Inter Supplementary Dates : ఇంటర్ ఫెయిలైన విద్యార్థులు.. పాసైన విద్యార్థులు కూడా రీవెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులకు రీకౌంటింగ్, రీఫెరిఫికేషన్, సప్లిమెంటరీ షెడ్యూల్ ప్రకటించింది ఏపీ ఇంటర్ బోర్డు. జూన్ 25 నుంచి జూలై 5 వరకు దరఖాస్తు చేయొచ్చు. సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టులో జరుగుతాయి. 2022 ఆగస్ట్ 3 నుంచి 2022 ఆగస్ట్ 12 వరకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరుగుతాయి. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు రెండు సెషన్స్‌లో జరుగుతాయి. ప్రాక్టికల్ పరీక్షలు 2022 ఆగస్ట్ 17 నుంచి ఆగస్ట్ 22 మధ్య జరుగుతాయి. సప్లిమెంటరీ పరీక్షకు 2022 జూలై 8 లోగా అప్లై చేయాలి.
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స, రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
పరీక్షా ఫలితాల్లో గతం కంటే ఈసారి బాగా ఉత్తీర్ణత శాతం తగ్గింది. ఫస్టియర్‌లో 2,41,599 మంది ఉత్తీర్ణత సాధించగా.. సెకండియర్‌లో 2,58,449 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్, సెకండియర్ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ప్రథమ సంవత్సరంలో 54 శాతం.. ద్వితీయ సంవత్సరంలో 61 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరంలో బాలురు 49 శాతం.. బాలికలు 65 శాతం ఉత్తీర్ణత పొందారు. ద్వితీయ సంవత్సరంలో బాలురు 59 శాతం.. బాలికలు 68 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణతలో ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్‌లో నిలువగా.. చివర్లో ఉమ్మడి కడప జిల్లా నిలిచింది.
ఏపీ ఇంటర్ విద్యార్థులు ఫలితాలు Step బై Step ఇలా ఈజీగా చెక్ చేసుకోండి
ఫలితాలనుhttps://examresults.ap.nic.in www.bie.ap.gov.in వెబ్‌సైట్లలో చూసుకోవచ్చని విద్యాశాఖ పేర్కొంది. మే 6 నుంచి జూన్ 28 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,69,059 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఓకేషనల్‌లో 79 వేల 22 మంది పరీక్ష రాశారు.
గత కొన్నేళ్లుగా ఇంటర్ విద్యార్థుల పాస్ పర్సంటేజీ ఈ కింది విధంగా ఉంది.
ఏడాది- ఫస్ట్ - సెకండ్ ఇయర్
2017 - 64 73
2018 62 69
2019- 60 68
2020- 59 59
2021- 100 100 ( కరోనా కారణంగా ఆల్ పాస్ )
2022 -54 61
మొత్తంగా పాస్ పర్సంటేజీ బాగుందని బొత్స సత్యనారాణ తెలిపారు. మాల్ ప్రాక్టీస్‌ను ప్రోత్సహిస్తే ఇంకా ఎక్కువ ఫలితాలు వచ్చి ఉండేవన్నారు. అలాంటి పనులు చేయబోమన్నారు.