తెలంగాణలో లాసెట్, పీజీఎల్ సెట్ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి గమనిక. తెలంగాణ లాసెట్, పీజీఎల్ సెట్ పరీక్షల హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే వెబ్‌సైట్ రేపు (ఆగస్టు 21), ఎల్లుండి (ఆగస్టు 22) పనిచేయదని లాసెట్ కన్వీనర్ ఆచార్య జీబీ రెడ్డి వెల్లడించారు. నిర్వహణ (మెయింటెనెన్స్) పనుల కోసం అని 21, 22 తేదీల్లో వెబ్‌సైట్ పనిచేయదని తెలిపారు.
కాబట్టి పరీక్షలకు హాజరు కానున్న అభ్యర్థులు ఈ రోజే (ఆగస్టు 20) హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపారు. ఈ రోజు సాయంత్రం 7 గంటల్లోగా lawcet.tsche.ac.in వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు.
ఆగస్టు 23, 24 తేదీల్లో పరీక్షలు..
తెలంగాణలోని లా కాలేజీల్లో న్యాయ విద్య ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ లాసెట్, టీఎస్ పీజీఎల్ సెట్ పరీక్షల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ ప్రక్రియ ఆగస్టు 12 నుంచి ప్రారంభమైంది. ఈ పరీక్షలు ఆగస్టు 23, 24 తేదీల్లో జరగనున్నాయి. ఇక లాసెట్ కోసం 39,866 మంది దరఖాస్తు చేసుకున్నట్లు కన్వీనర్ జీబీ రెడ్డి వెల్లడించారు. 3 ఏళ్ల పాటు ఉంటే లాసెట్‌కు 28,904 మంది.. 5 ఏళ్ల పాటు ఉండే లాసెట్‌కు 7,676 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. పీజీ లాసెట్ పరీక్షకు మొత్తం 3,286 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.
Also Read: AP IIIT Notification: ఏపీ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలివే..
పరీక్ష షెడ్యూల్ ఇదే..
టీఎస్ లాసెట్ మూడేళ్ల కోర్సు పరీక్ష ఆగస్టు 23వ తేదీన జరుగుతుంది. మొదటి సెషన్ ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు.. రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఉంటుంది. టీఎస్ లాసెట్ ఐదేళ్ల కోర్సు, టీఎస్ పీజీఎల్ సెట్ (ఎల్ఎల్ఎం) పరీక్షలు ఆగస్టు 24వ తేదీన నిర్వహిస్తారు. ఇవి ఉదయం 10.30 నుంచి మధ్యాహ్న 12 వరకు జరుగుతాయి.
ప్రిలిమనరీ 'కీ' 26న..
టీఎస్ లాసెట్, పీజీఎల్ సెట్ పరీక్షల ప్రిలిమనరీ 'కీ'ని ఆగస్టు 26వ తేదీన విడుదల చేయనున్నారు. 'కీ' మీద అభ్యంతరాలను ఆగస్టు 27వ తేదీ వరకు స్వీకరించనున్నారు. కాగా, లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (లాసెట్ ) పరీక్ష ద్వారా 3, 5 ఏళ్ల పాటు ఉండే ఎల్‌ఎల్‌బీ కోర్సులో ప్రవేశాలు పొందవచ్చు. ఇక పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీజీఎల్ సెట్) పరీక్ష ద్వారా రెండేళ్ల పాటు ఉండే ఎల్ఎల్ఎం కోర్సులో చేరవచ్చు.
Also Read: TS Eamcet counselling: 30 నుంచి టీఎస్ ఎంసెట్ కౌన్సెలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?