AP Inter Results 2022 at bie.ap.gov.in: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మధ్యాహ్నం 12:30 గంట‌ల‌కు ఫలితాలు విడుదల చేశారు. ఏపీ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు రెగ్యూలర్ ఫలితాలతో పాటు ఒకేషనల్ ఫలితాలను ఏపీ ఇంటర్ బోర్డ్ విడుదల చేసింది. ఇటీవల విడుదలైన టెన్త్ ఫలితాల పరిస్థితులతో ఇంటర్ రిజల్ట్స్ విషయంలో ఏపీ సర్కార్ జాగ్రత్త తీసుకుంది. విద్యార్థులు తమ ఫలితాలను https://bie.ap.gov.in/  వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవాలని విద్యాశాఖ మంత్రి బొత్స సూచించారు.


ఇంటర్ ప్రథమ సంవత్సరంలో బాలురు 49 శాతం, బాలికలు 60శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో బాలురు 56 శాతం, బాలికలు 68 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్‌ ఇయర్‌  4,45,604 రాస్తే 2,41,591 మంది అంటే 54 శాతం ఉత్తీర్ణులయ్యారు. 4,23,455 మంది రాస్తే... 2,58,446 మంది పాస్‌ అయ్యారు. అత్యధికంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 72 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అత్యల్పంగా ఉమ్మడి కడప జిల్లాలో 50 శాతం మంది పాస్ అయినట్లు మంత్రి బొత్స వెల్లడించారు.


పరీక్షలు రాసిన నెల రోజుల్లో ఫలితాలు..
ఏపీలో ఇంటర్ పరీక్షలు 6వ తేదీ నుంచి ఫస్టియర్, 7వ తేదీ నుంచి సెకండియర్‌ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించారు. ఏపీ ఇంటర్‌ బోర్డు పటిష్ట ఏర్పాట్లతో మే 24వ తేదీ వరకు ఏపీ ఇంటర్ పరీక్షలను పూర్తి చేసింది. ఆపై ఇంట‌ర్ జవాబు పత్రాల మూల్యాంకనం వేగంగా చేశారు. ఏపీలో మొత్తం 1,456 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజ‌ర‌య్యారు. ఏపీ ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://bie.ap.gov.in/ లో ఫలితాలు విడుదల అయ్యాక విద్యార్థులకు డిజిటల్ స్కోర్ కార్డ్స్ అందిస్తారు.


Also Read: AP Intermediate Results 2022: ఏపీ ఇంటర్ విద్యార్థులు ఫలితాలు Step బై Step ఇలా ఈజీగా చెక్ చేసుకోండి 


ఏపీ ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
https://telugu.abplive.com/exam-results/ap-board-result-62b2b1aa8d556.html/amp


ఏపీ ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్ 
https://telugu.abplive.com/exam-results/ap-inter-results-11-62b2b6cc2734e.html/amp


ఏపీ ఇంటర్ సెకండియర్ రిజల్ట్స్ 
https://telugu.abplive.com/exam-results/ap-inter-results-12-62b2b7e4abc44.html/amp


ఏపీ ఇంటర్ ఫస్టియర్ ఒకేషనల్ రిజల్ట్స్ 
https://telugu.abplive.com/exam-results/ap-intermediate-first-year-vocational-result-62b2b8e1b5a02.html/amp


ఏపీ ఇంటర్ సెకండియర్ ఒకేషనల్ రిజల్ట్స్ 
https://telugu.abplive.com/exam-results/ap-inter-2nd-year-vocational-result-62b2b9fd5344a.html/amp


ఏపీ ఇంటర్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి 
Step 1: ఏపీ ఇంటర్ విద్యార్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్   https://bie.ap.gov.in/ సందర్శించండి
Step 2: హోం పేజీలో ఏపీ ఇంటర్ ఫలితాలు 2022 లింక్ (Andhra Pradesh Inter Results 2022 link) మీద క్లిక్ చేయండి
Step 3: హాల్ టికెట్ నెంబర్ (రిజిస్ట్రేషన్ నెంబర్), పుట్టిన తేదీ లాంటి వివరాలు నమోదు చేయాలి
Step 4: విద్యార్థుల ఫలితాలు మీ స్క్రీన్ మీద కనిపిస్తాయి
Step 5: రిజల్ట్స్‌ను విద్యార్థులు పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోండి
Step 6: ఇంజినీరింగ్, మెడిసిన్, డిగ్రీల ప్రవేశాలు లాంటి భవిష్యత్ అవసరాల కోసం మీ ఫలితాలను ప్రింటౌట్ తీసుకోవడం మంచిది


Also Read: AP Inter Results 2022 : నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల, మధ్యాహ్నం నుంచి రిజల్ట్స్ చెక్ చేసుకోండి