తెలంగాణలో డిగ్రీ విద్యలో సంస్కరణల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ప్రవేశ విధానం, కొత్త కోర్సులు, స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు, ఇంటర్న్‌షిప్స్ తదితర మార్పులు ప్రవేశపెట్టిన ఉన్నత విద్యామండలి కొత్తగా సైబర్ సెక్యూరిటీ కోర్సును తీసుకొచ్చింది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే డిగ్రీలో నూతన కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. ఇకపై ప్రతి విద్యార్థి సైబర్ సెక్యూరిటీ కోర్సు (నాలుగు క్రెడిట్లుగా)ను అదనంగా చదవాల్సి ఉంటుంది.
అదేవిధంగా విద్యార్థుల సామర్థ్యాల మదింపునకు పరీక్షల నిర్వహణ విధానాన్ని, ప్రశ్నపత్రాల మూల్యాంకనాన్నీ కొత్త విధానంలో చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు ఆర్.లింబాద్రి అధ్యక్షతన జూన్ 9న హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కళాశాలలు, సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిత్తల్, మండలి ఉపాధ్యక్షుడు వి.వెంకటరమణ, ఓయూ వీసీ డి.రవీందర్‌తోపాటు వివిధ వర్సిటీ వీసీలు పాల్గొన్నారు.
ఐఎస్‌బీ నుంచి ఆచార్య చంద్రశేఖర్ శ్రీపాద, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆచార్య గరిమ మాలిక్ హాజరై ఐఎస్‌బీ అధ్యయనం చేసిన అసెస్‌మెంట్, ఎవాల్యుయేషన్ సిస్టం నివేదికను సమర్పించారు. సమావేశంలో డిగ్రీలో చేపట్టబోయే సంస్కరణలు, నూతన కోర్సులు, ఇతర అకాడమిక్ అంశాలపై చర్చించారు. ఎక్కువ సంఖ్యలో డిగ్రీ కళాశాలల్లో నైపుణ్య ఆధారిత కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. బీఎస్సీ(ఆనర్స్) కంప్యూటర్ కోర్సునూ ప్రారంభిస్తారు. డిగ్రీ చదివే ప్రతి విద్యార్థీ వాల్యూ అడిషన్‌లో భాగంగా సైబర్ సెక్యూరిటీ కోర్సును నాలుగు క్రెడిట్లుగా చదవాల్సి ఉంటుంది. ప్రధాన కోర్సులతోపాటు దీన్ని అదనంగా చదవాలి.
Also Read:
దేశవ్యాప్తంగా 50 కొత్త వైద్య కళాశాలలకు అనుమతి, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?
2023-24 విద్యాసంవత్సరానికి దేశంలో 50 కొత్త వైద్య కళాశాలలకు అనుమతి ఇచ్చినట్లు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) వెల్లడించింది. వీటిలో 30 ప్రభుత్వ కళాశాలలు కాగా, 20 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 18 కళాశాలలు ఉన్నాయి. వీటిలో తెలంగాణలో 13, ఏపీలో 5 వైద్య కళాశాలలు ఉన్నాయి. దేశంలో మొత్తం 8,195 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానుండగా.. తెలంగాణలో 1500, ఆంధ్రప్రదేశ్‌లో 750 సీట్లు పెరగనున్నాయని ఎన్ఎంసీ తెలిపింది. తెలంగాణలో ప్రారంభం కానున్న వైద్య కళాశాలల్లో 9 ప్రభుత్వ వైద్య కళాశాలలు కాగా 4 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి ఆసిఫాబాద్, వికారాబాద్, భూపాలపల్లి, జనగామ, సిరిసిల్ల, నిర్మల్ ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ వైద్య కళాశాలల్లో ఒక్కో దాంట్లో 100 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున మొత్తం 900 సీట్లు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
'జోసా' కౌన్సెలింగ్ షెడ్యూలు వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే!
దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో బీటెక్ సీట్ల భర్తీకి నిర్దేశించిన జోసా(జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ) షెడ్యూలు జూన్ 7న విడుదలైంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు జూన్ 18న వెలువడనున్నాయి. ఫలితాలు విడుదలైన మరుసటిరోజు నుంచే అంటే.. జూన్ 19 నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు జూన్ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. జోసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 19 నుంచి 29 వరకు కొనసాగనుంది.
జోసా కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..