ఇన్‌ఫీనిక్స్ మనదేశంలో కొత్త స్మార్ట్ టీవీ లాంచ్ చేసింది. అదే ఇన్‌ఫీనిక్స్ 32వై1. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ టీవీ పనిచేయనుంది. పేరులో ఉన్నట్లు ఈ టీవీలో 32 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. ఇన్‌ఫీనిక్స్ ఆండ్రాయిడ్ ఎక్స్3 సిరీస్‌ ఇటీవలే 32, 43 అంగుళాల వేరియంట్లలో లాంచ్ అయింది.


ఇన్‌ఫీనిక్స్ 32వై1 స్మార్ట్ టీవీ ధర
ఈ టీవీ ధరను రూ.8,999గా నిర్ణయించారు. ఫ్లిప్‌కార్ట్‌లో జులై 18వ తేదీన దీని సేల్ జరగనుంది. బ్లాక్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే ఈ టీవీ అందుబాటులో ఉండనుంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం తగ్గింపు లభించనుంది. అంటే రూ.8,100కే ఈ టీవీ కొనేయచ్చన్న మాట.


ఇన్‌ఫీనిక్స్ 32వై1 స్మార్ట్ టీవీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఈ టీవీలో 32 ఇంచుల డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1366 x 768 పిక్సెల్స్‌గానూ, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గానూ ఉంది. బెజెల్ లెస్ ఫ్రేమ్, సన్నటి డిజైన్‌తో ఈ టీవీ లాంచ్ అయింది. దీంతోపాటు దీని పీక్ బ్రైట్‌నెస్ 250 నిట్స్‌గా ఉంది. డిమ్మింగ్, బ్రైట్‌నెస్ అడ్జస్ట్ చేసుకునే ఫీచర్ కూడా అందించారు.


512 ఎంబీ ర్యామ్, 4 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌పై ఈ టీవీ పనిచేయనుంది. డాల్బీ ఆడియో ఫీచర్‌ను ఇన్‌ఫీనిక్స్ 32వై1లో కంపెనీ అందించడం విశేషం. 20W స్పీకర్ సెటప్ ఈ టీవీలో ఉంది. రిచ్, క్లియర్, సినిమాటిక్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఈ స్మార్ట్ టీవీ అందించనుందని కంపెనీ తెలిపింది.


యూట్యూబ్, ప్రైమ్ వీడియో, జీ5, ఆజ్‌తక్, సోనీ లివ్, ఎరోస్ నౌ, హంగామా, ప్లెక్స్, యప్‌టీవీ యాప్‌లు ఈ టీవీలో ఇన్‌బిల్ట్‌గా రానున్నాయి. దీని రిమోట్‌లో యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్ వీడియోలకు ప్రత్యేకమైన బటన్లు ఉన్నాయి. క్రోమ్‌కాస్ట్‌ను కూడా ఇందులో అందించారు. వైఫై, మూడు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు, ల్యాన్, ఆప్టికల్, మిరాకాస్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!