JEE Mains Exam 2024: జేఈఈ మెయిన్-2024 మొదటి విడత పరీక్షకు సంబంధించి పేపర్-1 'ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ (Exam City Intimation Slip)'ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) జనవరి 18న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఇంటిమేషన్ స్లిప్‌ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సిటీ ఇంటిమేషన్ స్లిప్‌‌లో అభ్యర్థి పరీక్ష రాసే నగరం, పరీక్ష తేది వివరాలు ఉంటాయి. ఇప్పటికే పేపర్-2 ఇంటిమేషన్ స్లిప్స్‌ను ఎన్టీఏ విడుదల చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే మొదటి విడత పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదల కానున్నాయి. 


ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 24 నుంచి 31 వరకు జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో జనవరి 27, 29, 30, 31 తేదీల్లో పేపర్-1 పరీక్ష నిర్వహించనుండగా.. జనవరి 24న పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. జనవరి 19 నుంచి జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే 011-40759000/011-69227700 ఫోన్ నెంబర్లు లేదా ఈమెయిల్: jeemain@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చు.


Download Advance City Intimation Slip ..




దేశవ్యాప్తంగా జనవరి 24 నుంచి నిర్వహించనున్న జేఈఈ మెయిన్‌(JEE Main)-2024 తొలి విడత పరీక్షకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు అందాయి. దరఖాస్తు గడువు ముగిసే సమయానికి మొత్తం 12.30 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాదితో పోల్చితే ఈ సంఖ్య 3.70 లక్షలు అధికంగా ఉండటం విశేషం. ఈ సారి అత్యధిక దరఖాస్తుల్లో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక రెండు, మూడు స్థానాల్లో వరుసగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు నిలిచాయి. మహారాష్ట్ర నుంచి 1.60 లక్షల మంది, ఏపీ నుంచి 1.30 లక్షలు, తెలంగాణ నుంచి 1.20 లక్షల మంది పరీక్ష కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. జేఈఈ మెయిన్‌ ర్యాంకులతో ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో చేరొచ్చు. బీటెక్‌ సీట్ల కోసం మెయిన్‌లో పేపర్‌-1, బీఆర్క్‌, బీ ప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి పేపర్‌-2 రాయాల్సి ఉంటుంది.


దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీలు(IITs), ఎన్‌ఐటీలు(NITs), ట్రిపుల్‌ ఐటీలు (IIITs), కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజినీరింగ్‌ విద్యాసంస్థల్లో ప్రవేశాలకోసం నిర్వహించే జేఈఈ మెయిన్-2024 మొదటి విడత ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబరు 2న ప్రారంభమైన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి డిసెంబరు 4 వరకు దరఖాస్తులు స్వీకరించారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే 011-40759000/011-69227700 ఫోన్ నెంబర్లు లేదా ఈమెయిల్: jeemain@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చు. 


ఈ పరీక్షలను రెండు విడతలుగా నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో మొదటి సెషన్‌, ఏప్రిల్‌లో రెండో విడత పరీక్షలు నిర్వహించనున్నారు. ఆన్‌లైన్‌ విధానంలో జేఈఈ పరీక్షలు జరుగనున్నాయి. ఈ మేరకు జనవరి సెషన్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) నవంబరు 1న విడుదల చేసింది. తెలుగుతోపాటు ఇంగ్లిష్‌, హిందీ సహా మొత్తం 13 భాషల్లో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలను 2024 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 మధ్య నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 12న ఫలితాలను విడుదల చేస్తారు.


పరీక్ష విధానం..


➥పేపర్‌-1(బీటెక్, బీఈ) ఇలా..
బీఈ/బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ పేపర్‌ను మొత్తం మూడు సబ్జెక్ట్‌లలో రెండు సెక్షన్లుగా నిర్వహిస్తారు.  సెక్షన్‌-ఎ పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలతో(ఎంసీక్యూలతో) ఉంటుంది. సెక్షన్‌-బిలో న్యూమరికల్‌ వాల్యూ ఆధారిత ప్రశ్నలుంటాయి.సెక్షన్‌-బిలో 10 ప్రశ్నల్లో అయిదు ప్రశ్నలకు సమాధానం ఇస్తే సరిపోతుంది. 0.25 శాతం నెగెటివ్‌ మార్కింగ్‌ నిబంధన ఉంది.


➥ పేపర్‌-2(ఎ) బీఆర్క్‌ పరీక్ష..
నిట్‌లు,ట్రిపుల్‌ ఐటీలు,ఇతర ఇన్‌స్టిట్యూట్‌లలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులు రాయాల్సిన పరీక్ష ఇది. పేపర్‌-2ఎగా పిలిచే ఈ పరీక్షను కూడా మూడు విభాగాలుగా నిర్వహిస్తారు. మ్యాథమెటిక్స్‌ సబ్జెక్ట్‌ విభాగంలో ఎంసీక్యూల్లో ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయించారు. అదే విభాగంలో న్యూమరికల్‌ ప్రశ్నలలో పది ప్రశ్నలకుగాను అయిదు ప్రశ్నలు ఛాయిస్‌గా ఉంటాయి.  డ్రాయింగ్‌ టెస్ట్‌లో మాత్రం రెండు అంశాలను ఇచ్చి డ్రాయింగ్‌ వేయమంటారు. ఒక్కో టాపిక్‌కు 50 మార్కులు.


➥ పేపర్‌-2(బి)బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ పరీక్ష..
బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పేపర్‌-2బి మూడు విభాగాలుగా ఉంటుంది.  మ్యాథమెటిక్స్‌లోని న్యూమరికల్‌ వాల్యూ ఆధారిత ప్రశ్నల్లో అయిదు ప్రశ్నలు ఛాయిస్‌గా ఉంటాయి. మూడు పరీక్షలకు కేటాయించిన సమయం మూడు గంటలు.  బీఆర్క్, బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ రెండు పేపర్లకు మూడున్నర గంటలు పరీక్ష సమయం ఉంటుంది.