CBI Submit Chargesheet IDFC Fraud Case: చండీగఢ్: హర్యానా ప్రభుత్వానికి చెందిన రూ. 504 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణల కేసులో సీబీఐ (CBI) పంచకులలోని ప్రత్యేక సిబిఐ కోర్టులో తొలి ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఈ నిధుల దుర్వినియోగంలో బ్యాంక్ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, సామాన్యలు భాగస్వాములుగా ఉన్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 15 మంది నిందితులపై ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో హర్యానా ప్రభుత్వ ఉద్యోగులు, షెల్ కంపెనీలు, సామాన్యులు ఉన్నారని సీబీఐ తమ ఛార్జిషీటులో పేర్కొంది. నిందితులపై నేరపూరిత కుట్ర, నేరపూరిత నమ్మకద్రోహం, చీటింగ్, సంతకాలు ఫోర్జరీ, సాక్ష్యాలను తారుమారు చేయడం, అవినీతి నిరోధక చట్టం 1988 కింద నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చినట్లు సీబీఐ తెలిపింది. 

Continues below advertisement

 ఛార్జ్‌షీట్ ఎవరిపై దాఖలైంది?ఈ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు అయిన వారిలో ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ (IDFC First Bank), ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (AU Small Finance Bank) లకు చెందిన ఆరుగురు బ్యాంక్ అధికారులు, హర్యానా పవర్ జెనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, వికాస్ అండ్ పంచాయతీ డిపార్ట్‌మెంట్, హర్యానా స్కూల్ శిక్షా పరియోజన పరిషత్‌లకు చెందిన ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు నిందితులుగా ఉన్నారు. దర్యాప్తు సంస్థ సీబీఐ ఈ ఛార్జ్‌షీట్‌లో రెండు నకిలీ కంపెనీలు, వాటికి చెందిన ముగ్గురు భాగస్వాములు లేక డైరెక్టర్లు, ఒక సామాన్యుడి పేరును కూడా చేర్చింది.

Also Read: RBI Loan Recovery Guidelines 2026: అప్పు ఇచ్చారని అడ్డగోలుగా వసూలుకు ప్రయత్నిస్తే నేరమే - ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు ఇవిగో

Continues below advertisement

జుడీషియల్ కస్టడీలో నిందితులుమరోవైపు, నిందితులందరూ ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నట్లు సిబిఐ ఆ ప్రకటనలో తెలిపింది. దర్యాప్తు చేస్తున్న అధికారుల ప్రకారం, ఈ కేసు హర్యానా ప్రభుత్వానికి చెందిన పలు శాఖల బ్యాంక్ ఖాతాల నుండి రూ. 504 కోట్ల నిధులను కొల్లగొట్టారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులతో బ్యాంక్ అధికారులు నేరపూరిత కుట్ర ద్వారా ఈ నిధులను వేరే చోట్లకు మళ్లించారని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. హర్యానా రాష్ట్ర విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో కేసు నమోదు చేయడంతో ఈ కేసు మొదలైంది. ఆ తర్వాత ఈ కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించారు. కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న 15 మంది నిందితులపై ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న విచారణ పూర్తయిందని సిబిఐ తెలిపింది. అలాగే ఇతర నిందితులపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది. 

నేరం ఎలా జరిగింది? హర్యాణ ప్రభుత్వ శాఖల్లో కీలక పదవుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంక్ అధికారులతో చేతులు కలిపారు. ప్రభుత్వ విభాగాల అధికారిక బ్యాంక్ ఖాతాల్లో ఉండాల్సిన రూ. 504 కోట్ల నిధులను, నిబంధనలకు విరుద్ధంగా బ్యాంక్ అధికారుల సహాయంతో నకిలీ కంపెనీల ఖాతాల్లోకి మళ్లించారు. ఈ నిధులను విత్‌డ్రా చేయడానికి లేదా వైట్ మనీగా మార్చడానికి కొన్ని షెల్ (నకిలీ) కంపెనీలను ఉపయోగించారు.

Also Read: Post Office FD:రెండు లక్షలకు 47వేల రూపాయల వడ్డీ! పోస్టాఫీస్‌లోని ఈ పథకం గురించి తెలుసా?