మనదేశంలో టీవీలు కొనేవారి అభిరుచులు రోజురోజుకూ మారుతున్నాయి. ఇంట్లోనే థియేటర్ తరహా అనుభవాన్ని కోరుకుంటున్నారు. దీంతో హైసెన్స్ మనదేశంలో కొత్త స్మార్ట్ టీవీ లాంచ్ చేసింది. ఇందులో ఏకంగా 120 ఇంచుల 4కే లేజర్ స్క్రీన్‌ను అందించారు. ఈ టీవీకి హైసెన్స్ 120L9G అని పేరు పెట్టారు.
హైసెన్స్ 120 ఇంచుల 4కే స్మార్ట్ లేజర్ టీవీ ధర
ఈ టీవీ ధరను రూ.4,99,999గా నిర్ణయించారు. ప్రస్తుతానికి ఈ టీవీ ఆన్‌లైన్‌లో లిస్ట్ అవ్వలేదు. కంపెనీ అధికారిక వెబ్ సైట్లో ఈ టీవీ లిస్ట్ అయింది. అయితే ప్రస్తుతానికి ‘Buy Now’ ఆప్షన్ కూడా అక్కడ కనిపించలేదు.
హైసెన్స్ 120 ఇంచుల 4కే స్మార్ట్ లేజర్ టీవీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ప్రపంచంలోనే ట్రిపుల్ కలర్ లేజర్ టెక్నాలజీతో లాంచ్ అయిన మొదటి టీవీ ఇదే అని కంపెనీ అంటోంది. ప్యూర్ రెడ్, గ్రీన్, బ్లూ లేజర్స్ ద్వారా కలర్ పెర్ఫార్మెన్స్ కొత్త స్థాయికి చేరనుంది. హెచ్‌డీఆర్ సపోర్ట్ కూడా ఈ టీవీలో ఉంది.
హైసెన్స్ ప్రపంచవ్యాప్తంగా 160 దేశాల్లో టీవీలను విక్రయిస్తుంది. సౌతాఫ్రికా, స్లొవేనియా, సెర్బియా లాంటి దేశాల్లో కూడా హైసెన్స్‌కు మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీలు ఉన్నాయి. దీంతోపాటు ప్రపంచవ్యాప్తంగా 18 రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ హబ్స్ కూడా హైసెన్స్‌కు ఉన్నాయి.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!