దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) యూజీ 2021 పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థులు కోరుతున్నారు. నీట్ యూజీ పరీక్షను వాయిదా వేయబోమన్న సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా విద్యార్థులు గళం విప్పారు. పరీక్షను వాయిదా వేసి, తమకు న్యాయం చేయాలని కోరుతూ.. ట్వీట్లు చేస్తున్నారు. వీరికి కాంగ్రెస్ పార్టీ సైతం మద్దతిస్తోంది.


విద్యార్థుల పోస్టులతో జస్టిస్ ఫర్ నీట్ యాస్పిరెంట్స్ (#JusticeForNEETAspirants) అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో మొదటి స్థానంలో ట్రెండ్ అవుతోంది. విద్యార్థులకు మద్దతిస్తూ.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ ట్వీట్ చేశారు. విద్యార్థుల భవిష్యత్ తో చెలగాటం తగదని అభిప్రాయపడ్డారు. నీట్ యూజీ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. 



రాహుల్ గాంధీ ట్వీట్..






కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ ట్వీట్






కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ట్వీట్






సుప్రీంకోర్టు ఏం చెప్పింది?


నీట్ యూజీ పరీక్ష ఈ నెల 12న జరగాల్సి ఉంది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్‌ కాలేజీలలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్షను వాయిదా వేయాలని పలువురు విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నీట్ యూజీ పరీక్ష జరిగే రోజునే ఇతర ముఖ్యమైన పరీక్షలు ఉండటంతో ఈ పరీక్షను వాయిదా చేయాలని సుప్రీంకోర్టును కోరారు. వీటిపై విచారణ జరిపిన ధర్మాసనం.. పరీక్షల రద్దు లేదా రీ షెడ్యూల్ చేయడం కుదరదని స్పష్టం చేసింది. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించలేమని జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. 


కేవలం ఒక్క శాతం మంది విద్యార్థులు మాత్రమే పరీక్ష వాయిదా వేయాలని కోరుతున్నారని.. వీరి కోసం మిగతా 99 శాతం మందికి అసౌకర్యం కల్పించలేమని తెలిపింది. ఒకటి కంటే ఎక్కువ పరీక్షలు ఒకే రోజు షెడ్యూల్ అయితే వాటిలో ఏది ముఖ్యమో అదే ఎంచుకోవాలని సూచించింది. బోర్డులు పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకుంటాయని, అందులో తాము జోక్యం చేసుకోవడం లేదని స్పష్టం చేసింది. 


Also Read: AP EAPCET Result 2021: రేపే ఈఏపీసెట్ ఫలితాలు.. 18 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్!


Also Read: Career Guidance: 2021లో డిమాండ్ ఉన్న 5 కోర్సులు ఇవే.. వీటిలో మీకేం కావాలో ఎంచుకోండి..