చైనాకు చెందిన స్మార్ట్ టీవీ బ్రాండ్ కూకా మనదేశంలో కొత్త గూగుల్ టీవీలను లాంచ్ చేసింది. 43 అంగుళాల, 55 అంగుళాల వేరియంట్లలో ఈ టీవీలు లాంచ్ అయ్యాయి. అమెజాన్‌లో వీటి ధర రూ.29,999 నుంచి ప్రారంభం కానుంది.
ఈ కూకా గూగుల్ టీవీల్లో 4కే హెచ్‌డీఆర్, డాల్బీ ఆడియో, స్వయోట్ హోం, గూగుల్ డ్యూయో సపోర్టెడ్, గూగుల్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంటే మీ టీవీని కేవలం వాయిస్ కమాండ్స్‌తోనే ఉపయోగించే అవకాశం ఉందన్న మాట.
ఇక కనెక్టివిటీ ఫీచర్ల విషయానికి వస్తే... ఇందులో మూడు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు, ఒక ఐఆర్ పోర్టు ఉన్నాయి. వీటి ద్వారా సెట్ టాప్ బాక్సులు, గేమింగ్ కన్సోల్స్, బ్లూరే ప్లేయర్లు, హార్డ్ డిస్క్‌లు, డీవీడీ ప్లేయర్లను కనెక్ట్ చేసుకోవచ్చు.
ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, జీ5, సోనీ లివ్ సహా చాలా ఓటీటీ యాప్స్‌ను ఈ టీవీ సపోర్ట్ చేయనుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ ఫీచర్లను కూడా ఇందులో అందించారు. లేటెస్ట్ ఎక్స్‌ట్రీమ్ 2.0 లార్జ్ ఇమేజ్ ఇంజిన్ ఫీచర్ ఉంది. ఇది ఇమేజ్ డిటైల్స్‌ను పర్‌ఫెక్ట్‌గా రీస్టోర్ చేయనుంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!