ICSE Class 10 Result : ఐసీఎస్‌ఈ (ICSE) పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను ఆదివారం సాయంత్రం కౌన్సిల్‌ ఫర్‌ ద ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌ ఎగ్సామినేషన్స్‌ (CISCE) విడుదల చేసింది.  ఐసీఎస్‌ఈ ఫలితాల్లో మొత్తంగా 99.97శాతం ఉత్తీర్ణత నమోదు అయిందని తెలిపింది. నలుగురు విద్యార్థులు 99.8 శాతం స్కోరుతో టాప్‌ ర్యాంకులు సాధించారని సీఐఎస్‌సీఈ ప్రకటించింది. హర్‌గుణ్‌ కౌర్‌ మథరు (పుణె), అనికా గుప్తా (కాన్పూర్‌) పుష్కర్‌ త్రిపాఠి (బలరాంపూర్‌), కనిష్క మిత్తల్‌ (లఖ్‌నవ్) టార్ ర్యాంకులు సాధించారని తెలిపింది.  






ఎస్ఎమ్ఎస్ ద్వారా 


34 మంది విద్యార్థులు 99.6 శాతం స్కోరుతో సెకండ్‌ ర్యాంకులు సాధించారని ఐసీఎస్ఈ తెలిపింది.  మరో 72 మంది 99.4 శాతం స్కోరుతో థర్డ్‌ ర్యాంకుల్లో నిలిచినట్లు వెల్లడించింది. ఈ ఫలితాల్లో బాలికల ఉత్తీర్ణతా శాతం 99.98 శాతం కాగా, బాలుర ఉత్తీర్ణతా శాతం 99.97గా ఉంది. ఫలితాలను cisce.org వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. మీ మొబైల్‌ నుంచి ICSE Unique Id> ఎంటర్‌ చేసి 09248082883 నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ పంపి రిజెల్ట్స్ పొందొచ్చని అధికారులు వెల్లడించారు. 


రెండు సెమిస్టర్లకు సమాన వెయిటేజీ 


ఫైనల్ స్కోర్‌లో రెండు సెమిస్టర్‌లకు సమాన వెయిటేజీ ఇస్తామని బోర్డు కార్యదర్శి గెర్రీ అరథూన్ చెప్పారు. సెమిస్టర్ 1 లేదా 2 పరీక్షలకు హాజరుకాని అభ్యర్థులను గైర్హాజరీగా గుర్తిస్తామన్నారు. వారి ఫలితాలు ప్రకటించమని ఆయన తెలిపారు. ఈ ఫలితాలు CISCE వెబ్‌సైట్‌లో CAREERS పోర్టల్‌లో , SMS ద్వారా అందుబాటులో ఉంచుతామని తెలిపారు. CISCE, ICSE బోర్డు ఏప్రిల్ 25 నుంచి మే 23 వరకు సెమిస్టర్ 2 పరీక్షలను నిర్వహించింది.


స్కోర్‌కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడం ఎలా :



  • www.cisce.orgలో CISCE అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి

  • హోమ్‌పేజీలో ICSE 10వ తరగతి ఫలితాలు 2022 లింక్‌పై క్లిక్ చేయండి 

  • గుర్తింపు సంఖ్య, పుట్టిన తేదీ వంటి లాగిన్ వివరాలు నమోదు చేయండి

  • సబ్మిట్ పై క్లిక్ చేయండి. మీ ICSE క్లాస్ 10 మార్క్‌షీట్ స్క్రీన్‌పై డిస్ ప్లే అవుతుంది.  

  • రిజెల్ట్స్ డౌన్‌లోడ్ చేసుకోండి. భవిష్యత్తు  అవసరం కోసం  ప్రింట్‌అవుట్ తీసుకోండి.