నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామ్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్స్‌(NBEMS) నీట్‌ పీజీ 2022 అప్లికేషన్ ఫామ్‌ విడుదల చేసింది. అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు nbe.edu.in.వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్ అప్లికేషన్ ఫిల్‌ చేయాలి. ఈ నీట్‌ పీజీ 2022 అప్లికేషన్ స్వీకరించి ఎండీ/ఎంఎస్‌, పీజీ డిప్లొమా/ పోస్ట్‌ ఎంపీబీఎస్‌ డీఎన్బీ, ఎన్‌బీఈఎంఎస్‌ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లు ఇవ్వనుంది. 
ఫిబ్రవరి4 వరకు అప్లే చేసుకోవచ్చు. ఈ కోర్సుల కోసం అప్లై చేసుకోవాల్సిన అభ్యర్థులు మొదట వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. అలా చేసుకున్న వాళ్లకు యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఇస్తారు. ఆ తర్వాత వాటిని ఉపయోగించి లాగిన్‌ అయ్యాక అప్లికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో వ్యక్తిగత, అకడమిక్‌ వివరాలు ఫిల్‌ చేయాలి. 


ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత అభ్యర్థులు సంతకం, ఫొటో, థంబ్‌ స్కాన్  చేసి అప్‌లోడ్‌ చేయాలి. ఇచ్చిన ఆఫ్షన్‌ సిటీల్లో పరీక్ష కోసం ఓ సిటీని ఎంపిక చేసుకోవాలి. చివరగా పరీక్ష ఫీజు చెల్లింపుతో అప్లికేషన్ నింపడం పూర్తవుతుంది. 






జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ అభ్యర్థులు 4250ను ఫీజు కింద చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు 3250 చెల్లిస్తే చాలు. ఆన్‌లైన్‌లోనే ఫీజు కూడా చెల్లించాలి. 


అభ్యర్థులు అప్లికేషన్ ఫిల్‌ చేయడానికి ముందు నోటిఫికేషన్ క్షుణ్ణంగా చదవాలి. ముందుగా అప్లై చేసుకున్న వాళ్లకు ముందుగా పరీక్ష కేంద్రం అలాట్ చేస్తారు. కాబట్టి వీలైనంత త్వరగా అప్లై చేసుకోవాలి. ఆలస్యంగా అప్లై చేస్తే మీకు దగ్గర్లో ఉన్న సిటీలో పరీక్ష కేంద్రంలో ఖాళీలు లేకుంటే వేరే ప్రాంతానికి పంపిస్తారు. 


అప్లికేషన్‌లో తప్పులు దొర్లాయన్న కంగారు మీకు అవసరం లేదు. ఫిబ్రవరి 8 నుంచి 11 వరకు తప్పులు సరిదిద్దుకునే ఛాన్స్‌ ఎన్‌బీఈఎంఎస్‌ కల్పిస్తోంది. దీనికి సంబంధించిన పరీక్ష మార్చి 12న జరగనుంది. 


Also Read: ట్విట్టర్ వేదికగా పరస్పరం ట్వీట్లు విసురుకుంటున్న వైసీపీ ఎంపీలు


Also Read: సీఐడీ విచారణకు రఘురామ డుమ్మా.. 4వారాల సమయం కావాలని లేఖ !


  Also Read: తక్షణమే విద్యాసంస్థలకు సెలవులు పొడిగించండి.... సీఎం జగన్ కు నారా లోకేశ్ లేఖ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి