తెలంగాణలో ఎంసెట్‌ బైపీసీ కౌన్సెలింగ్‌లో భాగంగా బీఫార్మసీ, ఫార్మాడి తదితర సీట్ల భర్తీకి స్పాట్‌ ప్రవేశాల గడువును వారంపాటు పొడిగించారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం  ప్రవేశాల గడువు శనివారం(సెప్టెంబర్‌ 30)తో ముగియగా, దాన్ని అక్టోబరు 6 వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు.  


తెలంగాణలో ఎంసెట్‌లో బైపీసీ అభ్యర్థులకు మొదటి విడత సీట్లను సెప్టెంబరు 11న కేటాయించిన సంగతి తెలిసిందే. బీఫార్మసీలో 7,597 (97.52 శాతం), ఫార్మాడీలో 1,342 (99.92 శాతం) సీట్లను భర్తీ చేశారు. బయో మెడికల్, ఫార్మా స్యూటికల్ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీలో సీట్లను భర్తీ చేశారు  రాష్ట్ర వ్యాప్తంగా 80 కాలేజీల్లో సీట్లని మొదటి విడతలోనే భర్తీ చేశారు. ఇక రెండో విడత సీట్ల కేటాయింపును సెప్టెంబరు 22న నిర్వహించారు. ఆ తర్వాత స్పాట్ ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూలును వెల్లడించారు. 


స్పాట్ ప్రవేశాల షెడ్యూలు ఇలా..


* స్పాట్ ప్రవేశాలు-కాలేజీల ద్వారా నోటిఫికేషన్ జారీ: 27.09.2023.


* స్పాట్ ప్రవేశాల పేపర్ నోటిఫికేషన్: 27.09.2023.


* అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ: 28, 29.09.2023.


* స్పాట్ ప్రవేశాల కౌన్సెలింగ్: 30.09.2023.


ALSO READ:


ఎన్ఎంఎంఎస్ దరఖాస్తుకు అక్టోబరు 13 వరకు అవకాశం
ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభగల విద్యార్థుల కోసం నిర్దేశించిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్(ఎన్ఎంఎంఎస్) దరఖాస్తుకు అక్టోబరు 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు తెలిపారు. డిసెంబరు 10న జరిగే పరీక్షకు ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే అర్హులని, రెసిడెన్షియల్‌ విధానంలో చదువుతున్న వారికి అర్హత లేదని తెలిపారు. ఈసారి తొలిసారిగా ఎస్టీ రిజర్వేషన్‌ను 6 నుంచి 10 శాతానికి పెంచుతున్నామని వెల్లడించారు. దానివల్ల స్కాలర్‌షిప్‌నకు ఎంపికయ్యే ఎస్టీ అభ్యర్థుల సంఖ్య పెరుగుతుందన్నారు. దేశంలోని పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులకు ఆర్థిక చేయూత కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్ఎంఎంఎస్) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12,000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. 9వ తరగతి నుంచి ఇంటర్ పూర్తయ్యే వరకు వీరికి స్కాలర్‌షిప్ అందుతుంది.
స్కాలర్‌షిప్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌, ఈ ఏడాది నుంచే అమలు
తెలంగాణలోని ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలకు బోర్డు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్ సబ్జెక్టులోనూ ప్రాక్టికల్స్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటి వరకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులకు మాత్రమే ప్రాక్టికల్స్ ఉండేవి. కొత్త విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ అమలు చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. విద్యాసంవత్సరం చివరిలో ఇంగ్లిష్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షకు 20 మార్కులు కేటాయించనున్నారు. దీంతో ఇప్పటివరకు ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో ఇంగ్లిష్‌ థియరీ పరీక్షను గతంలో మాదిరిగా 100 మార్కులకు కాకుండా, 80 మార్కులకు నిర్వహించనున్నారు. థియరీలో మార్కులు తగ్గినందున ఆ సబ్జెక్టులో కొన్ని పాఠాలను తొలగిస్తూ సిలబస్‌ను తగ్గించారు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...