Popular Earning Tips: పాకెట్ మనీ.. చాలా మంది స్టూడెంట్స్ కు అదో భరోసా. చిన్న చిన్న అవసరాలు తీర్చుకోవడానికి పాకెట్ మనీ ఉండాల్సిందే. ఫ్రెండ్స్ తో కలిసి చాయ్ తాగాలన్నా, అలా బైక్ పై షికారుకు వెళ్లాలన్నా, కలిసి బిర్యానీ తిన్నాలన్నా.. బీర్ తాగాలన్నా పాకెట్ మనీ కంపల్సరీ. పేరెంట్స్ ఇచ్చే పాకెట్ మనీ చాలా మంది యువతకు ఏమాత్రం సరిపోదు. కాలేజీ ఫీజులు, పరీక్ష ఫీజులు, బుక్కులు, పెన్నులు, రికార్డులు, ఎక్విప్‌మెంట్లు, ల్యాప్‌టాప్‌లు అబ్బో.. ఈ లిస్టు చాలా పెద్దదే. వాటన్నింటికి పేరెంట్స్ వద్ద డబ్బులు తీసుకుని, పాకెట్ మనీ కూడా తీసుకుని ఇంకా కావాలని అడగాలంటే చాలా మందికి అదోలా ఉంటుంది. అలాంటి స్టూడెంట్లు చదువుకుంటూనే చిన్న చిన్న పనులు చేస్తూ తమ అవసరాలకు కావాల్సినంత సంపాదించుకునేందుకు చాలానే మార్గాలు ఉన్నాయి. ఏ తప్పూ చేయాల్సిన అవసరం లేకుండా మనకు వచ్చిన పనితోనే డబ్బులు సంపాదించుకోవచ్చు. వాటిని పాకెట్ మనీగా వాడుకోవడంతో పాటు పేరెంట్స్ పై ఫీజుల భారం తగ్గించేందుకు కూడా సహాయపడవచ్చు. అలాంటి ఓ టాప్ 10 స్కిల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


1. డిజిటల్ మార్కెటింగ్


ఇప్పుడునున్న ఆన్‌లైన్‌ యుగంలో డిజిటల్ మార్కెటింగ్ ఎంతో ప్రాధాన్యత ఉంది. తమ ఉత్పత్తులను, సేవలను ఆన్ లైన్ లో మార్కెటింగ్ కల్పించుకుంటాయి సంస్థలు. సోషల్ మీడియాలో ఆయా ఉత్పత్తులకు ప్రచారం కల్పించడమే పని.


2. సోషల్ మీడియా మార్కెటింగ్


ఈ మధ్యకాలంలో ప్రతి సంస్థకు సోషల్ మీడియా అకౌంట్లు ఉంటున్నాయి. ఆయా ఖాతాల్లో సంస్థలు తమ గురించి మార్కెటింగ్ చేసుకుంటాయి. ఆయా సంస్థల ఉత్పత్తులు, సేవల గురించి చెబుతూ మార్కెటింగ్ చేసుకుంటాయి. ఇందుకోసం పోస్టర్లు, షార్ట్ వీడియోలు, రీల్స్ లాంటివి క్రియేట్ చేస్తాయి. వాటిని సోషల్ మీడియాలో మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది. 


3. కంటెంట్ రైటింగ్


కంటెంట్ రైటింగ్ అనేది ఏదైనా విషయం గురించి కూలంకషంగా వివరించి, సరళమైన పదాలతో ఆకట్టుకునే హెడ్డింగ్స్ తో కథనాలు తీర్చిదిద్దగలగడం. ట్రెండింగ్ లో ఉన్న టాపిక్స్ పై ఆర్టికల్స్ రాయాల్సి ఉంటుంది. 


4. వెబ్ డిజైన్


ఈ మధ్య చిన్న చిన్న సంస్థలకు కూడా వెబ్ సైట్లు ఉంటున్నాయి. వెబ్ డిజైనర్లకు బయట చాలా డిమాండ్ కూడా ఉంది. అభిరుచులు, అవసరాలకు తగ్గట్లుగా వెబ్ సైట్ డిజైన్ చేసి ఇవ్వాలి.


5. అఫిలియేట్ మార్కెటింగ్


వివిధ సంస్థలకు చెందిన ఉత్పత్తుల గురించి మార్కెటింగ్ చేసి మన నుంచి వినియోగదారులను వారి వద్దకు వెళ్లేలా చేయడమే అఫిలియేట్ మార్కెటింగ్. ఇతరులతో మార్కెటింగ్ చేయించి దాని వల్ల అయ్యే సేల్స్ పై కమీషన్ ఇస్తారు.


6. కాపీ రైటింగ్


ఇంటర్‌నెట్‌ లో ఎంతో సమాచారం ఉంటుంది. కానీ మనకు అవసరమయ్యే సమాచారం కొంత ఒక దగ్గర, ఇంకొంత మరో దగ్గర, మరికొంత ఇంకో దగ్గర ఉంటుంది. ఈ సమాచారాన్ని అంతా క్రోడీకరించి ఒక దగ్గర పేర్చి ఆకట్టుకునేలా రాయగలగడానికి ఎంతో నైపుణ్యం కావాలి. అదే కాపీ రైటింగ్. 


7. గ్రాఫిక్ డిజైన్


మీకు సృజన, ఆకట్టుకునేలా ప్రెజెంట్ చేసే నైపుణ్యం, ఏదైనా విషయాన్ని అక్షరాల్లో, బొమ్మలతో, కలర్స్ తో తెలియజెప్పే నైపుణ్యం ఉంటే గ్రాఫిక్ డిజైనర్ అయిపోవచ్చు. సోషల్ మీడియా పోస్టర్లు, ఆకట్టుకనే పాంప్లెట్లు తయారు చేయగలగాలి.


Also Read: Micro Handbag Auction: రవ్వంత ఉప్పు కూడా పట్టని ఆ బ్యాగ్‌కు రూ.అర కోటి, ఏం చేసుకుంటారు దాంతో?


8. ఈ-మెయిల్ మార్కెటింగ్


ఈ-మెయిల్ లో రకరకాల ప్రచార మెయిల్స్ వస్తుంటాయి చాలా మందికి. ఇలాంటి మెయిల్స్ పంపడం కూడా ఓ కళ. మన ఉత్పత్తి టార్గెట్ యూజర్లు ఎవరు, వారి వయస్సు, ఆడ లేదా మగ, ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు ఇలాంటి చాలా విషయాలపై ఆధారపడి ఈ-మెయిల్ మార్కెటింగ్ చేస్తుంటారు.


9. SEO (సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్)


ఏదైనా వెబ్ సైట్ విజిబిలిటీని, ర్యాంకింగ్ ను పెంచే పనిని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ పర్సన్స్ చేస్తుంటారు. గూగుల్ లో ఏదైనా సెర్చ్ చేసినప్పుడు గూగుల్ చూపించే వెబ్ సైట్లలో మనది టాప్ లో ఉండేలా చేయగలగాలి.


10. బ్లాగింగ్


మీకు ఏదైనా విషయం గురించి మంచి అవగాహన ఉందా. జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్ అంశాలపై పట్టు ఉందా. టెక్నాలజీ, వెహికల్స్, ఈవీ వెహికల్స్ లాంటి అంశాలు, వంటలు, ఫ్యాషన్ టిప్స్, మేకప్ టిప్స్ లాంటి వాటి గురించి మంచి అవగాహన ఉంటే.. మీకు మీరుగా బ్లాగింగ్ మొదలు పెట్టి రాయడమే. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial