జియో ఎయిర్‌ఫైబర్, జియో క్లౌడ్ పీసీ సర్వీసులను రిలయన్స్ ఇండస్ట్రీస్ 45వ వార్షిక సదస్సులో లాంచ్ చేసింది. వీటిలో జియో ఎయిర్ ఫైబర్ ద్వారా వినియోగదారులు ఎటువంటి వైర్లు లేకుండా జీబీల్లో స్పీడ్ పొందవచ్చు. జియో క్లౌడ్ పీసీ అనేది ఎటువంటి హార్డ్‌వేర్ ఎక్విప్‌మెంట్ అవసరం లేని ఒక క్లౌడ్ పీసీ సర్వీసు.
జియో తన 5జీ సేవలకు జియో ట్రూ 5జీ అని పేరు పెట్టింది. ఇప్పుడు జియో ఎయిర్‌ఫైబర్, జియో క్లౌడ్ పీసీ దానిపైనే పనిచేయనున్నాయి. రిలయన్స్ జియో చైర్మన్ ఆకాష్ అంబానీ కంపెనీ వార్షిక సదస్సులో జియో ఎయిర్ ఫైబర్, జియో క్లౌడ్ పీసీల గురించి వివరించారు.
జియో ఎయర్ ఫైబర్ అనేది ఒక హోం గేట్‌వే సర్వీసు. అంటే దీన్ని పవర్ సోర్స్‌కు కనెక్ట్ చేసి వైఫై హాట్‌స్పాట్ లాగా ఉపయోగించుకోవచ్చన్న మాట. ఇది జియో ట్రూ 5జీ ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్‌ను అందించనుంది. ఇక జియో క్లౌడ్ పీసీ అనేది ఒక వర్చువల్ పీసీలా పనిచేయనుంది. జియో ట్రూ 5జీ కనెక్టివిటీ ద్వారానే దీన్ని కూడా ఉపయోగించవచ్చు. ఎటువంటి హార్డ్‌వేర్ రిక్వైర్‌మెంట్స్ లేకుండానే ఈ డివైస్‌ను వాడుకోవచ్చు. మల్టీపుల్ పీసీలను, యూజర్లను కనెక్ట్ చేయడానికి కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఇది ఫిజికల్ ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లను రీప్లేస్ చేయనుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఓటీటీ రంగంలో రిలయన్స్‌కు ఉన్న ప్లాన్లను ముకేశ్ అంబానీ ఈ సమావేశంలో తెలిపారు. ఐదేళ్ల పాటు ఐపీఎల్ ప్రసార హక్కులను రిలయన్స్ దక్కించుకుందని పేర్కొన్నారు. మూవీ రైట్స్, ఓటీటీ రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నామన్నారు. ప్రస్తుతం రిలయన్స్ గ్రూపునకు చెందిన వయాకాం18 సంస్థ వూట్ ఓటీటీ సర్వీసులను కూడా గతంలోనే ప్రారంభించింది. హిందీ బిగ్‌బాస్, కన్నడ బిగ్‌బాస్‌లు ఈ ఓటీటీలోనే
స్ట్రీమ్ అవుతాయి. ఇటీవలే ఐపీఎల్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను కూడా ఐదేళ్ల పాటు రిలయన్స్ గ్రూపు దక్కించుకుంది.
ప్రస్తుతం వూట్ యాప్ క్వాలిటీ ఆకట్టుకునే స్థాయిలో లేదు. దీనికి తోడు జియోకు ప్రత్యేకంగా జియో సినిమా అనే ప్రత్యేకమైన ఓటీటీ సర్వీసు కూడా ఉంది. మరి వీటన్నిటినీ కలిపి ఒకే ఓటీటీగా రూపొందిస్తారా? లేకపోతే మరో కొత్త ఓటీటీ సర్వీసును ప్రారంభిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.
Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!
Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!