SBI Cardless Cash Withdrawal: దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ బ్యాంక్‌ ఎస్‌బీఐ, తన కస్టమర్ల కోసం అద్భుతమైన ఫెసిలిటీస్‌ తీసుకొచ్చింది. డెబిట్‌ కార్డ్‌ మరిచిపోయి/లేకుండా ATMకు వెళ్లినా డబ్బు విత్‌డ్రా చేసుకునే ఛాన్స్‌ కల్పించింది. ఇలాంటి వెసులుబాటు గతంలోనే ఉన్నా, అప్పుడు SBI ATMల నుంచి మాత్రమే కార్డ్‌లెస్‌ విత్‌డ్రా సాధ్యమయ్యేది. ఇప్పుడు వచ్చింది దాని కొత్త అవతార్‌. SBI కస్టమర్‌లు ఇప్పుడు ఏ బ్యాంక్‌ ATM నుంచైనా డెబిట్‌ కార్డ్‌ లేకుండానే డబ్బులు తీసుకోవచ్చు. దీనిని 'ఇంటర్‌ఆపరబుల్‌ కార్డ్‌లెస్ క్యాష్‌ విత్‌డ్రాల్‌'గా (ICCW) పిలుస్తారు. 


ICCW సదుపాయం ఉన్న ఏ ATM నుంచయినా, SBI డెబిట్‌ కార్డు లేకుండానే క్యాష్‌ తీసుకోవచ్చు. ATM స్క్రీన్‌పై కనిపించే 'యూపీఐ క్యూఆర్‌ క్యాష్‌' (UPI QR Cash) ఫీచర్‌ ద్వారా ఇది సాధ్యమవుతుంది. 68వ బ్యాంక్‌ డే సందర్భంగా ఇంటర్‌ఆపరబుల్‌ కార్డ్‌లెస్‌ క్యాష్‌ విత్‌డ్రాయిల్‌ సదుపాయాన్ని తన కస్టమర్లకు స్టేట్‌ బ్యాంక్‌ పరిచయం చేసింది.


YONO యాప్‌లో UPI ఫీచర్స్‌
దీంతో పాటు, SBI తన డిజిటల్ బ్యాంకింగ్ యాప్ 'యోనో'ను (SBI Yono) కూడా మార్చేసింది, కొత్త ఫీచర్‌ యాడ్‌ చేసింది. ప్రస్తుత 5G యుగంలో మారుతున్న కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా SBI YONO యాప్‌ని అప్‌డేట్ చేసి, ఆదివారం నాడు రీలాంచ్‌ చేసింది. 


యోనో యాప్ పేరు 'యోనో ఫర్ ఎవ్రీ ఇండియన్'గా మారింది. ఈ యాప్‌లో UPI (Unified Payments Interface) ఫీచర్స్‌ యాడ్‌ అయ్యాయి. యూపీఐ ద్వారా.. బ్యాంక్‌ అకౌంట్‌తో సంబంధం లేకుండా కేవలం ఫోన్‌ నంబర్‌ ద్వారా అవతలి వ్యక్తి బ్యాంక్‌ అకౌంట్‌కు డబ్బులు పంపవచ్చు. QR కోడ్‌ స్కాన్‌ చేసి పేమెంట్స్‌ చేయవచ్చు. డబ్బులు రిసీవ్‌ చేసుకోవడానికి అవతలి వ్యక్తికి రిక్వెస్ట్‌ కూడా పంపవచ్చు. ఇప్పుడు SBI YONOలోనూ ఇవన్నీ చేయవచ్చు. 


స్టేట్‌ బ్యాంక్‌, యోనో యాప్‌ను 2017లో లాంచ్‌ చేసింది. అప్పట్నుంచి చాలా అప్‌డేషన్స్‌ తీసుకొచ్చి ప్రస్తుతం ఉన్న రూపానికి మార్చింది. ప్రస్తుతం, యోనో యాప్‌కు 6 కోట్ల మంది రిజిస్టర్డ్‌ యూజర్లు ఉన్నారు. గత ఆర్థిక సంవత్సరం 2022-23లో, బ్యాంక్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా, YONO యాప్‌ ద్వారానే 78.60 లక్షల మంది SBIలో సేవింగ్స్‌ అకౌంట్స్‌ ఓపెన్‌ చేశారు. 


ప్రతి భారతీయుడికి ఆర్థిక స్వేచ్ఛ, సౌలభ్యం, సాధికారత కల్పించే అత్యాధునిక డిజిటల్ బ్యాంకింగ్ సొల్యూషన్స్‌ను అందించడానికి SBI కట్టుబడి ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ దినేష్ ఖరా ప్రకటించారు. అంతరాయాలు ఉండని  డిజిటల్ ఎక్స్‌పీరియన్స్‌ కోసం, స్టేట్‌ బ్యాంక్‌ కస్టమర్ల అంచనాలను దృష్టిలో ఉంచుకుని YONO యాప్‌ను అప్‌డేట్‌ చేసినట్లు చెప్పారు. అప్‌డేటెడ్‌ యోనో యాప్‌తో బ్యాంక్‌ కస్టమర్లకు మరిన్ని మెరుగైన సేవలు లభిస్తాయని, యోనో ప్రయాణంలో ఇదో మైలురాయి అని అని ప్రకటించారు.


మరో ఆసక్తికర కథనం: ITR-1 ఎవరు ఫైల్‌ చేయకూడదు, మీరు రాంగ్‌ ఫామ్‌ నింపుతున్నారేమో?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial