Adilabad News : వారంతా నిరుపేదలు, షాపులో కార్మికులుగా పనిచేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. అలాంటి వారికి ఒక్కసారిగా విమానం ఎక్కే అవకాశం దక్కింది. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకునే అదృష్టం కలిగింది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లికి చెందిన ఆంధ్ర ఏజెన్సీస్ యజమాని అజీజ్ హిరాణీ తన కూతురు కల నెరవేరడంతో తన వద్ద పనిచేసే కార్మికులకు ఈ అవకాశం కల్పించారు. తన కూతురుకు ఇండిగో ఎయిర్‌లైన్స్ లో ఫస్ట్ పైలట్ గా ఉద్యోగం రావడంతో కూతురి కల నెరవేరిన ఆనందంలో అజీజ్ హిరాణీ తన సంతోషాన్ని తన వద్ద పనిచేసే కార్మికులతో పంచుకున్నారు. శాశ్వతంగా గుర్తుండేలా వారిని విమాన ప్రయాణం చేయించారు.
కూతురు లక్ష్యం నెరవేరడంతో
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లికి చెందిన ఆజీజ్ హిరాణీ ఇంద్రవెల్లిలో ఓ కిరాణా దుకాణం నడుపుతూ వ్యాపారాన్ని విస్తరించి ఆంధ్ర ఏజెన్సీస్ వ్యాపార వేత్తగా ఎదిగారు. తనకున్న ఇద్దరు పిల్లలు అఫ్రీన్, అల్నూర్, ఉన్నత చదువులు చదివి మంచి పేరు సంపాదించారు. అఫ్రీన్ ప్రస్తుతం ఇండిగో ఎయిర్‌లైన్స్ లో ఫస్ట్ పైలట్ అఫీసర్ గా ఉద్యోగం సంపాదించింది. ఆదిలాబాద్ లోని సెయింట్ కాన్వెంట్ స్కూల్ లో LKG నుంచి 10వ తరగతి వరకు చదివిన అఫ్రీన్ ఆపై హైదరాబాదులోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసింది. అనంతరం ఆస్ట్రేలియాలో ఎరోనాటికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసింది. దీంతో అఫ్రీన్ కు ఇండిగో ఎయిర్‌లైన్స్ లో ఫస్ట్ పైలట్ అఫీసర్ గా ఉద్యోగం వచ్చింది. కూతురికి అనుకున్న ఉద్యోగం దొరకడం, తన లక్ష్యాన్ని చేరుకుందన్న ఆనందంలో తండ్రి అజీజ్ హిరాణీ తన వద్ద పనిచేసే నిరుపేదలైన 15 మంది కార్మికులను విమానం ఎక్కించారు.
ఈ హామీలు నెరవేర్చి టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చండి - పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్
తిరుపతికి విమానంలో
ఇంద్రవెల్లి నుంచి హైదరాబాద్ కు బస్సులో వచ్చిన కార్మికులు, హైదరాబాద్ నుంచి తిరుపతికి విమానంలో ప్రయాణించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తిరిగి హైదరాబాద్ కు వచ్చి వండర్ లా, సిటీ పార్కులో విహారయాత్ర చేశారు. అజీజ్ హిరాణీ తన వద్ద పనిచేసే నిరుపేద కార్మికులను విమానంలో తీసుకెళ్లి తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి దర్శన భాగ్యం కలిగించడంపై ప్రశంసలు వెళ్లువెత్తుతున్నాయి. తమ యజమాని కూతురు కల నెరవేరడంతో తమకు విమానం ఎక్కే అవకాశం కలిగిందని కార్మికులు చెబుతున్నారు. అసలు జీవితంలో తాము విమానం ఎక్కుతామని కలలో కూడా అనులోలేదని, తమ యజమాని కూతురుకు పైలట్ గా జాబ్ రావడంతో ఈ అవకాశం దక్కిందని కార్మికులందరు సంతోషం వ్యక్తం చేస్తూ తమ యజమాని మంచి మనసుకు ధన్యవాదాలు తెలిపారు.
Also Read : నా ఫోన్‌ను మోదీ ట్యాప్ చేశారు- నాకంటే ముందే నా ఫైల్స్ చదువుతున్నారు - కేటీఆర్ సంచలన ఆరోపణలు
Also Read : Amalapuram BRS Banners : అమలాపురంలో బీఆర్ఎస్ ఫ్లెక్సీల కలకలం, రాజకీయ వ్యూహాంలో భాగమేనా?