JEE Main Admit Card 2022 at jeemain.nta.nic.in : జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ (Joint Entrance Examination Main 2022) అడ్మిట్ కార్డులు నేడు విడుదల చేశారు. ప్రతి ఏడాది నాలుగు సెషన్లలో జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జూన్ 21న ఈ ఏడాది జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్ష హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) జేఈఈ మెయిన్ 2022 అడ్మిట్ కార్డులను విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. జేఈఈ మెయిన్ సెషన్ ఎగ్జామ్ జూన్ 23 నుంచి జూన్ 29 తేదీలలో దేశ వ్యాప్తంగా 501 నగరాలలో నిర్వహించనున్నారు. 


జేఈఈ మెయిన్ 2022
గతంలో ఏడాదికి ఒకటేసారి జేఈఈ మెయిన్ నిర్వహించే వారు. కానీ కరోనాతో పరిస్థితి మారిపోయింది. కేంద్ర ప్రభుత్వం అభ్యర్థులకు నాలుగు సెషన్లలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. దేశంలోని వివిధ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రేవేశాల కోసం నేషనల్‌ టెస్టింగ్ ఎజెన్సీ(NTA) నిర్వహించే జాయంట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్ మెయిన్‌ పరీక్ష కోసం లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ర్యాంక్ సాధించిన విద్యార్థులు దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, నిట్స్‌ లాంటి పేరున్న సంస్థల్లో ప్రవేశాలు పొందుతారు.


జేఈఈ మెయిన్ 2022 అడ్మిట్ కార్డ్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..



  • మొదటగా అధికారిక వెబ్‌సైట్‌ jeemain.nta.nic.inను సందర్శించండి

  • హోం పేజీలో జేఈఈ మెయిన్ 2022 సెషన్ 1 అడ్మిడ్ కార్డ్ డౌన్‌లోడ్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి

  • అభ్యర్థులు మీ మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ తో పాటు సెక్యూరిటీ పిన్‌ను నమోదు చేయాలి

  • జేఈఈ మెయిన్ 2022 హాల్ టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది

  • మీ అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. పరీక్షకు హాజరు కావాలంటే హాల్ టికెట్ కావాలి కనుక దాన్ని ప్రింటౌట్ తీసుకోవడం మరిచిపోవద్దు.


జేఈఈ మెయిన్ హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి  


హాల్ టికెట్ డౌన్‌లోడ్ కావడం లేదా.. 
ఈ పరీక్ష రెండు దశల్లో ఉంటుంది. జేఈఈ మెయిన్, జేఈఈ డ్వాన్స్‌డ్‌ ఉంటుంది. అయితే ఏదైనా అభ్యర్థి జేఈఈ మెయిన్ – 2022 సెషన్ 1 అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడంలో సమస్య వస్తే 011 - 40759000 నంబర్‌లో సంప్రదించాలి. లేకపోతే jeemain@nta.ac.in మెయిన్ ఐడీకి ఈమెయిల్ చేసి తమ సమస్యలను తెలపవచ్చు. ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్ ఫారమ్‌లు నింపిన అభ్యర్థుల అడ్మిట్ కార్డులను నిలిపివేశారు. జూన్ చివర్లో జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష జరిగే అవకాశం ఉంది.


Also Read: AP 10th Supplementary Exams: ఏపీ టెన్త్ ఫెయిల్ విద్యార్థులకు సర్కార్ ఊరట, ఫీజు చెల్లించకుండానే సప్లిమెంటరీ హాల్ టికెట్స్


Also Read: Viral News: 30 ఏళ్ల తరువాత ఎగ్జామ్ - టెన్త్ బోర్డ్ ఎగ్జామ్‌లో తండ్రి పాస్, కుమారుడు ఫెయిల్