్ష్యంతో ఈ వర్చువల్ స్కూల్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. 
స్కూల్స్ పూర్తి వివరాలు


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...