దేశంలోని 142 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన సీయూఈటీ(పీజీ)-2023 తుది ఆన్సర్ 'కీ' విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జులై 19న ఆన్సర్ కీని విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీ చూసుకోవచ్చు. 


సీయూఈటీ(పీజీ)-2023  నోటిఫికేషన్‌ను ఎన్టీఏ మార్చి 20న వెలువడిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి మార్చి 20 నుంచి మే 5 వరకు దరఖాస్తులు స్వీకరించారు. మే 6, 7, 8 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. జూన్‌ 5 నుంచి 17 వరకు, జూన్ 22 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా 295 నగరాల్లో, విదేశాల్లో 24 నగరాల్లో 'సీయూఈటీ- పీజీ' పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 8,76.908 మంది విద్యార్థులు హాజరయ్యారు. జూన్ 13న ప్రిలిమినరీ ఆన్సర్ 'కీ' విడుదల చేశారు. ఆన్సర్ కీపై జూన్ 15 వరకు  త్వరలోనే ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.


సీయూఈటీ ఫైనల్ కీ కోసం క్లిక్ చేయండి..


ALSO READ:


ఏయూ-బీటీహెచ్‌ ఇంటిగ్రేటెడ్ బీఎస్‌ ఎంఎస్‌ ప్రోగ్రామ్‌, విదేశాల్లో చదివే ఛాన్స్!
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ, స్వీడన్‌లోని బ్లెకింగే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(బీటీహెచ్‌) సహకారంతో నిర్వహిస్తున్న బీఎస్‌-ఎంఎస్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఇది ఆరేళ్ల వ్యవధి గల ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌. మొదటి మూడేళ్లు ఏయూలో, చివరి మూడేళ్లు స్వీడన్‌ బీటీహెచ్‌లో చదవాల్సి ఉంటుంది. 
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


బీఆర్క్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే!
తెలంగాణలోని ఆర్కిటెక్చర్ కాలేజీల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్) సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కౌన్సిల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ నిర్వహించే ఆప్టిట్యూడ్‌ టెస్టు ఎన్‌ఏటీఏ (NATA)–2021లో (లేదా) జేఈఈ మెయిన్స్ పేపర్‌–2 (బీఆర్క్‌)–2021లో అర్హత సాధించినవారు, ఇంటర్ (ఎంపీసీ) లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు, పదోతరగతితోపాటు డిప్లొమా పూర్తిచేసిన వారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాష్ట్రవ్యాప్తంగా 10 ఆర్కిటెక్చర్ కాలేజీల్లో 830 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 12 నుంచి 22 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది.
ప్రవేశాల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


MAT: ‘మ్యాట్'-2023 సెప్టెంబరు నోటిఫికేషన్ వెల్లడి, పరీక్ష షెడ్యూలు ఇలా!
ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేట్‌ (ఏఐఎంఏ)-2023 సెప్టెంబర్ సెషన్‌ మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (MAT) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ, ఇతర ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏఐఎంఏ మ్యాట్‌ను ఏటా నాలుగుసార్లు (ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్) నిర్వహిస్తుంది. తాజాగా మ్యాట్ 2023 సెప్టెంబరు నోటిఫికేషన్ విడుదలైంది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


ఇకపై ఆ కాలేజీల్లోనూ ఎంఫిల్, పీహెచ్‌డీ పరిశోధనలకు ఛాన్స్!
ఎంఫిల్, పీహెచ్‌డీ పరిశోధనలు చేయాలనుకునేవారికి జేఎన్‌టీయూ హైదరాబాద్ శుభవార్త వినిపించింది. ఇకపై జేఎన్‌టీయూ అనుబంధ కళాశాలల్లోనూ విద్యార్థులు పరిశోధనలు చేసుకునే వెసులుబాటు కల్పించింది. రాష్ట్రంలో 170 ఇంజినీరింగ్ కళాశాలల్లో ఎంఫిల్, పీహెచ్‌డీ పరిశోధనలకు అవకాశం కల్పిస్తున్నట్లు జేఎన్‌టీయూహెచ్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జేఎన్‌టీయూ అనుబంధ ఇంజినీరింగ్ కాలేజీల్లో పీహెచ్‌డీ ప్రవేశాలు, పరిశోధనలను నిర్వహించేందుకుగాను ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..