తెలంగాణలోని ఆర్కిటెక్చర్ కాలేజీల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్) సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కౌన్సిల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ నిర్వహించే ఆప్టిట్యూడ్‌ టెస్టు ఎన్‌ఏటీఏ (NATA)–2021లో (లేదా) జేఈఈ మెయిన్స్ పేపర్‌–2 (బీఆర్క్‌)–2021లో అర్హత సాధించినవారు, ఇంటర్ (ఎంపీసీ) లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు, పదోతరగతితోపాటు డిప్లొమా పూర్తిచేసిన వారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాష్ట్రవ్యాప్తంగా 10 ఆర్కిటెక్చర్ కాలేజీల్లో 830 సీట్లు అందుబాటులో ఉన్నాయి.


ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 12 నుంచి 22 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసిన అభ్యర్థులకు జులై 23 నుంచి 31 వరకు ధ్రువపత్రాల  పరిశీలన నిర్వహిస్తారు. తదనంతరం ఆగస్టు 5, 6 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నవారికి ఆగస్టు 8న బీఆర్క్ సీట్లకు కేటాయిస్తారు. 


మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తయిన తర్వాత మిగిలిపోయిన సీట్ల భర్తీకి ఆగస్టు 13, 14 తేదీల్లో రెండో విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. ఆగస్టు 16న రెండో విడత బీఆర్క్ సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇక ఆగస్టు 16న బీఆర్క్ స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు. సెప్టెంబరు 1న బీఆర్క్ తరగతులు ప్రారంభంకానున్నాయి. 


వివరాలు...


* బీఆర్క్ (రెగ్యులర్) డిగ్రీ.


సీట్ల సంఖ్య: 830.


కోర్సు వ్యవధి: 5 సంవత్సరాలు.


అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్ (ఎంపీసీ) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 45 శాతం మార్కులుంటే సరిపోతుంది. (లేదా) పదోతరగతితోపాటు 50 శాతం మార్కులతో మూడేళ్ల డిప్లొమా ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 45 శాతం మార్కులుంటే సరిపోతుంది. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్.


సీట్ల కేటాయింపు: కౌన్సెలింగ్ ఆధారంగా.


రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.1800. ఎస్సీ, ఎస్టీలు రూ.900 చెల్లిస్తే సరిపోతుంది.


ముఖ్యమైన తేదీలు...


➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 12.07.2023.


➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 22.07.2023.


➥ ధ్రువపత్రాల పరిశీలన: 23.07.2023 - 31.07.2023.


➥ వెబ్‌ఆప్షన్ల నమోదు: 05.08.2023, 06.08.2023.


➥ సీట్ల కేటాయింపు: 08.08.2023. 


➥ మిగిలిపోయిన సీట్ల భర్తీకి వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ: 13.08.2023, 14.08.2023.


➥ రెండో విడత సీట్ల కేటాయింపు: 16.08.2023. 


➥ స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు: 16.08.2023.  


➥ బీఆర్క్ తరగతులు ప్రారంభం: 01.09.2023 


Notification


Online Registration


Website


ALSO READ:


భారత్‌లోని టాప్ 10 మేనేజ్‌మెంట్ విద్యాసంస్థలు ఇవీ!
టెక్నాలజీ విద్యతో పాటు ఎప్పుడూ బూమింగ్ లో ఉండే మరో కోర్సు మేనేజ్‌మెంట్. బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సులు, గ్రూపులకు ఎప్పుడూ క్రేజ్ ఉంటూనే ఉంటుంది. ఇందులో రకరకాల స్ట్రీమింగ్ లు ఉంటాయి. పేరున్న ఐటీ విద్యాసంస్థల్లో ఉన్నత చదువులు చదివిన వారు కూడా బిజినెస్ మేనేజ్‌మెంట్ తప్పకుండా చేస్తుంటారు. టెక్నాలజీపై ఎంత గ్రిప్ అవసరమో.. అంతే మేనేజ్‌మెంట్ వైపు కూడా ఉండాలని అనుకుంటారు. ఎందుకంటే టెక్నాలజీ సంబంధిత కోర్సులు, ఉద్యోగ అనుభవంతో పాటు మేనేజ్‌మెంట్ డిగ్రీ ఉన్న వారినే చాలా సంస్థలు ఉన్నత పదవులకు రిక్రూట్‌ చేసుకుంటాయి. అయితే మీరు కూడా మేనేజ్‌మెంట్ డిగ్రీ చేయాలని అనుకుంటుంటే.. భారత్‌ లోని టాప్ 10 మేనేజ్‌మెంట్ కాలేజీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్- NIRF 2023 ఆధారంగా టాప్ లో ఉన్న మేనేజ్‌మెంట్ విద్యాసంస్థలు ఏంటో చూద్దాం.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విద్యలో టాప్ 10 దేశాలు ఇవే!
ఈరోజుల్లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. నేటి టెక్నాలజీ యుగంలో ఈ కోర్సు చదివేందుకు చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు. అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు, అంతకుమించిన వేతనాలు, భవిష్యత్తు అంతా టెక్నాలజీ రంగానిదే కావడంతో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదివేందుకే చాలా మంది మొగ్గు చూపిస్తున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల చూపు ఇప్పుడు సీఎస్ఈ గ్రూపుపైనే ఎక్కువగా ఉంటోంది. చాలా కాలేజీల్లో సీఎస్ఈ గ్రూపు సీట్లు ఇట్టే ఫిల్ అయిపోతున్నాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం. దీంట్లో ఎన్నో అవకాశాలు ఉంటున్నాయి. విదేశాల్లో కంప్యూటర్ సైన్స్ చేసిన వారికి డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. కాబట్టి.. ఇటీవలి సర్వే ప్రకారం కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదివేందుకు టాప్ 10 దేశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
పూర్తి వివరాల కోస క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial