తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా ఆగస్టు 28న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2022 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఏడాది జేఈఈ పరీక్షల ప్రక్రియ ముగిసింది. దేశవ్యాప్తంగా ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో కలిపి 360 (180+180) మార్కులకు పరీక్ష జరిగింది. తెలంగాణలో 14, ఏపీలో 28 కేంద్రాల్లో కలిపి దాదాపు 25 వేల మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు అంచనా. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలకు సంబంధించి పేపర్-1, పేపర్-2 ప్రశ్నపత్రాలను ఆగస్టు 29న అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్షలకు సంబంధించిన ఆన్సర్ కీని సెప్టెంబరు 3న విడుదల చేయనున్నారు. అంతకు ముందే అంటే సెప్టెంబరు 1న అభ్యర్థుల రెస్పాన్సెస్ (సమాధాన పత్రాలను) అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. దీంతో ఆన్సర్ కీ సాయంతో అభ్యర్థులు మార్కులపై ఒక అంచనాకు వచ్చే వీలుంది.


 


JEE Advanced Question Papers: PAPER 1  and  PAPER 2


 


జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022 ప్రశ్నపత్రాల సరళి ఇలా...
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022  ప్రశ్నపత్రాల కూర్పుపై ఈ సారి మిశ్రమ స్పందన వస్తోంది. పేపర్-1 కఠినంగా ఉండగా.. పేపర్-2 సులభంగానే ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

భౌతికశాస్త్రం, గణితంలో ప్రశ్నలు మధ్యస్థంగా, రసాయనశాస్త్రంలో సులభంగా ఉన్నాయి.

మూడు సబ్జెక్టుల్లోనూ 20 శాతం ప్రశ్నలు కఠినంగా ఉన్నాయి. 

పేపర్ -1లో మూడు సెక్షన్లలో 54 ప్రశ్నలు వచ్చాయి. మొదటి సెక్షన్ లో నెగిటివ్  మార్కులు లేవు. రెండో సెక్షన్ లో ప్రతి రెండు తప్పులకు ఒక నెగిటివ్  మార్కు, మూడో సెక్షన్ లో ప్రతి తప్పునకు ఒక నెగిటివ్  మార్కు కేటాయించారు. 

పేపర్ -2లోనూ మూడు సెక్షన్లలో 54 ప్రశ్నలు ఉంటాయి. అయితే పేపర్ -1 కంటే ఎక్కువ నెగిటివ్  మార్కులు ఉండటంతో విద్యార్థులు ఆచితూచి జవాబులు ఎంచుకోవాల్సి వచ్చింది. దీంతో ఎక్కువ సమయం వృథా అయినట్లు విద్యార్థులు చెబుతున్నారు.

పేపర్ -1 కంటే పేపర్ -2 కొంచెం తేలికగా ఉంది. రెండింటిలోనూ సెక్షన్ -2 మంచి మార్కులు, ర్యాంకులు సాధించేందుకు కీలకం కానుంది. జనరల్  కేటగిరీ అభ్యర్థులకు 70-75 మధ్య కటాఫ్  మార్కులు ఉండే వీలుందని నిపుణుల అభిప్రాయం.

రెండు పేపర్లనూ విశ్లేషిస్తే రసాయనశాస్త్రం బాగా తెలిసిన విద్యార్థులకు ఎక్కువ ర్యాంకులు వచ్చే వీలుంది. గణితం బాగా చేసి ఉంటే టాప్  ర్యాంకులు 


 


Also Read: NEET Answer Key: నీట్ ఆన్సర్ కీ వచ్చేస్తోంది, ఫలితాలు ఎప్పుడంటే?



అర్హత మార్కులు ఇవే? 
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2022 పరీక్ష స్థాయి కష్టంగా ఉండటం వల్ల క్వాలిఫయింగ్‌ మార్కులు అదే రీతిలో ఉండే వీలుందని నిపుణులు అంటున్నారు. మొత్తం 360 మార్కులకు ప్రతి ప్రతి సబ్జెక్టులో 5 శాతం మార్కులతో ఓపెన్‌ కేటగిరీలో 60 మార్కులు తెచ్చుకుంటే అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించినట్టేనని చెబుతున్నారు. ఓబీసీ–నాన్‌ క్రీమీలేయర్‌ కేటగిరీలు ప్రతి సబ్జెక్టులో 4 శాతంతో 50 కనీస మార్కులు, ఎస్సీలు ప్రతి సబ్జెక్టులో 2 శాతంతో 25 కనీస మార్కులు సాధిస్తే ఐఐటీల్లో సీట్ల పోటీకి అర్హత పొందినట్టేనని విశ్లేషిస్తున్నారు. పేపర్‌ విధానం, విద్యార్థుల ఫీడ్‌బ్యాక్‌ ప్రకారం వచ్చే మార్కులకు ర్యాంకులను జేఈఈ అధ్యాపకులు లెక్కగట్టారు.  



ఆన్సర్ కీపై అభ్యంతరాలకు అవకాశం..
జేఈఈ అడ్వాన్స్‌డ్-2022 ఆన్సర్ కీని సెప్టెంబరు 3న విడుదల చేయనున్నారు. ఆ తర్వాత సెప్టెంబరు 3న ఉదయం 10 గంటల నుంచి సెప్టెంబరు 4న సాయంత్రం 5 గంటల వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. సెప్టెంబరు 11న ఫైనల్ కీని విడుదల చేస్తారు. 

ఫలితాలు ఎప్పుడంటే?
జేఈఈ అడ్వాన్స్‌డ్-2022 ఫైనల్ కీతోపాటు ఫలితాలను కూడా సెప్టెంబర్‌ 11న విడుదల చేయనున్నారు. సెప్టెంబరు 12 నుంచి జోసా కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలుకానుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ గత ఏడాదితో పోలిస్తే ఈసారి కాస్తా కష్టంగానే ఉన్నట్టు నిపుణులు, విద్యార్థులు తెలిపారు.



ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ షెడ్యూలు..

సెప్టెంబరు 11 నుంచి ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (AAT) కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభంకానుంది. 

సెప్టెంబరు 14న పరీక్ష నిర్వహించనున్నారు. 

AAT ఫలితాలను సెప్టెంబరు 17న విడుదల చేస్తారు.


 


Also Read: 


JoSAA 2022 Schedule: 'జోసా' కౌన్సెలింగ్ షెడ్యూలు వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే!
దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్దేశించిన జోసా(జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ) షెడ్యూలును ఐఐటీ బాంబే ప్రకటించింది. షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 12 నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన వారికి ఆగ‌స్టు 28న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలను సెప్టెంబరు 11న వెల్లడిస్తారు. ఆ మరుసటి రోజు నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభంకానుంది.
కౌన్సెలింగ్ పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..