Andhra Pradesh: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌, వచ్చేనెలలో డీఎస్సీ నోటిఫికేషన్!

ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం తీపికబురు వినిపించింది. రాష్ట్రంలోని ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

Continues below advertisement

ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం తీపికబురు వినిపించింది. రాష్ట్రంలోని ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం (జులై 11) ఒక ప్రకటనలో తెలిపారు. టీచర్ పోస్టుల భర్తీకి సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారని మంత్రి స్పష్టంచేశారు.

Continues below advertisement

ఏప్రిల్‌లో మంత్రి బొత్స ఏమన్నారంటే?
త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గత ఏప్రిల్‌లోనే ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలను అధికారులు సిద్ధం చేస్తున్నారని అప్పుడే ప్రకటించారు. డీఎస్సీ నోటిఫికేషన్ విషయంపై సీఎం జగన్ విధానపరమైన నిర్ణయం తీసుకుంటారని మంత్రి బొత్స తెలిపారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలపై సమీక్షించామని, త్వరలో బదిలీలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. బదిలీలకు పారదర్శకమైన విధానాన్ని తీసుకొస్తామని మంత్రి తెలిపారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాలలోని అంశాలను కూడా పరిశీలిస్తున్నామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల అంశంపై కూడా పరిశీలిస్తున్నామని.. సీఎం జగన్ దీని పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారని బొత్స తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని బొత్స చెప్పారు. ఇదే అంశాన్ని ఒప్పంద అధ్యాపకులకు చెప్పామన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇస్తామన్నారు. 

ALSO READ:

పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌లో 1045 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు, అర్హతలివే!
హరియాణా రాష్ట్రం గురుగ్రామ్‌లోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(పీజీసీఐఎల్‌) 2023-24 సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న పీజీసీఐఎల్‌ రీజియన్లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. విభాగాన్ని అనుసరించి పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్‌, బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ, ఎంబీఏ ఉత్తీర్ణత గల వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జులై 31 లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఎయిమ్స్‌ భువనేశ్వర్‌లో 775 గ్రూప్ బి, సి పోస్టులు, అర్హతలివే!
ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్‌) వివిధ గ్రూప్ బి, సి (నాన్ ఫ్యాకల్టీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతితో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ, 10+2, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత గల వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ఉద్యోగ ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 30 రోజుల్లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్/ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ తదితరాల ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఇండియన్ ఆర్మీలో ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్- 55వ కోర్సు, వివరాలు ఇలా!
ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 55వ కోర్సుకు అర్హులైన అవివాహిత పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఎన్‌సీసీ- సి సర్టిఫికేట్ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఆగస్టు 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement
Sponsored Links by Taboola