న్యూఢిల్లీలోని నేషనల్‌ లా యూనివర్సిటీ (ఎన్‌ఎల్‌యూ)-అకడమిక్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బీఏ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్‌), ఎల్‌ఎల్‌ఎం, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆలిండియా లా ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏఐఎల్‌ఈటీ) 2023 ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. బీఏ ఎల్‌ఎల్‌బీ(ఆనర్స్‌), ఎల్‌ఎల్‌ఎం ప్రోగ్రామ్‌లలో ఒక్కోదానిలో అయిదు సీట్లను విదేశీ అభ్యర్థులకు మరో అయిదు సీట్లను ఓసీఐ/ పీఐఓ అభ్యర్థులకు; పీహెచ్‌డీలో రెండు సీట్లను విదేశీయులకు ప్రత్యేకించారు. వీరికి అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా అడ్మిషన్స్‌ ఇస్తారు. వీరు ఎంట్రెన్స్‌ టెస్ట్‌ రాయనవసరం లేదు.


★ నేషనల్‌ లా యూనివర్సిటీ ప్రవేశ ప్రకటక 2023-24

1) బీఏ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్‌)

సీట్ల సంఖ్య:
123.

కోర్సు వ్యవధి: 5 సంవత్సరాలు.

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 45 శాతం మార్కులతో ఏదేని గ్రూప్‌తో ఇంటర్‌/ పన్నెండో తరగతి/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు చాలు. ఓసీఐ/పీఐఓ/విదేశీ అభ్యర్థులకు కనీసం 65 శాతం మార్కులు ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నవారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు.

Also Read:  AP RCET - 2022: ఏపీ ఆర్‌సెట్ షెడ్యూలు వచ్చేసింది, ఏరోజు ఏ పరీక్ష అంటే?


2) ఎల్‌ఎల్‌ఎం 

సీట్ల సంఖ్య: 81.

కోర్సు వ్యవధి: ఏడాది. 

అర్హత: ద్వితీయ శ్రేణి మార్కులతో ఎల్‌ఎల్‌బీ లేదా తత్సమాన కోర్సు పూర్తిచేసి ఉండాలి. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు చాలు. చివరి సంవత్సర పరీక్షలకు సన్నద్దమౌతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 


Also Read:   జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్ టైమ్ పీజీ కోర్సులు, చివరితేది ఎప్పుడంటే?




3) పీహెచ్‌డీ


అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీ సం 55 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌ఎం ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు చాలు. యూజీసీ జేఆర్‌ఎఫ్‌ అభ్యర్థులకు అయిదు, ఏఐఎల్‌ఈటీ మెరిట్‌ సాధించిన అభ్యర్థులకు అయిదు, ఏఐఎల్‌ఈటీ మెరిట్‌ ద్వారా ఫెలోషిప్‌ పొందినవారికి నాలుగు సీట్లు ప్రత్యేకించారు. యూజీసీ జేఆర్‌ఎఫ్‌ అర్హత ఉన్నవారు ఎంట్రెన్స్‌ టెస్ట్‌ రాయనవసరం లేదు. 


దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.3500; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1500; ఎస్సీ, ఎస్టీ కేటగిరీలలో బీపీఎల్‌ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.


 


Also Read:  NEET UG Counselling: నీట్ యూజీ 2022 కౌన్సెలింగ్ షెడ్యూలు వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే!




పరీక్ష విధానం:


బీఏ ఎల్‌ఎల్‌బీ(ఆనర్స్‌) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నిర్వహించే ఎగ్జామ్‌లో మొత్తం 150 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ నుంచి 50, కరెంట్‌ అఫైర్స్‌ అండ్‌ జనరల్‌ నాలెడ్జ్‌ నుంచి 30, లాజికల్‌ రీజనింగ్‌ నుంచి 70 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. తప్పుగా గుర్తించిన సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం గంటన్నర.

ఎల్‌ఎల్‌ఎం ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నిర్వహించే పరీక్షలో రెండు సెక్షన్‌లు ఉంటాయి. సెక్షన్‌కు 75 మార్కులు చొప్పున మొత్తం మార్కులు 150. పరీక్ష సమయం గంటన్నర. మొదటి సెక్షన్‌లో రెండు పార్ట్‌లు ఉంటాయి. మొదటి పార్ట్‌లో ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ నుంచి 25 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. తప్పుగా గుర్తించిన సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు. రెండో పార్ట్‌లో లీగల్‌ రీజనింగ్‌ నుంచి 25 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు ఉంటాయి. వీటికి నెగెటివ్‌ మార్కులు లేవు. రెండో సెక్షన్‌లో లా విభాగాలకు సంబంధించి పది డిస్ర్కిప్టివ్‌ ప్రశ్నలు అడుగుతారు. వీటిలో రెంటికి సమాధానాలు రాయాలి. మొదటి సెక్షన్‌లో ప్రతి పార్ట్‌లో కనీసం 50 శాతం మార్కులు సాధిస్తేనే రెండో సెక్షన్‌ను పరిశీలిస్తారు. 

పీహెచ్‌డీలో ప్రవేశానికి నిర్వహించే పరీక్షలో రెండు సెక్షన్‌లు ఉంటాయి. మొదటి సెక్షన్‌లో లీగల్‌ నాలెడ్జ్‌, లీగల్‌ రీజనింగ్‌ అంశాలనుంచి 50 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. తప్పుగా గుర్తించిన సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు. రెండో సెక్షన్‌లో రిసెర్చ్‌కు సంబంధించి మూడు ప్రశ్నలు అడుగుతారు. ఒకదానికి సమాధానం రాయాల్సి ఉంటుంది. సెక్షన్‌కు 50 చొప్పున మొత్తం మార్కులు 100. పరీక్ష సమయం గంటన్నర.



Also Read:  EFLU: ఇఫ్లూలో పార్ట్-టైమ్ లాంగ్వేజ్ కోర్సులు, దరఖాస్తు చేసుకోండి!


ముఖ్యమైన తేదీలు..


★ దరఖాస్తుకు చివరి తేదీ: 15.11.2022.

★ అడ్మిట్‌ కార్డ్ డౌన్‌లోడ:  22.11.2022 నుంచి

★ ఆలిండియా లా ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏఐఎల్‌ఈటీ) 2023 తేదీ: 11.12.2022.



తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, తిరుపతి, విశాఖపట్నం.


Notification


Online Application


WEBSITE



మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..