ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల పరీక్ష హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఓయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ది ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ నగేశ్‌ ఆగస్టు 29న ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని పీజీ కోర్సుల రెండు, నాలుగో సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షలను సెప్టెంబరు 2 నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్లను ఓయూ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చూసుకోవాలని ఆయన సూచించారు. హాల్‌టికెట్లలో ఏమైనా మార్పులు ఉంటే పరీక్షకు ముందురోజే మార్చుకోవాలని నగేశ్‌ పేర్కొన్నారు.

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల పరీక్షా తేదీలను అధికారులు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్షల షెడ్యూలను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు వెబ్‌సైట్ ద్వారా పరీక్ష తేదీలను తెలుసుకోవచ్చు. హాల్‌టికెట్‌లో పరీక్ష తేదీతో పాటు.. పరీక్ష సమయం, పరీక్ష కేంద్రం వివరాలు తెలుసుకోవచ్చు. 

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఎంఏ, ఎంకామ్‌, ఎంకామ్‌ (ఐఎస్‌), ఎంఎస్‌డబ్ల్యూ, ఎమ్మెస్సీ, ఎంలిబ్‌ఐఎస్సీ, ఎంజేఅండ్‌ఎంసీ కోర్సుల రెండు, నాలుగో సెమిస్టర్‌ రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌, ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలను సెప్టెంబరు 2 నుంచి నిర్వహించనున్నారు. అలాగే ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ) రెండు, నాలుగో సెమిస్టర్‌ రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌, ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలను సెప్టెంబరు 7 నుంచి నిర్వహించనున్నారు.


హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..



పరీక్షల షెడ్యూలు కోసం క్లిక్ చేయండి...



వాస్తవానికి అన్ని పీజీ కోర్సుల రెండు, నాలుగో సెమిస్టర్‌ పరీక్షలను ఆగస్టు 22 నుంచి నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, వివిధ కారణాల రీత్యా పరీక్షలను వాయిదా వేశారు. సెప్టెంబరు 2 నుంచి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. 

వాయిదాకు కారణమిదేనా?
ఆర్ఆర్ బీ, కానిస్టేబుల్ పరీక్షల సమయంలో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళన చేశారు. ఎంతో కాలంగా ఉద్యోగ అవకాశాలు లేక కష్టపడ్డామని.. తీరా ఇప్పుడు అవకాశాలు ముంగిటకు వచ్చాక సెమిస్టర్ పరీక్షలు పెడితే ఎలా అని విద్యార్థులు ప్రశ్నించారు. తమ ఉద్యోగ అవకాశాలను కాలరాసే విధంగా సెమిస్టర్ పరీక్షలను నిర్వహించవద్దని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. విద్యార్థుల ఆందోళనలను పరిగణలోకి తీసుకున్న ఓయూ అధికారులు సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 


 


Also Read


BRAOU: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్
తెలంగాణ స్టేట్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వహించే పోటీ ప‌రీక్షల‌కు ఉప‌యోగ‌ప‌డే పుస్తకాల‌ను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివ‌ర్సిటీ అందుబాటులోకి తెచ్చింది. ఈ పుస్తకాల‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర ఐటీ-ప‌రిశ్రమ‌ల శాఖ‌ల మంత్రి కేటీఆర్ ఆగస్టు 27న విడుద‌ల చేశారు. మొత్తం నాలుగు రకాల పుస్తకాల‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తం 125 మంది ప్రొఫెసర్లు ఈ పుస్తకాలను రూపొందించడంలో అహర్నిశలు పనిచేశారు. ఈ పుస్తకాలు పోటీ ప‌రీక్షల‌కు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటాయ‌ని యూనివ‌ర్సిటీ అధికారులు వెల్లడించారు. ఈ పుస్తకాలు త్వరలోనే మార్కెట్‌లో అందుబాటులో ఉండ‌నున్నాయి. 
పుస్తకాలు ఇవే.. 
* భార‌త‌దేశ చ‌రిత్ర–సంస్కృతి, 
* భార‌తీయ స‌మాజం–రాజ్యాంగం, ప‌రిపాల‌న‌ 
* ఆర్థిక వ్యవ‌స్థ–అభివృద్ధి, 
* తెలంగాణ ఉద్యమం–రాష్ట్ర అవ‌త‌ర‌ణ 


 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..