Micro Handbag Auction: బ్యాగులు ఎవరైనా ఎందుకు కొంటారు. ఎక్కడికైనా వెళ్తుంటే కావాల్సిన వస్తువులు తీసుకెళ్లడం కోసం బ్యాగులు కొంటారు. దూర ప్రాంతాలకు, ఒకటీ రెండు రోజులు అంతకుమించి వెళ్తే బ్యాగులు తీసుకెళ్తారు. ఎందుకంటే వేసుకోవాల్సిన బట్టలు, కావాల్సిన వస్తువులు, అవసరమయ్యేవి చాలా ఉంటాయి కాబట్టి బ్యాగుల్లో వాటిని తీసుకెళ్తుంటారు చాలా మంది. చాలా మంది కాదు ప్రతి ఒక్కరూ అందుకే బ్యాగులు తీసుకెళ్తారు. స్త్రీలు ధరించే హ్యాండ్ బ్యాగులైనా.. అందులో లిప్‌స్టిక్, చిన్న అద్దం, ఫౌండేషన్ క్రీమ్, మాయిశ్చరైజర్, ఫోన్, కొద్ది మొత్తంలో డబ్పులు, క్రెడిట్ డెబిట్ కార్డులు, చిన్న పిల్లల తల్లులైతే డైపర్లు కూడా తీసుకెళ్తుంటారు. అసలు బ్యాగులు కొనడం వెనక ఉద్దేశమే.. వస్తువులను తీసుకెళ్లడం. అయితే ఈ మధ్య ఓ అత్యంత ధనిక వ్యక్తి ఓ బ్యాగు కొన్నాడు. ఆ వార్త కాస్త తెగ వైరల్ అవుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వార్తా సంస్థలు కూడా ఆ వార్తను ప్రచురిస్తున్నాయి. అంతగా ఏముంది ఆ బ్యాగులో అనుకుంటున్నారా? బంగారంతో చేశారేమో.. వజ్ర వైడుర్యాలు పొదిగారేమో.. అని అనుకుంటున్నారా? అయితే ఆ బ్యాగ్ ప్రత్యేకతల గురించి చెప్పాల్సిందే.


అదో అరుదైన బ్యాగు. ఆ బ్యాగును ఓ వ్యక్తి అర కోటి రూపాయలకు పైగా పెట్టి కొన్నాడు. ఆ బ్యాగును ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్లడం అసాధ్యం. దానిని తీసుకెళ్లాలంటే భారీ బందోబస్తు ఉండాలి. పూర్తి రక్షణ ఉంటేనే దానిని బయటకు తీసుకెళ్లవచ్చు. ఇక్కడ బందోబస్తు అంటే పోలీసులు, భద్రతా బలగాలు కాదు. ఆ బ్యాగును తీసుకెళ్లడానికి ఓ కంటైనర్ కావాలి. అందులో చాలా భద్రంగా దాచి పెట్టాలి. అలాగే ఈ బ్యాగును బయటకు తీసుకెళ్లినప్పుడైనా లేదా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు చూపించడానికైనా వెంట ఎప్పుడూ ఓ మైక్రోస్కోప్ ఉంచుకోవాలి. అవును నిజంగానే వెంట మైక్రోస్కోప్ ఉండాల్సిందే. ఎందుకంటే ఆ బ్యాగును నేరుగా కళ్లతో చూడలేం. ఎందుకంటే అది అంత చిన్నగా ఉంటుంది కాబట్టి. దానిని సరిగ్గా చూడాలంటే మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తేనే కనిపిస్తుంది. ఉప్పు రవ్వ కంటే చిన్నగా ఉంటుంది ఆ బ్యాగు. అలాంటి బ్యాగును చూడటానికి మైక్రోస్కోప్, తీసుకెళ్లడానికి భారీ రక్షణ ఉండాల్సిందే కదా.


అత్యంత విలువైన వస్తువులు, అరుదైన వాటిని వేలం వేస్తుంటారు. అంతర్జాతీయంగా పేరెన్నికగన్న సంస్థలు ఈ వేలం పాటలు నిర్వహిస్తుంటాయి. అలా ఈ అతి చిన్న బ్యాగు కూడా వేలం పాటకు వచ్చింది. ఈ బ్యాగును ఓ వ్యక్తి ఏకంగా రూ. 52 లక్షలకు పైగా వెచ్చించి విక్రయించాడు అంటే దాని రేంజ్ ఏంటో అర్థమవుతోంది. 


Also Read: Viral News: పగబట్టిన పాము! ఒక్కసారి కాటు వేస్తే చనిపోలేదని, రెండోసారి ఏం చేసిందంటే?


న్యూయార్క్ కు చెందిన ఆర్ట్ కలెక్టివ్ MSCHF ఈ అతి చిన్న బ్యాగును తయారు చేసింది. జూపిటర్ ఆక్షన్ హౌజ్ లో వేలం పాటకు వచ్చింది ఈ అతి చిన్న హ్యాండ్ బ్యాగ్. పసుపు- ఆకుపచ్చ ఫ్లోరోసెంట్ బ్యాగ్ ను 63,750 డాలర్లు, మన కరెన్సీలో చెప్పుకోవాలంటే ఏకంగా రూ.52,34,340 రూపాయలకు అమ్ముడుపోయింది. 657x222x700 మైక్రోమీటర్ల పరిమాణంలో ఉంటుంది. ఈ బ్యాగ్ ఎంత చిన్నది అంటే.. ఈ  బ్యాగ్ ను సూది రంధ్రం గుండా కూడా చాలా సులభంగా దూర్చవచ్చు. ఈ అతి చిన్న బ్యాగును విక్రయించే సమయంలో మైక్రోస్కోప్ తో ఉన్న బిల్ట్-ఇన్ డిజిటల్ డిస్‌ప్లే పై ఉంచి వేలం పాట నిర్వహించారు. ఈ బ్యాగ్ చూడటానికి అచ్చంగా లూయిస్ విట్టన్ తరహాలో కనిపిస్తోంది. ఈ బ్యాగ్ పై ఆ సంస్థ లోగోను కూడా ముద్రించడం విశేషం. MSCHF చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్, కెవిన్ వీస్నర్, బ్యాగ్ పై లూయిస్ విట్టన్ లోగోను వాడుకోవడానికి సదరు సంస్థ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని చెప్పడం గమనార్హం. ఈ బ్యాగ్ ను టూ-ఫోటాన్ పాలిమరైజేషన్ ఉపయోగించి తయారు చేశారు. దీనిని మెకానికల్ బయోటెక్ నిర్మాణాలను తయారు చేయడానికి ఉపయోగించే 3డి ప్రింటింగ్ టెక్నిక్ వాడి తయారు చేశారు. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial