న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కీలక నిర్ణయం తీసుకుంది. CBSE 9, 10 తరగతుల భాషా కోర్సులో పెద్ద మార్పులు చేసింది. ఈ రెండు తరగతుల విద్యార్థులకు త్రిభాషా విధానం తప్పనిసరి చేసింది. జులై 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. బోర్డు జాతీయ విద్యా విధానం 2020, జాతీయ పాఠ్యక్రమ ఫ్రేమ్‌వర్క్ 2023 కింద కొత్త భాషా విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త విధానం 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలులోకి వస్తుంది. CBSE విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం, 9వ తరగతి, 10 తరగతుల విద్యార్థులు ఇప్పుడు R1, R2, R3 రూపంలో మూడు భాషలను చదవాలి. ఈ 3 భాషలలో కనీసం రెండు భారత భాషలు తప్పనిసరి అని సీబీఎస్ఈ బోర్డు స్పష్టం చేసింది. ఈ నిబంధన జూలై 1, 2026 నుంచి అమలులోకి వస్తుంది. అయితే పదో తరగతి విద్యార్థులకు మూడో భాషపై బోర్డ్ ఎగ్జామ్ ఉండదని చెప్పి ఊరట కలిగించింది. విదేశీ భాషను ఎంచుకుంటే కొత్త నిబంధనలు కొత్త విధానం ప్రకారం, విద్యార్థులు విదేశీ భాషను ఎంచుకోవచ్చు, అయితే మిగిలిన 2 భాషలు భారతీయ భాషలు అయి ఉండాలి. అదనంగా, విదేశీ భాషను నాల్గవ భాషగా కూడా బోధించవచ్చు. విద్యార్థులు మాధ్యమిక పాఠశాల స్థాయిలో భారతీయ భాషలు, ఇంగ్లీష్‌తో పాటు జపనీస్, ఫ్రెంచ్, కొరియన్, జర్మన్, స్పానిష్ భాషలూ చదువుకోవచ్చని ఎన్‌ఈపీ-2020 పేర్కొంది. అధిక శాతం స్కూళ్లల్లో భాషా మాధ్యమంగా ఉన్న ఇంగ్లీష్‌ను విదేశీ భాషగా భావిస్తారు. ఈ భాషను ఎంచుకునే విద్యార్థులు 2 భారతీయ భాషలను సెలక్ట్ చేసుకోవాలి. Also Read: NEET UG 2026 Exam Date: జూన్ 21న నీట్ యూజీ 2026 రీఎగ్జామ్.. అధికారికంగా వెల్లడించిన ఎన్టీఏ
NEP 2020 ప్రకారం మార్పులు NCERT విడుదల చేసిన కొత్త సిలబస్, NEP 2020 సిఫార్సులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని బోర్డు స్పష్టం చేసింది. కొత్త విధానం విద్యార్థులలో భాషా నైపుణ్యాలను, భారత భాషలపై అవగాహనను పెంపొందించడానికి సహాయపడుతుందని CBSE భావిస్తోంది. పాఠశాలలకు కొత్త మార్గదర్శకాలు భాషా విద్యకు సంబంధించిన కొత్త సిలబస్, అభ్యాస లక్ష్యాలు, సామర్థ్యాలను సమీక్షించాలని CBSE అనుబంధ పాఠశాలలకు సూచించింది. భాషా అభ్యాసానికి సంబంధించిన అనేక నైపుణ్యాలు, అంటే చదవడం, వ్యాకరణం, రచన, మౌఖిక కమ్యూనికేషన్ ఇప్పటికే మాధ్యమిక స్థాయి సిలబస్‌తో సరిపోలుతున్నాయని బోర్డు తెలిపింది. ప్రస్తుతం 6వ తరగతి పుస్తకాలతో చదువు కొత్త R3 పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి వచ్చే వరకు 9, 10 తరగతుల విద్యార్థులు ఎంచుకున్న భాషను 6వ తరగతి R3 పుస్తకాలతో చదువుతారు. స్థానిక సాహిత్యం, కవితలు, కథలు, ఇతర విషయాలను కూడా చేర్చాలని స్కూల్స్2కు సూచించారు.
టీచర్ల కొరతను అధిగమించడానికి ప్రత్యేక ఏర్పాట్లు కొన్ని పాఠశాలల్లో భారత భాషలకు అర్హులైన ఉపాధ్యాయుల కొరత ఉండవచ్చని CBSE గుర్తించింది. ఈ క్రమంలో పాఠశాలలు తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవడానికి బోర్డు అనుమతించింది. దీని కింద స్కూల్స్ పరస్పర సహకారం, ఆన్‌లైన్ టీచింగ్, రిటైర్డ్ టీచర్ల సేవలు, అర్హులైన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులను నియమించుకోవచ్చు. 19 భాషల్లో బోర్డు పుస్తకాలు 19 షెడ్యూల్ చేసిన భారతీయ భాషలలో R3 పాఠ్యపుస్తకాలను జూలై 1, 2026 నాటికి పాఠశాలలకు అందజేస్తామని బోర్డు తెలిపింది. అదనపు బోధనా సామగ్రిని ఉపయోగించడంపై మార్గదర్శకాలు జూన్ 15, 2026 నాటికి విడుదల చేయనున్నారు.
