దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) 2021 యూజీ (అండర్ గ్రాడ్యుయేట్) ప్రిలిమినరీ పరీక్ష ఆన్సర్​ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. సమాధానాల​ కీతో పాటు అభ్యర్థుల ఆన్సర్​ షీట్లను కూడా రిలీజ్ చేసింది. అభ్యర్థులు ఓఎంఆర్ ఆన్సర్ కీ స్కాన్ కాపీలను వారి ఈమెయిల్ ఐడీలకు పంపినట్లు ఎన్టీఏ వెల్లడించింది. ప్రిలిమనరీ కీపై అభ్యంతరాలను రేపు (అక్టోబ‌ర్ 17 ) రాత్రి 9 గంటల వరకు స్వీకరిస్తామని చెప్పింది. కీలోని ఆన్సర్లను సవాల్ చేయాలంటే ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. దీనికి సంబంధించిన ఫీజు చెల్లింపు విండ్ రేపటి వరకు తెరిచి ఉంటుందని వివరించింది. ఆన్సర్​ కీ డౌన్‌లోడ్, ఫీజు చెల్లింపు వివరాలను నీట్, ఎన్టీఏ అధికారిక వెబ్​సైట్లు www.neet.nta.nic.in లేదా www.nta.ac.in ​నుంచి చేసుకోవచ్చు. 


Also Read:  డిప్లొమా, ఇంజనీరింగ్ విద్యార్థినులకు స్కాలర్‌షిప్‌.. ఏడాదికి రూ.50,000 సాయం.. ప్రగతి ప్రోగ్రామ్ వివరాలివే..


నీట్ యూజీ ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలను నమోదు చేయండిలా..
* నీట్ అధికారిక వెబ్​సైట్ https://neet.nta.nic.in/ ను ఓపెన్ చేయండి. 
* ఇక్కడ 'వ్యూ కీ అండ్ ఛాలెంజ్ ఆన్సర్ కీ' అనే లింక్ మీద క్లిక్ చేయండి. 
* అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్ వర్డ్ వంటి క్రెడెన్షియల్ వివరాలు ఇవ్వాలి. 
* 'ఛాలెంజ్ /వ్యూ ఆన్సర్ కీ' అనే ఆప్షన్ ఎంచుకోండి. 
* దీంతో నీట్ యూజీ 2021 ఆన్సర్ కీ మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది.


* కోడ్ ఆధారంగా ప్రశ్నపత్రాన్ని ఎంచుకుని మీ సమాధానాలను సరిపోల్చుకోండి. 
* కీపై అభ్యంతరాలు ఉంటే మీరు ఛాలెంజ్ చేయాలనుకునే ప్రశ్న పక్కన బాక్స్ ఎంచుకోండి. 
* మీరు అభ్యంతరం లేవనెత్తిన ప్రశ్న సరైన సమాధానానికి సంబంధించిన డాక్యుమెంట్లను అప్​లోడ్​ చేయండి. 
* మీ రిక్వెస్టును సేవ్ చేసుకోండి. తర్వాత ఫీజు చెల్లించండి. 
* ఫాం సబ్మిట్ చేశాక.. భవిష్యత్ అవసరాల కోసం ఒక పీడీఎఫ్ కాపీని భద్రపరుచుకోండి.   


Also Read:  నేటి నుంచే జోసా కౌన్సెలింగ్.. ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి.. పూర్తి వివరాలు ఇవే..


Also Read:  దివ్యాంగ విద్యార్థులకు ఏఐసీటీఈ స్కాలర్‌షిప్.. ఏడాదికి రూ.50 వేలు సాయం.. 


Also Read: కోవిడ్ బాధిత విద్యార్థులకు ఎస్‌బీఐ స్కాల‌ర్‌షిప్‌.. ఏడాదికి రూ.38,500 సాయం.. 



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి