దేశ వ్యాప్తంగా ఉన్న లక్షలాది ఇంజనీరింగ్ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టైమ్ ఆసన్నమైంది. JEE అడ్వాన్స్‌డ్ 2026 పరీక్ష రాసిన అభ్యర్థులకు ఇది గుడ్‌న్యూస్. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) రూర్కీ మే 25న JEE అడ్వాన్స్‌డ్ 2026 ప్రైమరీ ఆన్సర్ కీని విడుదల చేసింది. ఇప్పుడు విద్యార్థులు తమ సమాధానాలను సరిపోల్చుకోవడం ద్వారా పరీక్షలో ఎన్ని మార్కులు వస్తాయో ఓ అంచనాకు రావొచ్చు. IITలో ప్రవేశం పొందే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో తెలుసుకోండి.

Continues below advertisement

పరీక్ష తర్వాత విద్యార్థులు ఆన్సర్ కీ కోసం చూస్తున్నారు. చాలా మంది అభ్యర్థులు సోషల్ మీడియా, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో కటాఫ్ మార్కులు, స్కోర్‌ల గురించి చెక్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో Answer Key విడుదలైన తర్వాత చాలా వరకు స్పష్టత వస్తుంది. ఇప్పుడు అభ్యర్థులు అధికారిక సమాధానాల ఆధారంగా తమ స్కోర్‌ను అంచనా వేసుకోవచ్చు. 

ముందుగా విద్యార్థులకు రెస్పాన్స్ షీట్ 

Continues below advertisement

IIT రూర్కీ మే 21న అభ్యర్థుల రెస్పాన్స్ షీట్‌ను విడుదల చేసింది. ఇందులో విద్యార్థులు ఇచ్చిన సమాధానాలు ఇందులో ఉన్నాయి. ఇప్పుడు సమాధానాల కీ వచ్చిన తర్వాత, విద్యార్థులు తమ రెస్పాన్స్ షీట్‌ను, అధికారిక సమాధానాలు సరిపోల్చుకోవాలి. ఆన్సర్ కీ విడుదలైన తర్వాత విద్యార్థులు మార్కులపై సరైన అవగాహనకు వస్తారని నిపుణులు చెబుతున్నారు. ఇది తదుపరి కౌన్సెలింగ్,  కాలేజీ ఎంపికలకు సిద్ధం కావడానికి వారికి సహాయపడుతుంది.

Also Read: CBSE New Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానం తప్పనిసరి.. దానివల్ల ఏం మార్పులు వస్తాయి

ఆన్సర్ కీలో ఏముంటుంది?

JEE అడ్వాన్స్‌డ్ సమాధానాల కీలో పరీక్షలోని 2 పేపర్లలో అడిగిన అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఉంటాయి. విద్యార్థులు తాము ఎంచుకున్న సమాధానాలను వీటితో చెక్ చేసుకోవచ్చు. ఒక ప్రశ్నకు సమాధానం సరిగ్గా ఉంటే, మార్కులు కలపవచ్చు, తప్పు సమాధానం అయితే నెగెటివ్ మార్కింగ్ ప్రకారం మార్కులు తగ్గించవచ్చు. ఈ విధంగా అభ్యర్థులు తమ స్కోర్‌ను అంచనా వేయాలి. అన్సర్ కీని ఎలా డౌన్‌లోడ్ చేయాలి

  • ముందుగా JEE అడ్వాన్స్‌డ్ అధికారిక వెబ్‌సైట్‌ సందర్శించండి.
  • హోం పేజీలో కనిపించే JEE అడ్వాన్స్‌డ్ ఆన్సర్ కీ 2026 లింక్‌ మీద క్లిక్ చేయండి.
  •  మీ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. 
  • మీ డీటైల్స్ నింపిన తర్వాత లాగిన్ అవ్వండి.
  • మీ స్క్రీన్‌పై సమాధానాల కీ PDF కనిపిస్తుంది.
  • PDFని డౌన్‌లోడ్ చేసి, మీ దగ్గర భద్రంగా ఉంచుకోండి.

Also Read: NEET UG 2026 Exam Date: జూన్ 21న నీట్ యూజీ 2026 రీఎగ్జామ్.. అధికారికంగా వెల్లడించిన ఎన్టీఏ

సమాధానాలు తప్పు అనిపిస్తే ఏం చేయాలి?

ఆన్సర్ కీ విడుదలైన వెంటనే, IIT రూర్కీ విద్యార్థులకు మరో ముఖ్యమైన సౌకర్యాన్ని అందించింది. ఏదైనా ప్రశ్నకు సమాధానం తప్పుగా ఇచ్చారని లేదా ఏదైనా లోపం ఉందని అభ్యర్థి భావిస్తే, అభ్యంతరం వ్యక్తం చేయవచ్చు. ఈ సౌకర్యం ఏదైనా సమాధానం గురించి అయోమయంలో ఉన్న విద్యార్థులకు ఊరట కలిగిస్తుంది. చాలాసార్లు నిపుణులు, విద్యార్థుల అభ్యంతరాల తర్వాత సమాధానాలలో మార్పులు కూడా చేయగా, ఇది ఫైనల్ రిజల్ట్ మీద ప్రభావం చూపుతుంది.

అభ్యంతరాలకు తుది గడువు 

IIT రూర్కీ ఆన్సర్ కీ ఛాలెంజ్ విండోను కూడా ఓపెన్ చేసింది. విద్యార్థులు మే 25 నుండి మే 26 వరకు ఆన్‌లైన్‌లో తమ అభ్యంతరాలను నమోదు చేసుకోవచ్చు. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత ఎలాంటి అభ్యంతరాలను స్వీకరించరని గుర్తుంచుకోవాలి. ఏదైనా సమాధానంపై అనుమానం ఉన్న విద్యార్థులు నిర్ణీత గడువులోపు అధికారిక పోర్టల్ ద్వారా తమ సవాలును నమోదు చేసుకోవాలి.