Hyderabad Metro Rail : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. మెట్రో రైలు సేవలను రాత్రి 11 గంటల వరకు పొడిగిస్తున్నట్లు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం రాత్రి 10.15 గంటల వరకు ఉన్న చివరి మెట్రో రైలు సేవలను రాత్రి 11 గంటల వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రయాణ వేళల్లో మార్పులు చేశారు. పొడిగించిన మెట్రో సేవలు అక్టోబర్ 10 నుంచి అమల్లోకి రానున్నాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 వరకు మెట్రో సేవలు నడుస్తాయని హెచ్ఎమ్ఆర్ తెలిపింది.
వాట్సాప్ లో టికెట్లు
దేశంలోనే మొట్ట మొదటిసారిగా వాట్సాప్ ద్వారా మెట్రో రైలు టికెట్‌ను బుకింగ్ చేసుకునే సేవలను ఇటీవలే ప్రారభించారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులు ముందుగా 8341146468 నంబర్ కు వాట్సాప్ ద్వారా హాయ్ అనే మేసెజ్ పంపించాలి. ప్రయాణికుల వాట్సాప్ కు వెంటనే మరో మెసేజ్ లో లింకు వస్తుంది. లింకును ఓపెన్ చేయగానే హైదరాబాద్ మెట్రో రైలు వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. అందులో ప్రయాణికులు జర్నీ వివరాలు నమోదు చేయాలి. ఏ మెట్రో స్టేషన్ లో ఎక్కుతారో, ఎక్కడ దిగుతారో వివరాలు నమోదు చేయాలి. టికెట్ ఒకరి కోసమా, తిరుగు ప్రయాణం వివరాలు అడుగుతుంది.
క్యూఆర్ కోడ్ తో
వివరాలు నమోదు చేసిన తర్వాత టికెట్ కోసం చెల్లించాల్సిన పేమెంట్ చూపిస్తూ ప్రోసీడ్ బటన్ చూపిస్తుంది. దానిని ప్రెస్ చేయగానే పే నౌ ఆప్షన్ వస్తుంది. తర్వాత యుపీఐ, లేదా ఇతర అకౌంట్ల ద్వారా టికెట్ కోసం చెల్లింపులు చేయవచ్చు. టికెట్ కోసం నగదు చెల్లించిన తర్వాత క్యూర్ కోడ్‌తో టికెట్ వస్తుంది. టికెట్ ను మెట్రో స్టేషన్‌లో ఎంట్రీ గేటు వద్ద క్యూఆర్ కోడ్ రీడర్ చూపిస్తే ఎంటర్ అయ్యేందుకు అనుమతిస్తుంది. స్మార్ట్‌ఫోన్ ద్వారా మెట్రో రైలు టికెట్లను సులభంగా కొనుగోలు చేసేందుకు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిన హెచ్ఎమ్ఆర్ తెలిపింది.
Also Read : Adilabad News : కూతురికి పైలెట్ ఉద్యోగం, కార్మికులను విమానం ఎక్కించిన యజమాని
Also Read : నా ఫోన్‌ను మోదీ ట్యాప్ చేశారు- నాకంటే ముందే నా ఫైల్స్ చదువుతున్నారు - కేటీఆర్ సంచలన ఆరోపణలు