దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీ వంటి పలు విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించిన జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (JoSAA) కౌన్సెలింగ్ ప్రక్రియ ఈరోజు (అక్టోబర్ 16) నుంచి ప్రారంభం కానుంది. శనివారం నుంచి నవంబర్ 18వ తేదీ వరకు మొత్తం 6 విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు జోసా వెల్లడించింది. ఈ కౌన్సెలింగ్ ద్వారా దేశంలోని 23 ఐఐటీలు, 31 ఎన్‌ఐటీలు, 20 గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌లు (జీఎఫ్‌టీఐ), 23 ట్రిపుల్ ఐటీలు వంటి 97 విద్యా సంస్థల్లో సీట్లను జోసా భర్తీ చేయనుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇవాల్టి (అక్టోబర్ 16) నుంచి ప్రారంభం కానుంది. మొదటి దశ మాక్ సీట్ కేటాయింపు ఈ నెల 22వ తేదీన జరపనుంది.
తొలి విడత కౌన్సెలింగ్ సీట్లను అక్టోబర్ 27వ తేదీన కేటాయిస్తామని తెలిపింది. రెండో విడత సీట్లను నవంబర్ 1న, మూడో విడత సీట్లను నవంబర్ 6న, నాలుగో విడత సీట్లను నవంబర్ 10న కేటాయించనున్నట్లు పేర్కొంది. ఐదో విడత సీట్లను నవంబర్ 14న, చివరిదైన ఆరో విడత సీట్లను నవంబర్ 18న కేటాయించనున్నట్లు వివరించింది. చివరి విడతలో సీట్లు పొందింన వారు నవంబర్ 20వ తేదీలోగా రిపోర్టు చేయాలని సూచించింది.
Also Read: దివ్యాంగ విద్యార్థులకు ఏఐసీటీఈ స్కాలర్‌షిప్.. ఏడాదికి రూ.50 వేలు సాయం..
నేటి నుంచి 25 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ..
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు నిన్న (అక్టోబర్ 15) విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఈరోజు (అక్టోబర్ 16) నుంచి అక్టోబర్ 25వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకుని వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోని పక్షంలో అభ్యర్థులు అడ్మిషన్ కోల్పోవాల్సి వస్తుంది. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న ప్రతి విద్యార్థి కాలేజీలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేయకపోతే సీటు కేటాయించరు.
Also Read: విద్యార్థుల కోసం స్కాలర్‌షిప్స్.. వచ్చే నెలతో ముగియనున్న గడువు..
జోసా కౌన్సెలింగ్.. అవసరమైన డాక్యుమెంట్లు ఇవే..
* జేఈఈ మెయిన్ రిజిస్ట్రేషన్ కోసం ఉపయోగించిన మూడు పాస్ పోర్ట్ సైజు ఫొటోలు.
* సంతకం స్కాన్డ్ కాపీ
* వయసు నిర్ధారణ కోసం 10వ తరగతి మార్కుల సర్టిఫికెట్
* ఇంటర్ (Class 12) మార్కులు సర్టిఫికెట్
* ప్రభుత్వ గుర్తింపు పొందిన ఫొటో ఐడీ (ఉదా: ఆధార్ కార్డు)
* కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ (రిజర్వేషన్ వర్తించే వారికి మాత్రమే)
* జేఈఈ మెయిన్ స్కోర్ కార్డు
* జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డు
* జేఈఈ అడ్వాన్స్ అడ్మిట్ కార్డు
* జేఈఈ అడ్వాన్స్ రిజల్ట్ కార్డు
Also Read: కోవిడ్ బాధిత విద్యార్థులకు ఎస్‌బీఐ స్కాలర్‌షిప్.. ఏడాదికి రూ.38,500 సాయం..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి